మాలపిల్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
కళ్యాణపురం అన్న గ్రామంలో హరిజన యువతి, బ్రాహ్మణ యువకుడు ప్రేమించుకుని సాంఘిక స్థితిగతులను ఎదిరించి ప్రేమ సఫలం చేసుకోవడమూ, హరిజనులు పోరాటం ద్వారానూ, తమ సహృదయత ద్వారానూ ఛాందస బ్రాహ్మణుడైన ధర్మకర్త సుందరరామశాస్త్రి మనసు మార్చి దేవాలయ ప్రవేశం పొందడం సినిమా కథాంశం. అంటరానితనం నిర్మూలన, హరిజనుల దేవాలయ ప్రవేశం, కులాంతర వివాహం, సంస్కరణోద్యమం వంటి సాంఘిక అంశాలను ప్రధానంగా స్వీకరించి సినిమా తీశారు. ఐతే కులవివక్ష సమాజం అంతా ఉండగా కేవలం బ్రాహ్మణులనే లక్ష్యంగా చేసుకుని, సంస్కరణాభిలాష మొత్తానికి చౌదరి అనే పాత్రనే ప్రతినిధిగా చేసి సినిమా తీయడం వివక్షాపూరితంగా ఉందంటూ సమకాలీన బ్రాహ్మణుల నుంచి విమర్శలు, నిరసనలు వచ్చాయి.
 
మాలపిల్ల సినిమా తెలుగు సినిమా రంగంలో తొలి వివాదాస్పదమైన సినిమా. సినిమాను నిషేధించాలని, కొన్ని భాగాలు పునర్నిర్మించాలని కాకినాడ, విజయవాడ వంటి ప్రాంతాల్లో సభల్లో తీర్మానాలు జరిగాయి. సినిమా సమాజంలోని వాస్తవాలకు బదులు పక్షపాతధోరణులతో చిత్రీకరిస్తోందంటూ పత్రికల్లో విమర్శలు, సమాజంలోని దుర్లక్షణాలను వ్యతిరేకించిందే తప్ప వర్గాన్ని లక్ష్యం చేసుకోలేదని సమర్థనలు వచ్చాయి. సినిమా కారణంగా కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణులకు మంచినీరు ఇవ్వకపోవడం, పారిశుధ్య కార్మికులు తిరుగుబాటు చేయడం వంటివి చోటుచేసుకున్నాయి. బ్రాహ్మణుల అభ్యంతరాలకు ఆజ్యం పోస్తూ పిలక బ్రాహ్మణులకు ఉచిత పాసులు అంటూ ప్రచారం చేశారు.
 
మాలపిల్ల సినిమా తెలుగు సినిమా రంగంలో తొలి వివాదాస్పదమైన సినిమా. సినిమాను నిషేధించాలని, కొన్ని భాగాలు పునర్నిర్మించాలని కాకినాడ, విజయవాడ వంటి ప్రాంతాల్లో సభల్లో తీర్మానాలు జరిగాయి. సినిమా సమాజంలోని వాస్తవాలకు బదులు పక్షపాతధోరణులతో చిత్రీకరిస్తోందంటూ పత్రికల్లో విమర్శలు, సమాజంలోని దుర్లక్షణాలను వ్యతిరేకించిందే తప్ప వర్గాన్ని లక్ష్యం చేసుకోలేదని సమర్థనలు వచ్చాయి.
==కథ==
కళ్యాణపురం అనే గ్రామంలో రాధాబాయమ్మ, తదితరులు గాంధీజీ స్ఫూర్తితో హరిజనోద్యమాన్ని లేవనెత్తుతారు. ఆ క్రమంలో హరిజనులతో ఆలయ ప్రవేశం చేయబోతుంటే బ్రాహ్మణులు ఆగ్రహిస్తారు. ఆలయ ప్రవేశాన్ని ధర్మకర్త సుందరరామశాస్త్రి అడ్డుకుంటాడు. చౌదరి బ్రాహ్మణులకు, హరిజనులకు వివాదం సమసిపోయేలా చేసి, రాజీ కుదర్చాలని ప్రయత్నం చేస్తూంటాడు. బ్రాహ్మణుల వల్ల మంచినీరు దొరకక హరిజనులు అల్లల్లాడతారు. మరోవైపు సుందరరామశాస్త్రి కుమారుడు నాగరాజు, హరిజనుల అమ్మాయి శంపాలత ప్రేమించుకుంటారు. గ్రామంలోని వివాదాల మధ్య ఎవరో చెప్పిన మాటలు విని శంపాలత నాగరాజును అనుమానిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/మాలపిల్ల" నుండి వెలికితీశారు