ఆరెకటిక: కూర్పుల మధ్య తేడాలు

Cleanup
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
బి.సి.డి.గ్రూపులోని కులం. కటికోళ్ళు అని కూడా వీరిని అంటారు. వాస్తవానికి వీరు [[కత్తి]] పడతారు గానీ ఏ [[జంతువు]] [[ప్రాణము|ప్రాణం]] తీయరు. [[మాంసము]] అమ్మటం `'''ఆరె కటిక''''ల కుల వృత్తి. అది కూడా [[పొట్టేలు|గొర్రె]], [[మేక]] మాంసమే తప్ప [[ఆవు|`గో']] మాంసం కాదు. లోతుగా పరిశీలిస్తే వీరు కత్తిపడతారే తప్ప ఏ [[జంతువు]] ప్రాణం తీయరు. వేరెవరో ప్రాణం తీసిన జీవి చర్మాన్ని వలిచి ఆ కళేబరాన్ని శుభ్రపరిచి, ముక్కలు కొట్టి అమ్ముతారు. చేతిలో [[కత్తి]], [[రక్తం|రక్తపు]] మరకలతో కనిపిస్తారు గానీ నరహంతకులు కాదు. దళితుల మాదిరిగానే ఈ కులస్తులు రాష్ట్రమంతటా అంటరానితనానికి గురవుతున్నా [[ప్రభుత్వం]] వీరిని బిసీ-డి గానే గుర్తిస్తోంది. యస్సీలలో కలపాలని వీరి డిమాండు. [[మాంసము]] అమ్ముతారు కనుక వీరి వల్ల [[కాలుష్యం]] పెరుగుతుందనేది ఆరోపణ. ఆ దుర్గంధాన్ని భరించలేమనేదే సమాజంలోని ఇతర వర్గాల వాదన. [[ఉత్తర ప్రదేశ్]], [[హర్యానా]], [[జమ్మూ కాశ్మీరు]], [[మహారాష్ట్ర]], [[మధ్య ప్రదేశ్|మధ్యప్రదేశ్‌]], [[రాజస్థాన్]], [[ఉత్తరాఖండ్]], [[ఢిల్లీ]], [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రాలలో ఈ కులస్తులను ఎస్సీలుగానే గుర్తించినా మన రాష్ట్రంలో మాత్రం బీసీ-డీలోనే కొనసాగుతున్నారు.
 
[[కల్లు]] దుకాణాల మూసివేతతో ఈ [[వృత్తులు|వృత్తి]]దారులు రోడ్డున పడ్డారు. [[పురుషుడు|పురుషులు]] మాంసము దుకాణాలలో ఉంటే, [[స్త్రీ|మహిళలు]], [[పిల్లలు]] కల్లు దుకాణాల్లో [[పొట్టేలు|గొర్రె]], [[మేక]] లకు సంబంధించిన ప్రేగులు, [[చెవి|చెవులు]], [[కాలు|కాళ్ళు]], [[తల]] భాగాలతో తయారు చేసే [[వంట]]కాలు (బోటీ, చాక్నా) ను విక్రయిస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు రక్తాన్ని ఉడకబెట్టి [[కారము|కారం], [[ఉప్పు|ఉప్పూ]] కలిపి అమ్మేవారు. [[కాలేయం|కాలేయాన్ని]] [[వేపుడు]] చేసి విక్రయించేవారు. మరికొందరు జాతర ల్లోనూ, వారానికి ఒక రోజు జరిగే [[సంత]]లకు వెళ్ళి పచ్చి మాంసము అమ్ముతుంటారు.
 
బతుకు బండిని లాగడానికి ఇలా ఎన్నో వ్యయప్రయాసలు పడే ఈ కుటుంబాలు [[కల్లు]] దుకాణాల మూసివేతతో [[ఉపాధి]]ని కోల్పోయారు.`కులవృత్తులు కొనసాగిస్తున వారికి ఫెడరేషన్లు ఇస్తున్న రాష్ట్రప్రభుత్వం మాకూ ప్రత్యేక ఫెడరేషన్‌ ఇవ్వాలి' అని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. లేబర్‌ పని చేస్తున్నాం కనుక లేబర్‌యాక్టు ప్రకారం తమకూ ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని [[నాయీ బ్రాహ్మణులు|నాయీ బ్రాహ్మణులకు]] క్షౌరశాలలు, [[చాకలి|రజకులకు]] దోబీఖానాలు కేటాయించినట్లు తమ వృత్తి చేసుకునేందుకూ స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కొరుతున్నారు. కోసిన మాంసము నిల్వ ఉంచుకునే సౌకర్యం తమకు లేదు కనుక సాయంత్రానికి మాంసం అమ్ముడు పోక మిగిలిపోతే ఎవరో ఒకరికి అప్పుగా ఇచ్చి తర్వాత నిదానంగా వసూలు చేసుకుంటారు. పెట్టుబడి ఉన్నవారు ఫ్రిజ్‌లో పెట్టి అమ్ముకుంటారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆరెకటిక" నుండి వెలికితీశారు