మాలపిల్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
===నటీనటుల ఎంపిక===
సినిమాలో కీలకమైన సుందరరామశాస్త్రి పాత్రకు రంగస్థలంపై ప్రతాపరుద్రీయం, కన్యాశుల్కం నాటకాల్లో పాత్ర పోషణకు ప్రఖ్యాతుడైన [[గోవిందరాజులు సుబ్బారావు]]ను తీసుకున్నారు. అప్పటికే రంగస్థలంపై గొప్ప నటునిగా ప్రేక్షకాదరణ పొందిన గోవిందరాజుల సుబ్బారావు నటించిన తొలి సినిమా మాలపిల్ల. నాగరాజు పాత్రలో [[గాలి వెంకటేశ్వరరావు]] నటించారు. ప్లేబాక్ సౌకర్యం లేని రోజులు కావడంతో, సంగీత కుటుంబం నుంచి వచ్చివుండడం గాలి వెంకటేశ్వరరావుకు ఉపకరించింది. శంపాలత పాత్రకు అప్పటికే నాలుగు సినిమాలు చేసి ప్రేక్షకుల్లో మంచి ప్రఖ్యాతి కలిగిన [[కాంచనమాల]]ను తీసుకున్నారు. అయితే అమాయకమైన, సుగుణవతియైన కథానాయిక శంపాలత పాత్రకు, కాంచనమాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన పేరు తీసుకువచ్చిన [[విప్రనారాయణ (1937 సినిమా)|విప్రనారాయణ]], [[గృహలక్ష్మి (1938 సినిమా)|గృహలక్ష్మి]] సినిమాల్లోని వ్యాంప్ పాత్రలకు ఇమేజ్ భేదం వస్తుందని సంశయించి [[పుష్పవల్లి]] పేరునూ పరిశీలించారు. ఐతే చివరకు ఆ పాత్ర కాంచనమాలకే వెళ్ళింది. చౌదరి పాత్రకు అప్పటికి పౌరాణిక చిత్రాల్లో పలు పాత్రలు పోషించిన [[పువ్వుల సూరిబాబు]]ను ఎంపికచేశారు. సుందరరామశాస్త్రి భార్య పాత్రలో [[పువ్వుల లక్ష్మీకాంతం]], శంపాలత చెల్లెలు అనసూయగా సుందరమ్మ, తల్లిదండ్రులు మునెయ్య దంపతులుగా ఎం.సి.రాఘవన్, గంగారత్నం, రాధాబాయమ్మగా హేమలతాదేవి, మల్లికార్జునశర్మగా [[వంగర వెంకటసుబ్బయ్య]] నటించారు.<ref name="నవ్యలో వ్యాసం" />
 
===చిత్రీకరణ, పోస్ట్-ప్రొడక్షన్===
1938 మే 1న మద్రాసు (నేటి [[చెన్నై]])లోని మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ కంబైన్స్ స్టూడియో(తర్వాతి కాలంలో జెమినీ స్టూడియోగా ప్రసిద్ధం)లో ప్రముఖ రాజకీయ నేత, సాహిత్యవేత్త [[బెజవాడ గోపాలరెడ్డి]] చేతుల మీదుగా మాలపిల్ల చిత్రీకరణ ప్రారంభం అయింది. కథా వేదిక అయిన కళ్యాణపురంగా చెన్నై సమీపంలోని క్రోమ్ పేట, పల్లవరం మధ్యన ఉన్న ఒక ఊరిని చూపించారు. చెన్నైకి అత్యంత సమీపంలో ఉన్న, వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటైన [[తిరునీర్మలై]]లో హరిజన పాత్రలు పాడే పాట, దేవాలయ ప్రవేశం సన్నివేశాలు చిత్రీకరించారు. మిగిలిన సినిమా అంతటినీ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ కంబైన్స్ స్టూడియోలోనే చిత్రీకరించారు. జూన్ 15 నాటికి సినిమా చిత్రీకరణ పూర్తయింది. 1938 ఆగస్టు నెలలో మాలపిల్ల సినిమా కూర్పు, రీరికార్డింగ్, ప్రింటింగ్ వంటి కార్యక్రమాలు పూర్తిచేశారు. పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలన్నిటినీ బొంబాయి (నేటి ముంబై)లో చేశారు.
"https://te.wikipedia.org/wiki/మాలపిల్ల" నుండి వెలికితీశారు