మాలపిల్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
మాలపిల్ల సినిమా మంచి విజయం సాధించింది. సినిమాపై రేకెత్తిన వివాదాలు మాలపిల్ల సినిమాను ప్రచారంలోకి తీసుకురావడానికి ఉపకరించి విజయానికి దోహదం చేశాయి. వసూళ్ళపరంగానూ, విడుదలైన థియేటర్ల పరంగానూ కూడా మాలపిల్ల అప్పటి సినిమా రంగంలో కొత్త రికార్డులు నెలకొల్పింది. సినిమా విడుదల సమయంలో వచ్చిన సమీక్షలు సినిమాకు సానుకూలంగా రాలేదు. ఆంధ్రపత్రికలో సినిమా విడుదలకు ముందే ప్రచురితమైన సమీక్షలో "కళ్యాణపురంలో బ్రాహ్మణులకు, హరిజనులకు తప్ప మిగతా కులాల వారందరికీ ఈ సమస్య (ఛాందసం, మౌఢ్యం) సంబంధం లేకుండా ఎందుకు చేశారో బోధపడకుండా ఉంది. నాగరాజు, శంపాలతల మధ్య చూపించింది ప్రేమగా కాక కామంగా అగుపిస్తుంది. ఉదాత్తమైన ప్రేమానుబంధం లేకపోవడం వల్ల ఈ పాత్రలు సానుభూతికి నోచుకోకుండా పోయాయి" అని విమర్శించారు. అయితే సమకాలీన విమర్శకుల స్పందన మిశ్రమంగానూ, కొంత వ్యతిరేకంగానూ ఉన్నా కాలానుగుణంగా సినిమాను విమర్శకులు క్లాసిక్ గా గుర్తించారు. సాంఘిక సమస్యలపై సాహసోపేతంగా తీసిన సినిమాగా తెలుగు సినిమా రంగంలో ప్రత్యేక స్థానం ఇచ్చారు.
==వివాదాలు==
మాలపిల్ల సినిమా అత్యంత వివాదాస్పదమైన, వాదవివాదాలకు కారణమైన సినిమా. కుల మౌఢ్యం అన్ని కులాల వారిలోనూ ఉండగా కేవలం బ్రాహ్మణుల మీదనే కేంద్రీకరించి తీశారన్న విమర్శతో బ్రాహ్మణులు వ్యతిరేకించారు. విజయవాడ బ్రాహ్మణ సంఘం నియమించగా పండ్రంగి కేశవరావు అనే ప్రముఖుడు సినిమాను సమీక్షించి సినిమాకు అననుకూలమైన నివేదిక సంఘానికి సమర్పించాడు. బ్రాహ్మణులకు, హరిజనులకు మధ్య వైషమ్యాలు రేకెత్తించేందుకు, బ్రాహ్మణుల పట్ల ద్వేషం రగిలించేందుకు సినిమా తీశారంటూ అభ్యంతరకరమైన సన్నివేశాలను, సంభాషణలను తొలగించి పునర్నిర్మించేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాకినాడ ఈశ్వర పుస్తక భాండాగారం వారు సినిమాను నిషేధించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. సినిమా ప్రభావంతో కొన్ని పట్టణాల్లో పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించారు. దాంతో పట్టణాల మున్సిపాలిటీలు సినిమా నిషేధించాలని ప్రయత్నాలు చేశాయి. అయితే వీటివల్ల సినిమా నిషేధం కానీ, ప్రదర్శనలకు ఆటంకం కానీ కాలేదు.
 
==థీమ్స్==
"https://te.wikipedia.org/wiki/మాలపిల్ల" నుండి వెలికితీశారు