మాలపిల్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
1938 మే 1న మద్రాసు (నేటి [[చెన్నై]])లోని మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ కంబైన్స్ స్టూడియో(తర్వాతి కాలంలో జెమినీ స్టూడియోగా ప్రసిద్ధం)లో ప్రముఖ రాజకీయ నేత, సాహిత్యవేత్త [[బెజవాడ గోపాలరెడ్డి]] చేతుల మీదుగా మాలపిల్ల చిత్రీకరణ ప్రారంభం అయింది. కథా వేదిక అయిన కళ్యాణపురంగా చెన్నై సమీపంలోని క్రోమ్ పేట, పల్లవరం మధ్యన ఉన్న ఒక ఊరిని చూపించారు. చెన్నైకి అత్యంత సమీపంలో ఉన్న, వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటైన [[తిరునీర్మలై]]లో హరిజన పాత్రలు పాడే పాట, దేవాలయ ప్రవేశం సన్నివేశాలు చిత్రీకరించారు. మిగిలిన సినిమా అంతటినీ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ కంబైన్స్ స్టూడియోలోనే చిత్రీకరించారు. జూన్ 15 నాటికి సినిమా చిత్రీకరణ పూర్తయింది. 1938 ఆగస్టు నెలలో మాలపిల్ల సినిమా కూర్పు, రీరికార్డింగ్, ప్రింటింగ్ వంటి కార్యక్రమాలు పూర్తిచేశారు. పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలన్నిటినీ బొంబాయి (నేటి ముంబై)లో చేశారు.
 
మాలపిల్ల సినిమా బడ్జెట్ పూర్తయ్యేసరికి రూ.లక్షా పదివేలు. అప్పట్లో తెలుగు సినిమాలు లక్ష రూపాయల లోపు బడ్జెట్ తో నిర్మించేవారు. ఆ ప్రమాణాల్లో మాలపిల్ల భారీ బడ్జెట్ సినిమాగా చెప్పాలి.<ref name="నవ్యలో వ్యాసం" />
 
==విడుదల==
"https://te.wikipedia.org/wiki/మాలపిల్ల" నుండి వెలికితీశారు