"ధూమరేఖ" కూర్పుల మధ్య తేడాలు

195 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
[[ధూమరేఖ]] [[జ్ఞానపీఠ్ అవార్డు|జ్ఞానపీఠ్ పురస్కార]] గ్రహీత, కవిసమ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] రచించిన [[చారిత్రిక నవల]].
== నవల నేపథ్యం ==
'''ధూమరేఖ''' [[పురాణవైర గ్రంథమాల]] నవలల సీరీస్లో మూడవది. [[భారతీయుల కాలజ్ఞానము|భారతీయుల]] పురాణాల్లోని చరిత్రాంశాలు వాస్తవమైనవంటూ, వాటిని మన చరిత్ర రచనకు ప్రామాణికంగా గ్రహించకపోవడం వల్ల ఎన్నో అంశాలు తెలియకుండా పోయాయన్నది ఈ నవలామంజరిలో విశ్వనాథ సత్యనారాయణ వాదం. నవలలోని కథాంశాలకు క్రమంగా కలియుగం ముగిశాకా పురాణాల ప్రకారం ఏర్పడ్డ రాజవంశాలను గుదిగుచ్చుతూ నేపథ్యం ఏర్పరుచుకున్నారు. ఇతివృత్తాల్లో కూడా భారతదేశాన్ని, భారతీయ సంస్కృతిని నాశనం చేద్దామని భావించిన మ్లేచ్ఛులు ఒక్కో నవల్లోనూ ప్రయత్నిస్తూండం కథా సూత్రంగా[[సూత్రము|సూత్రం]]<nowiki/>గా కొనసాగుతుంది.
== కథ ==
మగధ వంశం ప్రద్యోత వంశం చేతిలో ఉన్నప్పటి నేపథ్యం పురాణ వైర గ్రంథమాలలోని రెండవ నవలలో వస్తుంది. మూడవ నవలైన ధూమరేఖలో శిశునాగ వంశం చేతిలోకి రాజ్యం వెళ్తున్న సంధికాలంలోది. శిశునాగుడు కాశీరాజు కుమారుడు. ప్రద్యోత వంశములోని అయిదవరాజైన నందివర్ధనుడు, శిశునాగుడు పినతల్లి పెదతల్లి బిడ్డలు. నందివర్ధనునకు వేదమరీచి ఒక్కతే కూతురు. ఆమె పుట్టినపుడే ఆమె తల్లి చనిపోయింది. కాశీరాజు ఆమెని తల్లి లేని లోటు లేకుండా పెంచేందుకు కాశీ నగరానికి తీసుకెళ్ళాడు. అప్పటికి శిశునాగుడు కొంత చిన్నవాడు. శిశునాగుడు, వేదమరీచి కలిసి ఆడుకునేవారు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండేది, మొదట అది పినతండ్రి, కూతుళ్ళ బంధం గానే వున్నా తర్వాత పక్కదోవ పడుతుంది.
 
భారతదేశాన్ని మ్లేచ్ఛమయం చేద్దామన్న ప్రయత్నాలు చేస్తున్న జయద్రథులనే పరంపరలోని ఒక జయద్రథుడు (మొదటి నవల భగవంతుని మీది పగలో ఈ విషయం చెప్తారు) తన శరీరాన్ని దగ్ధం చేసుకోగా (రెండవ నవల నాస్తిక ధూమము ముగింపులో చెప్పబడిన విషయం) వ్యాపించిన ధూమరేఖల నుండి కలి కూడా వ్యాపించింది. వేదమరీచి పందొనిమిదేళ్ళు వచ్చేవరకు [[కాశీనగరం]] లోనే వుండి, అప్పుడప్పుడు గిరివ్రజపురానికి వచ్చి పోతూంటుంది. భార్యని[[భార్య]]<nowiki/>ని అమితంగా ప్రేమించిన నందివర్ధనుడు మళ్ళీ వివాహం చేసుకోకపోవడంతో వేదమరీచి మగధకు వచ్చి రాజ్యపాలన చేపట్టాలనీ మగధ ప్రజలు ఆశిస్తుంటారు. దీంతో మగధ రాజ్య మంత్రులలో వృద్ధులైన ఇద్దరు బతిమాలి, బలవంతము చేసి వేదమరీచిని ఒప్పిస్తారు.
 
శిశునాగునికి వేదమరీచి రాజ్యం చేపట్టేందుకు వెళ్ళడం ఇష్టం ఉండదు, ఆమె వెళ్ళిపోయాక శిశునాగుడు బాధతో, కోపంతో ఆ రాత్రి కాలినడకన ఎటు వెళ్తున్నాడో గమనించుకోకుండా చాలా దూరం నడుస్తూ వెళ్తాడు. అక్కడ ఒక కర్ర లోనుంచి వస్తూన్న పొగని గొట్టంతో పీలుస్తూన్న పిశాచంలాంటి మనిషిని చూస్తాడు. శిశునాగుడు ఆ వ్యక్తి పట్ల ఆకర్షితుడై ‘నేను నీదగ్గరే వుండి పోతాను’ అంటాడు. అతను ‘వద్దు, నువ్వు కోటకి[[కోట]]<nowiki/>కి వెళ్ళు. నేనే నిన్ను చూడటానికి కోటకి వస్తాను. నువ్వు వుండమంటే అక్కడే వుండిపోతాను.’ అంటూ శిశునాగుడి చేత ‘నేను నీ శిష్యుడిని’ అనిపిస్తాడు. తన చేతిలో వున్న కట్టెని శిశునాగుడికి యిచ్చి అతని చేత కూడా ధూమపానం చేయిస్తాడు. ఆ ధూమపానం చేయగానే శిశునాగుడిలో మార్పు వస్తుంది. వేదమరీచితో తనకున్న సంబంధం సహజమైనదేనని, తప్పుకాదని అనిపిస్తుంది.
 
తల్లి చంద్రమతీ దేవి తెల్లవారాకా వచ్చిన శిశునాగునిలో మార్పుని గుర్తిస్తుంది. శిశునాగుడిని వెదకుతూ వెళ్ళి తీసుకువచ్చిన పరిచారకుల్లో ఒకడైన చిత్రశిఖండిని, శిశునాగుడు ఎక్కడికి వెళ్ళిందీ ఆరాతీస్తుంది. మహానగరానికి దూరంగా ఉన్న శ్మశానాల మధ్య ప్రదేశమని, అక్కడ యువరాజువి కాక, మరో మనిషివీ, ఏదో భయంకరమైన నక్కవీ కూడా కాలి గుర్తులు ఉన్నాయని చెప్తాడు. వృద్ధరాజు, అంటే శిశునాగుడి తండ్రి ఆరోజునుంచీ మంచాన పడతాడు. చంద్రమతీదేవి తండ్రితో మాట్లాడమని ఒత్తిడి చేయగా శిశునాగుడు ఆయన దగ్గరగా వెళ్ళి మొహంలో మొహం పెట్టి మాట్లాడతాడు. అపుడు [[రాజు]] మొహంలోకి కొత్త ప్రకాశం వస్తుంది. శిశునాగుడి మాటలని ఆయన ముక్కుతో పీలుస్తున్నాడా అనిపిస్తుంది. ఒక్కసారిగా ఏదో శక్తి వచ్చినట్లుగా కనిపిస్తాడు “యువరాజా, నా పని అయిపోయింది. నీ రాజ్యం నువ్వు స్వీకరించు. నీ శత్రువులని దండించు. ప్రతీకారం తీర్చుకో.” అంటాడు.
 
రాణి ఆశ్చర్యపోతుంది. ప్రతీకారం ఎవరిమీదో ఆమెకు అర్థం కాదు. వేదమరీచి మీదా! మగధ రాజ్యం మీదా? ఎందుకు? ఆమె ఇలా అనుకుంటుంది. రాణి రాజు దగ్గరకు వెళ్ళి ఆయన్ని మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. “శిశునాగుడు ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో చెప్తారా?” అని అడుగుతుంది. “అతడు రాజైన తర్వాత నేను ఆ ప్రతీకార మార్గాన్ని బోధిస్తాను.” అంటాడు రాజు. రాణి నివ్వెరపోతుంది. ఒక హఠాత్స్ఫురణగా తనకే తెలియకుండా అనాలోచితంగా “నువ్వెవరు?” అని ప్రశ్నిస్తుంది. “నేను జయద్రథుడిని” అంటాడు రాజు. అంతే. ఆ జవాబు తర్వాత ఇంక రాణి ఎన్ని ప్రశ్నలు వేసినా జవాబు చెప్పడు. నగరంలో పరాశరశాస్త్రి అనే వృద్ధ పండితుడు ఉంటాడు. నిత్య తపస్వి. యోగానిష్టాపరుడు. జ్యోతిష్యము, సాముద్రికము తెలిసిన వాడు. చిత్రశిఖండి ఆ పరాశరశాస్త్రిని కలిసి, ఆయన్ని తీసుకుని తాను శిశునాగుడిని చూసిన ప్రదేశానికి తీసుకువెళ్తాడు. ఆయన ఆ ప్రదేశాన్ని పరీక్షిస్తాడు. ఆ దుబ్బులలో ఏదో రహస్యముందని గ్రహిస్తాడు. అక్కడ వున్న నాలుగు దుబ్బులను త్రవ్వించి, రోటిలో రుబ్బించి ఆ పిండిని గంగానదిలో కలిపిస్తాడు. రాణి కూడా ఆయనతో సంప్రదిస్తుంది. రాజుని జయద్రథుడు ఆవహించాడని అర్థం చేసుకుంటారు.
 
ఆంధ్రరాజు కుమార్తెతో శిశునాగుడి [[పెళ్ళి|వివాహం]] చేయాలనుకుంటారు. ఆయన జపంలో కూర్చుంటే వింధ్య పర్వత శ్రేణుల్లో ఈ కుట్ర మొదలయిందని అర్థమవుతుంది. అక్కడ కూడా అలాంటి దుబ్బులు వుండడం, వాటి క్రింద వున్న కాష్ఠములను చేత బూని నల్లని దుస్తులు ధరించిన ఒక పురుషుడు అక్కడినుంచి ఏదో దూరదేశానికి ప్రయాణించడం, అక్కడ ఒక రాజసౌధం, తోట, తోటలో రాకుమారి కనిపిస్తారు. ఆమె శిశునాగుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్న ఆంధ్ర రాజదుహిత అనీ అర్ధమవుతుంది. ఆమె తోటలో నిద్రిస్తుండడం, ఆ పురుషుడు తన చేతిలోని కాష్ఠములకు నిప్పు ముట్టించి, ఆ పొగ అంతా ఆమె చేత ఒక వేయిసార్లు పీల్పించడం కనిపిస్తుంది. అదంతా నిద్రలో వున్న ఆమెకు తెలియకుండానే జరుగుతుంది. ఆ ఆంధ్ర రాజకుమార్తె పేరు వంకజాబిల్లి. అమిత సౌందర్యవతి. శిశునాగుడికీ ఆంధ్రరాజ పుత్రిక వంకజాబిల్లికీ వివాహం జరుగుతుంది. వంకజాబిల్లి గర్భం దాల్చగానే ఆమెను ఆవేశించిన ధూమం గర్భస్థశిశువుని ఆవేశిస్తుంది. అయితే ఆమె జీవుడు కొంత స్వచ్ఛమైనవాడు కావడంతో అదే లక్షణం కుమారునికీ వస్తుంది.
 
మరొకప్రక్కన అక్కడ వేదమరీచి రాజ్యంలో అజాతశత్రుడు మాళవ [[రాజకుమారుడు]]. సుక్షత్రియ వంశీయుడు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోగా జ్ఞాతులు సంపదలు చేజిక్కించుకుని, వెళ్ళగొట్టగా అతను మగధకు వచ్చి అక్కడ రాజోద్యోగిగా వుంటాడు. రాజుకీ, మంత్రికీ అత్యంత సన్నిహితుడు. వేదమరీచితో అతని వివాహం జరిపించి అతనినే మగధకు రాజును చేస్తారేమోననేంత సాన్నిహిత్యం. అయితే కాశీ నుంచి తిరిగి వచ్చిన వేదమరీచి ఆ ముగ్గురితోను తన రహస్యం చెప్పేస్తుంది. ముగ్గురూ నిశ్చేష్టులవుతారు. రాజు వేదమరీచితో పాటు తానూ దుఃఖించి ఆమె వివాహానికి సుముఖంగా లేదన్న విషయం మాత్రం ప్రజలకు తెలియచేసి ఊరుకుంటాడు. అయితే శిశునాగుడి వివాహం జరిగాక కొన్నాళ్ళకి వృద్ధమంత్రి, రాజు మరణిస్తారు. ఆ తర్వాత కొంత ఆలోచించి వేదమరీచి, అజాతశత్రువు వివాహం చేసుకుంటారు. అప్పటికి వంకజాబిల్లికీ శిశునాగుడికీ పుట్టిన కొడుకు కాకవర్ణుడు ఆరేళ్ళ వాడు.
 
వేదమరీచి వివాహ వార్త విని రగిలిపోతున్న శిశునాగుడితో వంకజాబిల్లి మీ పగ నేను సాధించిపెడతానంటుంది. అన్నంత పనీ చేస్తుంది కూడా. మగధతో యుద్ధం చేస్తే గెలవలేని చిన్న రాజ్యమైన కాశీరాజ్యపు రాజు శిశునాగుడు మగధకు రాజయ్యేలా చేస్తుంది. చుట్టరికం ఆధారంగా శిశునాగుడు, చంద్రమతీ దేవి, వంకజాబిల్లి మగధలో అడుగుపెడతారు. అలా అడుగుపెట్టడానికి కావలసిన పరిస్థితులు కల్పించ బడతాయి. అందుకు పరాశర శాస్త్రి కొంత ఉపయోగపడితే, కాశీరాజుని ఆవహించిన జయద్రథుడు – అతనికి కావల్సిందీ అదే కనుక – మరికొంత ఉపయోగపడతాడు. వేదమరీచిని హత్య చేసి, ఆ నేరం అజాతశత్రువుపై[[అజాతశత్రువు]]<nowiki/>పై మోపి అతన్నీ హత్య చేసి, మగధ ప్రజల దృష్టిలో అతన్ని నేరస్తుడిని చేసి, శిశునాగుడు మగధకి రాజవుతాడు. అదీ నవలకి ముగింపు. అయితే ధర్మానికి, దేశానికి ఏమయిందనీ, జయద్రథుడి పగ సాగిందా? అన్న ప్రశ్నలు తర్వాతి నవలకు మిగిలిపోతాయి.<ref name="పుస్తకం.నెట్లో ధూమరేఖ గురించి">{{cite web|last1=టి.|first1=శ్రీవల్లీ రాధిక|title=ధూమరేఖ - కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ|url=http://pustakam.net/?p=16544|website=పుస్తకం.నెట్|publisher=సౌమ్య, పూర్ణిమ|accessdate=30 March 2016|language=తెలుగు}}</ref>
 
== పాత్రలు ==
* '''శిశునాగుడు''': శిశునాగుడు కాశీరాజు కుమారుడు, మగధను పాలిస్తున్న నందివర్ధనుడికి పినతల్లి కుమారుడు. అతనికి జన్మగతంగా వచ్చిన సంస్కారంలోనే ఒక అధర్మం ఉంటుంది. తన అన్నగారి కుమార్తె అయిన వేదమరీచినితో యవ్వనంలో[[యవ్వనం]]<nowiki/>లో సంబంధం ఏర్పరుచుకోవడం. ఆపైన ఆమె రాజ్యం చేయడానికి వెళ్ళిపోవడం తర్వాత బాధలో శ్మశానంలోని[[శ్మశానం]]<nowiki/>లోని పిశాచరూపుడైన వాణ్ణి గురువుగా స్వీకరించడం. అతను భస్మమైపోయిన జయద్రథుని ధూమాన్ని పీల్చి పూర్తిగా అధర్మపరుడు, పిశాచావేశ నిష్టుడు కావడం జరుగుతుంది. ఇదంతటికీ మూలంలో అతని సంస్కారం, లక్షణం అధర్మపరమైనవి కావడం వల్ల తేలికగా లోబడతాడు.<ref name="పుస్తకం.నెట్లో ధూమరేఖ గురించి" /> నవలలో ఈ పాత్రను దాదాపుగా ప్రతినాయక పాత్రగా తీర్చిదిద్దారు.
* '''వంకజాబిల్లి''': వంకజాబిల్లి శిశునాగుని భార్య, ఆంధ్ర రాకుమార్తె. గొప్ప సౌందర్యవతి, స్వతంత్రమైన వ్యక్తిత్వం, వివేకం కలిగినది. రాజ్యం పాలించడమే కాక రాజ్యాన్ని విస్తరించగల సమర్థత కూడా ఉన్న మనిషి. పరాశరశాస్త్రి అన్న మంత్రవేత్త ప్రకారం ఈమెలోని జీవుడు కొంత ఉన్నతమైనవాడు, స్వచ్ఛత కలిగినవాడు. ఐతే ఆమె నిద్రిస్తున్నప్పుడు నాస్తిక ధూమాన్ని జయద్రథుడు ప్రవేశింపజేస్తాడు. దాంతో ఆమె మందగిస్తుంది. జయద్రథుడే ఆమె తండ్రిని ఒప్పించి శిశునాగుడితో ఆమె వివాహం అయ్యేలా చేస్తాడు. భర్త కోరిన కోరిక తీర్చేందుకు సామోపాయంతో మగధలోకి ప్రవేశించి మగధ రాణిని చంపించి, ఆ నేరాన్ని ఆమె భర్తపై వేసి రాజ్యాన్ని చేజిక్కించుకున్న రాజకీయవేత్త. అంతేకాక ధూమరేఖా ప్రభావంతో పీడితురాలైన కుక్క తుదకు జయద్రధుని, జయద్రథుడు ఆ కుక్కని చంపేలా చేసి రాజ్యాన్ని నిష్కంటకం చేసుకున్న దూరదృష్టి ఆమె స్వంతం. అయితే ఆమె పాత్రలో ఉత్తమమైన జీవుడు చేసిన ఉత్తమ కార్యాలేవీ కనిపించట్లేదని, కనుక ఆమె ఉదాత్తత అంతా ధూమం పీల్చడంతోనే పోయివుండాలని విమర్శకురాలు దిట్టకవి శ్యామలాదేవి భావించారు.<ref name="విశ్వనాథ కథలలో">{{cite book|last1=దిట్టకవి|first1=శ్యామలాదేవి|title=విశ్వనాథ కథలలో|page=76|url=http://syamasahithi.com/thesis/76.htm|accessdate=30 March 2016|chapter=వంక జాబిల్లి}}</ref>
* '''వేదమరీచి''':
1,88,139

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2137351" నుండి వెలికితీశారు