మగ్దూం మొహియుద్దీన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 27:
'''మగ్దూం మొహియుద్దీన్‌''' ('''Makhdoom Mohiuddin''') (ఉర్దూ: ), ([[ఫిబ్రవరి 4]], [[1908]] - [[ఆగష్టు 25]], [[1969]]) స్వాతంత్ర్య సమరయోధుడు, మహాకవి, ప్రముఖ కార్మిక నాయకుడు, [[ఉర్దూ]] కవి, [[హైదరాబాదు]] సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకరు.
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
{{వికీకరణ}}
మగ్దూం మొహియుద్దీన్ [[తెలంగాణ]] లోని [[మెదక్]] జిల్లా [[ఆందోల్]] లో [[1908]], [[ఫిబ్రవరి 4]] న జన్మించాడు. ఆయన పూర్తిపేరు అబూ సయీద్ మహ్మద్ మఖ్దూమ్ మొహియొద్దీన్ ఖాద్రి (మహ్మద్‌ మగ్దూం మొహియుద్దీన్‌ హుజ్రీ) . వీరి పూర్వీకులదిపూర్వీకులు [[ఉత్తర ప్రదేశ్]] లోని ఆజంగఢ్‌ లో ఉండేవారు. ఆయన తాత (తల్లితండ్రి) రషీదుద్దీన్ [[ఔరంగజేబు]] సైన్యాలతో పాటు దక్కన్ పీఠభూమికి వచ్చాడు. అలాగే, మరో తాత (తంవూడికి తండ్రి) సయ్యద్ జాఫర్ అలీ కూడా ఉత్తరవూపదేశ్ షాజహానాబాద్ నుండి 1857లోనే దక్షిణానికి వచ్చాడు. ఆ రకంగా ఆ కుంటుంబమంతా [[హైద్రాబాద్]] దక్కన్ పరిసరాలకు చేరింది. ఆయన తండ్రి గౌస్ మొహియొద్దీన్ [[నిజాము]] ప్రభుత్వంలో సూపరింటెండెంటుగా పనిచేసేవాడు. మగ్దూం చిన్నతనంలోనే నాలుగేళ్ళయినా రాకముందే తండ్రి చనిపోయాడు. తల్లి మరో పెళ్ళి చేసుకోవడంతో మగ్దూం తన బాబాయి బషీరుద్దీన్ వద్ద పెరిగాడు. ప్రాథమిక విద్య హైదరాబాదు లోని ధర్మవంత హైస్కూల్లోను, మెట్రిక్యులేషను [[సంగారెడ్డి]]లోను చదివాడు. మఖ్దూం తండ్రి పరమ భక్తుడు- మహమ్మద్ గౌస్ మొహియుద్దీన్. తల్లి- ఉమ్దా బేగం. భర్త మరణానంతరం ఆమె వేరే వివాహం చేసుకుంది. పినతండ్రి బషీరుద్దీన్ పెంచాడు. 1929లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో చేరారు. పిన తండ్రి కొడుకు నిజాముద్దీన్ మఖ్దూమ్‌ను వెన్నంటి ఉన్నాడు. పినతండ్రి బషీరుద్దీన్ పెంపకంలో మఖ్దూమ్ సూఫీ మత సాంప్రదాయంలో క్రమశిక్షణతో పెరిగాడు.

== తొలి జీవితం ==
బతకడానికి పెయింటింగ్స్ అమ్మాడు. సినిమా తారల ఫొటోలు అమ్మాడు, ట్యూషన్లు చెప్పాడు, పత్రికల్లో పనిచేశాడు. ఆయన రాసిన ‘గోథే ప్రేమ లేఖలు’ ‘మక్తబా’ అనే స్థానిక ఉర్దూ పత్రిక అచ్చేసింది. (ఆ పత్రిక సంపాదకుడు అబ్దుల్ ఖాదరీ సర్వరీ తర్వాతి కాలంలో కాశ్మీర్ వెళ్ళిపోయి అక్కడ ఉర్దూ ప్రొఫెసర్‌గా పనిచేశాడు).
 
[[ఉస్మానియా యూనివర్సిటీ]]లో మఖ్దూమ్ (1934-37) హాస్టల్‌లో ఉండేవాడు. అక్కడ తన తొలి కవిత ‘టూర్’ 1934లో రచించాడు. మఖ్దూమ్, [[కవి]]గా, నాటక రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడయ్యాడు. 1934లో బెర్నార్డ్ షా నాటకానికి ‘హోష్ కె నా ఖూన్’ అనే ఉర్దూ అనుసరణ రాసి హైద్రాబాద్‌లో రవీంవూదనాథ్ ఠాగూర్ సమక్షంలో ప్రదర్శించాడు. గురుదేవులు ఆ నాటకం చూసి ఆనందం పట్టలేక, నాటక ప్రదర్శన అయిపోగానే స్టేజిపైకి వెళ్ళి మఖ్దూమ్‌ని అభినందించి, తన శాంతినికేతన్‌కు వచ్చి చదువుకోవాల్సిందిగా ఆహ్వానించారు.మఖ్దూమ్ ‘మర్షదే కామిల్’ అనే మరో నాటకం రాశాడు.1937లో మఖ్దూమ్ తన 29వ యేట ఎం.ఎ. డిగ్రీ తీసుకున్నాడు. ‘ఉర్దూ నాటకం’పై ఒక పరిశోధన పత్రం కూడా రాశాడు.హైకోర్టు పక్కన గల సిటీ కాలేజీలో అధ్యాపకుడిగా ఉద్యోగం దొరికింది. [[కమ్యూనిస్టు]] రహస్య పత్రిక ‘నేషనల్ ఫ్రంట్’ సంపాదించి చదివేవాడు. నాగపూర్ కామ్రేడ్ల సహాయంతో 1930-40లలో హైద్రాబాద్‌లో ‘స్టూడెంట్స్ యూనియన్’ ప్రారంభించాడు. 1940లో తన సహచరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. [[చండ్ర రాజేశ్వరరావు]], గులాం హైదర్, రాజ బహుదూర్ గౌర్, హమీదలీ ఖాద్రీ లాంటి నాయకులతో కలిసి పనిచేస్తుండేవాడు.‘‘రైతుకు రొట్టె నివ్వని పొలమెందుకు, కాల్చేయండి ప్రతి గోధుమ కంకిని!’’ అనే ఇక్బాల్ కవితను నినదించేవాడు.
అక్తర్ హుస్సేన్ రాయ్‌పురి, సిబ్తె హసన్‌లతో కలిసి హైద్రాబాద్‌లో ‘అభ్యుదయ రచయితల సంఘం’ స్థాపించాడు. సరోజినీ నాయుడు నివాసం (గోల్డెన్ త్రెషోల్డ్) లో [[ఎన్.ఎం.జయసూర్య|డాక్టర్ జయసూర్య]], జె.వి. నర్సింగరావులతో కలిసి సాహిత్య, సామాజిక, రాజకీయ అంశాలపై చర్చలు జరుపుతుండేవాడు. [[చార్మినార్]] సిగట్ ఫ్యాక్టరీ, బట్టల గిర్నీ, అల్విన్, షాబాద్ సిమెంట్, ఎన్ ఎస్సార్ రైల్వే ఎంప్లాయిస్, ఎలక్ట్రిసిటీ, సి.డబ్ల్యు.డి. మున్సిపాలిటీ, బటన్ ఫ్యాక్టరీ వంటి వందల కంపెనీల్లోని కార్మిక సంఘాలకు మఖ్దూమ్ అధ్యక్షుడయ్యాడు. అహో రాత్రులు వారి సంక్షేమం కోసం కృషి చేశాడు.