బిరుదురాజు రామరాజు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
}}
== బాల్యం - విద్యాభ్యాసం ==
బిరుదురాజు రామరాజు [[1925]] [[ఏప్రిల్ 16]] వ తేదీ [[దేవునూర్|దేవనూరు]] గ్రామంలో లక్ష్మీదేవమ్మ, బిరుదురాజు నారాయణరాజు దంపతులకు జన్మించాడు<ref>{{cite web|last1=కె.|first1=విద్యావతి|title=మన జానపదబ్రహ్మ బిరుదురాజు రామరాజు|url=http://telanganaliterature.blogspot.in/2014/05/blog-post_4748.html|website=తెలంగాణా సాహితీవనం|accessdate=1 January 2015}}</ref>. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం [[వరంగల్]] జిల్లా [[మడికొండ (గ్రామీణ)|మడికొండ]] లో నడిచింది. మూడవ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు [[ఉర్దూ]] మీడియంలో చదువుకున్నాడు. [[మెట్రిక్యులేషన్|మెట్రిక్]] చదివేటప్పుడు 11వ ఆంధ్రమహాసభల సందర్భంగా [[మహాత్మాగాంధీ]] [[వరంగల్]] వచ్చినప్పుడు ఇతడు ఆ సభలలో వాలంటీర్‌గా పాల్గొన్నాడు. [[మహాత్మాగాంధీ]] తో కలిసి [[పాదయాత్ర]] చేశాడు. [[వరంగల్‌]] లో చదువుకునే రోజుల్లో ఇతనిపై ఆర్యసమాజం ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆ తరువాత [[హైదరాబాదు]] లోని [[నిజాం కళాశాల]] లో బి.ఎ. చదువుకున్నాడు. ఆ సమయంలో [[దాశరథి కృష్ణమాచార్య]] తో పరిచయం కలిగింది. [[నిజాం]] వ్యతిరేక రాజకీయోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/బిరుదురాజు_రామరాజు" నుండి వెలికితీశారు