దూర్వాసుల వెంకట సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'thumb|1st MLA of Peddapuram Constituency దుర్వాసుల వెంకట సుబ్బారావు త...'
(తేడా లేదు)

11:43, 13 జూన్ 2017 నాటి కూర్పు

దుర్వాసుల వెంకట సుబ్బారావు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు స్వాతంత్ర సమరయోధుడు మొట్టమొదటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (MLA) స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ దుర్వాసుల వెంకట సుబ్బారావు గారు

దస్త్రం:Durvasula Venkata Subbarao.jpg
1st MLA of Peddapuram Constituency

జననం : 10-05-1911 విద్య : బి. ఎ - ఎల్ ఎల్ బి

న్యాయ వాది గా పనిచేస్తూ అమలాపురానికి పబ్లిక్ ప్రాసిక్యుటర్ గా నియమితులయ్యారు.

బ్రిటీషు వారి అరాచకాలకు సహించలేక తన పదవికి రాజీనామా చేసి భారతదేశం నుంచి బ్రిటీష్ పాలనను తరిమివేయటమే లక్ష్యంగా 1942 లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాలు పంచుకొన్నందుకు మాజీ రాష్ట్రపతి పి.వి.గిరి గారి తో కలిసి 6 నెలలు జైలు శిక్ష అనుభవించారు.

ఆయన యొక్క న్యాయవాద పట్టబద్రుని పట్టా రద్దు కి కేసు వేయబడగా పోరాడి సాదించుకొన్నారు. కేసు కొట్టి వేయబడింది స్వాతంత్ర్యానంతర పరిణామాల వల్ల కలత చెందిన దూర్వాసుల వెంకట సుబ్బారావు గారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ విధానాల పై విసుగు చెంది 1949 లో తన భావాలతో సారూప్యత కల్గిన కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు.

1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేసి కాడెద్దుల గుర్తుపై పోటీ చేసిన జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట రామస్వామి పై ఓటమి చవిచూశారు.

1953 లో ఆంద్ర రాష్ట్రావతరణ ప్రకటన వెలువడింది 1956 లో ఆంద్ర రాష్ట్రం అవతరించిది

1955లో పెద్దాపురానికి దూర్వాసుల వెంకట సుబ్బారావు (సి.పి.ఐ = కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున పోటీ చేసి సమీప ప్రత్యర్ది చల్లా అప్పారావు (కె ఎల్ పి = కృషి లోక్ పార్టీ) పై విజయం సాధించారు. ఆయన పదవీ కాలంలో అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేసారు

ఆయన వాగ్ధాటి కి మెచ్చిన నీలం సంజీవరెడ్డి గారు అసెంబ్లీ లో సుబ్బారావు సింహం లా గర్జిస్తారు అని అందరికీ చెప్పేవారు, డా. బెజవాడ గోపాల రెడ్డి గారు ఆయన్ని మహాముని అని సంబోదించేవారు

పెద్దాపురం పట్టణానికి చెందిన మొట్టమొదటి మరియు ఏకైక MLA ఈయనే కావడం విశేషం

ఆంధ్రా యూనివర్సిటీ క్రిమినాలాజి కేసుల్లో సుబ్బారావు గారు వాదించిన కేసులు రిఫరెన్సు లుగా చేసుకునేవారు