మాలపిల్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
 
మాలపిల్ల సినిమా తెలుగు సినిమా రంగంలో తొలి వివాదాస్పదమైన సినిమా. సినిమాను నిషేధించాలని, కొన్ని భాగాలు పునర్నిర్మించాలని కాకినాడ, విజయవాడ వంటి ప్రాంతాల్లో సభల్లో తీర్మానాలు జరిగాయి. సినిమా సమాజంలోని వాస్తవాలకు బదులు పక్షపాతధోరణులతో చిత్రీకరిస్తోందంటూ పత్రికల్లో విమర్శలు, సమాజంలోని దుర్లక్షణాలను వ్యతిరేకించిందే తప్ప వర్గాన్ని లక్ష్యం చేసుకోలేదని సమర్థనలు వచ్చాయి.
==కథ==
కళ్యాణపురం అనే గ్రామంలో రాధాబాయమ్మ, తదితరులు గాంధీజీ స్ఫూర్తితో హరిజనోద్యమాన్ని లేవనెత్తుతారు. ఆ క్రమంలో హరిజనులతో ఆలయ ప్రవేశం చేయబోతుంటే బ్రాహ్మణులు ఆగ్రహిస్తారు. ఆలయ ప్రవేశాన్ని ధర్మకర్త సుందరరామశాస్త్రి అడ్డుకుంటాడు. చౌదరి బ్రాహ్మణులకు, హరిజనులకు వివాదం సమసిపోయేలా చేసి, రాజీ కుదర్చాలని ప్రయత్నం చేస్తూంటాడు. బ్రాహ్మణుల వల్ల మంచినీరు దొరకక హరిజనులు అల్లల్లాడతారు. మరోవైపు సుందరరామశాస్త్రి కుమారుడు నాగరాజు, హరిజనుల అమ్మాయి శంపాలత ప్రేమించుకుంటారు. గ్రామంలోని వివాదాల మధ్య ఎవరో చెప్పిన మాటలు విని శంపాలత నాగరాజును అనుమానిస్తుంది.
Line 23 ⟶ 24:
 
కళ్యాణపురంలో అగ్నిప్రమాదం జరుగుతుంది, అందులో చిక్కుకున్న సుందరరామశాస్త్రి భార్యని హరిజనులు ప్రాణాలకు తెగించి కాపాడతారు. వారిలోని మానవత్వాన్ని, సహృదయాన్ని అర్థం చేసుకున్న సుందరరామశాస్త్రి హరిజనుల దేవాలయ ప్రవేశానికి అనుమతి తెలుపుతాడు. మల్లికార్జున శర్మ వంటి ఇతర బ్రాహ్మణులు దీన్ని వ్యతిరేకిస్తారు. పోలీసుల రాకతో గొడవ సర్దుమణిగి హరిజనులు దేవాలయ ప్రవేశం చేస్తారు. తండ్రి అంగీకారంతో శంపాలతను నాగరాజు వివాహం చేసుకుంటాడు.
 
== నిర్మాణం==
===అభివృద్ధి===
"https://te.wikipedia.org/wiki/మాలపిల్ల" నుండి వెలికితీశారు