బేతాళ జాన్‌కవి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
బేతాళ జాన్ కవి అసలు పేరు బేతాళ వెంకయ్య. తెలుగు క్రైస్తవ కీర్తనకారుడు. 1840 లో [[గుంటూరు]]లో జన్మించారు. తల్లిదండ్రులు తాపీ పని చేసే వారు.చిన్నతనంలో వెంకయ్య మిషనరీ బంగళాలో పంకా పుల్లర్ గా పనిచేశారు. మిషనరీ పాఠశాలలో[[పాఠశాల]]<nowiki/>లో విద్యనేర్చుకొన్నారు.తన పేరును జాన్ గా మార్చుకొన్నాడు. బేతాళ జాన్ ఆంధ్ర లూథరన్ సంఘ గురువులలో[[గురువు]]<nowiki/>లలో మూడవవారు. మొదట 1875 లో ఉపదేశిగా పరిచర్యను ప్రారంభించి, రెండు సంవత్సరాల తరువాత గురువుగా నియమించబడ్డారు. పల్నాడు లోని [[దాచేపల్లి]] కేంద్రంగా చేసికొన్నారు. ఈయన [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] వైద్యుడు కూడా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథంలో కనబడే తొలి కీర్తన, “అన్ని కాలంబుల-నున్న యెహోవా" ఈయన వ్రాసిందే. పూర్వం క్రైస్తవ వివాహాల్లో పాడడానికి పెళ్ళిపాటలు లేక వాళ్ళు కూడా [[హిందూమతము|హిందూ]] పాటల్నే పాడుకొనేవారు. ఈ అవసరతను గుర్తించిన జాన్‌ తన కుమార్తె వివాహ సందర్భంగా “జయమంగళం సదా శుభ మంగళం", మంగళము క్రీస్తునకు మహిత శుభవార్తునకు….” అని రెండు [[వివాహం (పెళ్లి)|వివాహ]] కీర్తనల్ని వ్రాసి తానే పాడి అల్లుడికి కట్నంగా చదివించారట. నేటికీ ఈ కీర్తనల్ని తెలుగు క్రైస్తవ వివాహాల్లో పాడుతున్నారు. బేతాళ జాన్‌ కవి వ్రాసిన పాటలన్నీ యతి, ప్రాస, రాగ, తాళ, లయలతో ఉంటాయి. [[1895]]లో పరమపదించారు.
==మూలాలు==
 
"https://te.wikipedia.org/wiki/బేతాళ_జాన్‌కవి" నుండి వెలికితీశారు