మాలపిల్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
==వివాదాలు==
మాలపిల్ల సినిమా అత్యంత వివాదాస్పదమైన, వాదవివాదాలకు కారణమైన సినిమా. కుల మౌఢ్యం అన్ని కులాల వారిలోనూ ఉండగా కేవలం బ్రాహ్మణుల మీదనే కేంద్రీకరించి తీశారన్న విమర్శతో బ్రాహ్మణులు వ్యతిరేకించారు. విజయవాడ బ్రాహ్మణ సంఘం నియమించగా పండ్రంగి కేశవరావు అనే ప్రముఖుడు సినిమాను సమీక్షించి సినిమాకు అననుకూలమైన నివేదిక సంఘానికి సమర్పించాడు. బ్రాహ్మణులకు, హరిజనులకు మధ్య వైషమ్యాలు రేకెత్తించేందుకు, బ్రాహ్మణుల పట్ల ద్వేషం రగిలించేందుకు సినిమా తీశారంటూ అభ్యంతరకరమైన సన్నివేశాలను, సంభాషణలను తొలగించి పునర్నిర్మించేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాకినాడ ఈశ్వర పుస్తక భాండాగారం వారు సినిమాను నిషేధించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. సినిమా ప్రభావంతో కొన్ని పట్టణాల్లో పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించారు. దాంతో పట్టణాల మున్సిపాలిటీలు సినిమా నిషేధించాలని ప్రయత్నాలు చేశాయి. అయితే వీటివల్ల సినిమా నిషేధం కానీ, ప్రదర్శనలకు ఆటంకం కానీ కాలేదు.
 
బ్రాహ్మణులకు సినిమాపై ఉన్న ఆగ్రహాన్ని పెంచుతూ సినిమా బృందం "పిలక బ్రాహ్మణులకు ఫ్రీ పాసులు" అంటూ కరపత్రాలు ప్రచురించారు.
 
==థీమ్స్==
"https://te.wikipedia.org/wiki/మాలపిల్ల" నుండి వెలికితీశారు