మాలపిల్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
==థీమ్స్==
మాలపిల్ల సినిమాలో హరిజనోద్ధరణ, హరిజనుల దేవాయల ప్రవేశం, అంటరానితనం నిర్మూలన వంటివి ప్రధానమైన థీమ్స్. సినిమాకు ఆధారమైన చలం నవల మాలపిల్లలో బ్రాహ్మణ యువకుడు, హరిజన బాలిక ప్రేమ, సమాజంలో వారికి ఎదురైన సమస్యలు మాత్రమే ఇతివృత్తం కాగా దర్శక, రచయితలు దీనికి హరిజనుల దేవాలయ ప్రవేశం, అంటరానితన నిర్మూలన, గాంధేయవాదం వంటి అంశాలపై కథాంశాన్ని విస్తరించారు. సినిమా చివరిలో హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించిన తిరువాన్కూరు మహారాజు చర్యను ప్రశంసిస్తూ సంభాషణలు రాయించారు. మాలపిల్ల సినిమాను ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్రపత్రిక వ్యవస్థాపకుడు, సంస్కరణాభిలాషి అయిన [[కాశీనాథుని నాగేశ్వరరావు]]కు అంకితం ఇచ్చారు. సినిమా చిత్రీకరణ ప్రారంభించే సమయానికి ఆయన మరణించారు, ఆయన అంతిమయాత్రను చిత్రీకరించి సినిమాతో పాటుగా అనుబంధంగా విడుదల చేశారు.<ref name="నవ్యలో వ్యాసం" />
 
== సంగీతం ==
"https://te.wikipedia.org/wiki/మాలపిల్ల" నుండి వెలికితీశారు