ఎడ్మండ్ హేలీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, , → , using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
'''ఎడ్మండ్‌ హేలీ''' FRS (/ˈɛdmənd ˈhæli/;<ref name=jones>{{cite book |last1=Jones |first1=Daniel |authorlink1=Daniel Jones (phonetician) |last2=Gimson |first2=Alfred C. |authorlink2=Alfred C. Gimson |title=Everyman's English Pronunciation Dictionary |edition=14 |series=Everyman's Reference Library |year=1977 |origyear=1917 |publisher=J. M. Dent & Sons |location=London |isbn=0-460-03029-9}}</ref><ref name=kenyon>{{cite book |last1=Kenyon |first1=John S. |authorlink1=John Samuel Kenyon |last2=Knott |first2=Thomas A. |authorlink2=Thomas Albert Knott |title=A Pronouncing Dictionary of American English |year=1953 |publisher=Merriam-Webster Inc. |location=Springfield, MA |isbn=0-87779-047-7}}</ref> [[నవంబర్ 8]], [[1656]] - [[జనవరి 14]] [[1742]]) ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, భూగర్భ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, మెటెరాలజిస్టు మరియు భౌతిక శాస్త్రవేత్త. ఈయన హెల్లీ తోకచుక్క యొక్క కక్ష్యలు కనుగొనుటలో ప్రపంచ ప్రసిద్ధుడు.
 
తోకచుక్కల[[తోకచుక్క]]<nowiki/>ల అన్వేషకుడు!నక్షత్రాలంటే ఆ కుర్రాడికి ఎంతో ఇష్టం. ఏవేవో పరికరాలతో వాటిని గమనిస్తూ ఉండేవాడు. ఆ కుర్రాడే ఖగోళ శాస్త్రవేత్తగా మారి ఎన్నో సంగతులు వెల్లడించాడు. అతడే ఎడ్మండ్‌ హేలీ. పుట్టిన రోజు ఇవాళే-1656 నవంబర్ 8న. అంతరిక్షంలోని అద్భుతాల్లో తోకచుక్కలోకటి. వాటిపై పరిశోధన చేసి ఆశ్చర్యకరమైన నిజాలు వెల్లడించిన శాస్త్రవేత్తగా ఎడ్మండ్‌ హేలీ పేరొందాడు. అందుకు గౌరవసూచకంగా ఓ తోకచుక్కకు ఆయన పేరే పెట్టారు. అదే 76 ఏళ్లకోసారి భూమికి[[భూమి]]<nowiki/>కి దగ్గరగా వచ్చి కనువిందు చేసే హేలీ తోకచుక్క. ఖగోళ, భూభౌతిక, గణిత రంగాల్లో కూడా ఆయన విలువైన పరిశోధనలు చేశారు.
 
ఇంగ్లాండులోని హాంగర్‌స్టన్‌లో 1656 నవంబర్ 8న ఓ సంపన్న కుటుంబంలో పుట్టిన హేలీ ప్రాథమిక విద్యను ఇంటి వద్దనే అభ్యసించాడు. స్కూల్లో చేరేప్పటికే తండ్రి కొనిచ్చిన పరికరాల సాయంతో అంతరిక్ష పరిశీలన చేశాడు. పదిహేడేళ్ల వయసులో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలోని క్వీన్స్‌ కాలేజీలో చేరేటప్పటికే [[సౌరమండలము|సౌరకుటుంబం]] గురించి పరిశోధన పత్రాలు వెలువరించగలిగాడు. ఖగోళ పరిశీలనపై ఆసక్తితో సొంతంగా 24 అడుగుల పొడవుండే టెలిస్కోపును[[టెలిస్కోపు]]<nowiki/>ను రూపొందించుకుని, దక్షిణ అట్లాంటిక్‌లోని సెయింట్‌ హెలీనా దీవికి వెళ్లి 341 నక్షత్రాలపై అధ్యయనం చేశాడు. ఫలితంగా ఆక్స్‌ఫర్డ్‌ నుంచి ఎమ్మే డిగ్రీ పొంది ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీగా కూడా ఎంపికయ్యాడు. భూ అయస్కాంతత్వంలోని మార్పులు, [[వాయువులు]], సముద్రంలోని[[సముద్రం]]<nowiki/>లోని ఆటుపోట్లను వివరించే మ్యాపులను హేలీ తయారు చేశారు. ఎత్తును బట్టి పీడనం ఎలా మారుతుందో చెప్పే నియమాన్ని ప్రతిపాదించారు. భూమి వయసు కనుగొనడం, ఇంద్రధనుసులోని[[ఇంద్రధనుస్సు]]<nowiki/>లోని వర్ణకాంతుల విశ్లేషణ, [[పరమాణువు]] పరిమాణం గురించిన ఎన్నో పరిశోధనలు చేశారు. సముద్రపు లోతుల్లోకి వెళ్లేవారి కోసం డైవింగ్‌బెల్‌, హెల్మెట్‌లాంటి పరికరాలు రూపొందించారు. జామెట్రీ, లాగరిథమ్స్‌, ట్రిగనామెట్రీలకు సంబంధించిన సూత్రాలు కనుగొన్నారు. భూమికి, సూర్యునికి మధ్య దూరం, విశ్వం రూపం, [[పరిమాణం]], నక్షత్రాల సంఖ్యలను అంచనా వేశారు.
 
సూర్యుడికి సుదూరంగా తిరుగుతూ ఎప్పుడో ఓసారి సూర్యకుటుంబం పరిధిలోకి వచ్చిపోయే తోకచుక్కల[[తోకచుక్క]]<nowiki/>ల గమనాలు, కక్ష్యల గురించి ఆయన పరిశోధనలు అద్భుతమైనవి. అంతకు పూర్వం 1531, 1607, 1683లలో కనిపించిన తోకచుక్కలు వేర్వేరు కావని, ఒకటే ప్రతి 76 ఏళ్లకువస్తోందని చాటి చెప్పారు. అదే హేలీ తోకచుక్క. అంతేకాదు [[న్యూటన్ సూత్రాలు|న్యూటన్‌]] సిద్ధాంతాలను వెలుగులోకి తెచ్చింది ఈయనే. ప్రచారానికి దూరంగా ఉండే న్యూటన్‌ పరిశోధనలు ఎంత విలువైనవో గ్రహించిన హేలీ, ఆయన చేత పుస్తకాన్ని రాయించి సొంత ఖర్చుతో అచ్చు వేయించారు. తద్వారా శాస్త్రలోకానికి ఎంతో మేలు చేశారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎడ్మండ్_హేలీ" నుండి వెలికితీశారు