వేమన శతకము: కూర్పుల మధ్య తేడాలు

Added meanings for the satakam (100 poems)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' మంచి మనసుతొ చేసిన చిన్న పనియైన మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడ విత్తనము చిన్నదేకదా!
 
2.
పంక్తి 21:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాతించతంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.
 
3.
పంక్తి 29:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' కడివెడు గాడిదపాలకంటె గరిటెడు ఆవుపాలు మేలును కలిగించును. భక్తితో పెట్టిన కూడు పట్టెడు అయినప్పటికి తృప్తిని కలిగిస్తుంది.
 
4.
పంక్తి 37:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' తట్టెడు గులకరాళ్ళ కంటె ఒకమంచి నీలము శ్రేష్ఠము. అదే విధముగ వ్యర్ధమైన పద్యముల వంటె ఒక చక్కని చాటు పద్యము శ్రేష్ఠమవుతుంది.
 
5.
పంక్తి 45:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' మిరియపుగింజ మీద నల్లగానుప్పటికి దానిని కొరికిన వెంటనే చురుక్కుమంటుంది. మంచి వారు పైకి ఏవిధముగా కనిపించినప్పటికీ అతనిని జాగ్రత్తగా గమనించినచో అసలు విషయము బయటపడుతుంది.
 
6.
పంక్తి 53:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నప్పతికి దాని సువాసన నాలుగు దిక్కులకు వెదజల్లునట్లు పెద్దలైన వారు బయటికి ఆడంబరముగ కనపడక గొప్ప గుణములు కలవారై ఉండురు.
 
7.
పంక్తి 61:
విశ్వ దాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' అత్తిపండు పైకందముగా కనపడుతుంది. దానిలొపల పురుగులుంటాయి. అదే విధముగ పిరికి వాని ధేర్యము కూడ పైన పటారము లొన లొటారముగ ఉంటుంది.
 
8.
పంక్తి 69:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' తనను ఏమీ రాదు అని చెప్పుకొనే వాడు నిజముగా తేలివైనవాడు. అన్నీ వచ్చుటకు చెప్పువాడు గౌరవాన్ని పొందలేడు. మౌనముగానున్నవాడే ఉత్తమ యౌగి అనిపించుకొంటాడు.
 
9.
పంక్తి 77:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' గొప్పదైన గంగానది కూడ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. చిన్నదైన మురికి కాలువ పెద్ద శబ్ధం చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవారికి, నీచునికి ఈ రకమైన భేదమే ఉన్నది.
 
10.
పంక్తి 85:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' ఓ వేమా ! నీటితో నిండియున్న నదులు గంభీరముగ నిల్లిచి ప్రవహించుచుండును. చిన్న సెలయేరులు పైకి పొర్లి వేగముగ ప్రవహించుచుండును. చెడ్డగుణములు గలవారు మాటలాడినంతటి తొందరగా, మంచిగుణములు గలవారు మాట్లాడరు.
 
11.
పంక్తి 93:
విశ్వ దాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' ప్రపంచములొ ఉన్న జనులకు ప్రియమైన పలుకులతో ఆనందము కలిగించు వేమనా! అల్పుడు శాంతముతో మాట్లాడతాడు. కంఛు ధ్వని చేసినట్లుగా బంగాము ధ్వని చేయదుకదా! అల్పుడు కంచుతోనూ, సజ్జనుడు బంగారముతోనూ సమానము.
 
12.
పంక్తి 101:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' కులములో ఒక వ్యక్తి గుణవంతుడన్నట్లయితే ఆ కులమంతా అతనివలన గౌరవాన్ని పొందుతుంది. వనములో ఒక్క మంచి గంధపు చెట్టు ఉన్నప్పటికీ ఆ వనమంతా వాసన వెదజల్లుతుంది.
 
13.
పంక్తి 109:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' పూజపునస్కారముల కంటె బుద్ధి ప్రధానము. మాటకంటె మనసు ప్రధానము. కులముకంటె గుణము ప్రధానము.
 
14.
పంక్తి 117:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' చెరకు మొక్క చివర కంకిపుట్టి చెరకు యొక్క తీపిని చెరచునట్లుగా, ఉత్తమ వంశములో దుష్టుడు పుట్టిన ఆ వంశము యొక్క గౌరవము నశించును.
 
15.
పంక్తి 125:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' చెరకు గడకు చివర వెన్నులడితే చప్పబారినట్లుగా గుణహీనుడైనవ్యక్తి వలన ఆ కులమంతా చెడిపోవును.
 
16.
పంక్తి 133:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' రాముని పుట్టుకతో రఘువంశము ఉద్ధరింపబడింది. దుర్యోధనుని పుట్టుకతో కురువంశము నశించింది. ప్రపంచములో పుణ్య పాపములు విధముగానే ఉంటాయి.
 
17.
పంక్తి 141:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' నీచుణ్ణి ఇంటిలో పెట్టిన ఎటువంటి వానికైన కష్టము కలుగుతుంది. ఈగ కడుపులోకి వెళితె వికారమును కలిగిస్తుంది.
 
18.
పంక్తి 149:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' వేరువురుగు పెద్ద వృక్షాన్ని పాడుచేస్తుంది. చీడ పురుగు చిన్న చెట్టుని నశింపజేస్తుంది. చెడ్డవాడు గుణవంతుని చేరి అతన్ని నాశనము చేస్తాడు.
 
19.
పంక్తి 157:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' నీచుడైన వ్యక్తి ఎంత చదువు చదివినా అతడు గొప్పవాడుకాలేడు. సుగంధ ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాలేదు.
 
20.
పంక్తి 165:
విశ్వదాభిరామ! వినుర వేమ! 20
 
'''భావం:''' హంసలతో కలిసినంత మాత్రమున కొంగమారనట్లుగా, పండితులతో కలిసినప్పటికి మూర్ఖుడు మారడు.
 
21.
పంక్తి 173:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' దుష్టునకు అధికారము నిచ్చిన యెడల మంచి వారందరినీ వెడల కొట్టును. చెప్పుతినెడి కుక్క, చెరకుతీపియేరుగదు.
 
22.
పంక్తి 181:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' మూర్ణునికి సంపదగలిగినట్లయితే పెద్ద వారినందరిని తిరస్కరించి తిరుగుతాడు. అల్పుడైన వానికి గొప్ప వారి యొక్క శక్తి గురించి ఏమి తెలుస్తుంది.
 
23.
పంక్తి 189:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' ఒక సంవత్సరముపాటు బోధించినట్లెతే ఎద్దుకూడ మర్మములను తెలిసికొని నడుచుకుంటుంది. కాని ముప్ప్తె సంవత్సరాల నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలిసికొనలేడు.
 
24.
పంక్తి 197:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' ఎలుక తోలు ఎంతసేపు ఉతికినప్పటికీ అది తెలుపుగా మారదు. కర్ర్తో చేసిన బొమ్మ ఎంత కొట్టినప్పటికీ మాట్లడదు.
 
25.
పంక్తి 205:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' పామువంటి పాపిష్టి జీవికూడ ఏదైన చెఊఇన వింటుంది కాని మూర్ఖునికి ఎంత చెప్పిన అతని గుణము మారదు.
 
26.
పంక్తి 213:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' వేప చెట్టుకి పాలు పోసి పెంచినప్పటికి చేస్దు విరిగి తీపెక్కదు. అదే విధంగా చెడ్డవాడు చెడ్డవాడే కాని మంచివాడు కాలేడు.
 
27.
పంక్తి 221:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' ఎంత పంచదార పోసి వండినప్పటికి పాపరపండ్లలో తీపి ఎక్కడు. అదే విధముగ దోష్టులకు మంచి గుణము అలవడదు.
 
28.
పంక్తి 229:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' ఎంత పంచదార పోసి వండినప్పటికి పాపరపండ్లలో తీపి ఎక్కడు. అదే విధముగ దోప్పులకు మంచి గుణము అలవడదు.
 
29.
పంక్తి 237:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' ఈడిగవాని ఇంటిలో పాలు తగినా అవి మద్యమని లోకులు భావిస్తారు. నిలువ గూడని స్థలములో నిలిస్తే అపకీర్తి కలుగుతుంది.
 
30.
పంక్తి 245:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' పనికిరానివానితో తిరిగిన వారిని అందరూ పనికిరానివానిగానే చూస్తారు. తాటిచెట్టు కింద పాలు త్రాగినప్పటికి కల్లు త్రాగినట్లుగానే అందరూ భావిస్తారు.
 
31.
పంక్తి 253:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' కోపముతో ఏపనీ చేయకూడదు. అలా చేసినట్లై ఆపని జరగదు. వ్యతిరేకంగా కూడ జరుగుతుంది. పచ్చికాయనుతెచ్చి మూసలో వేసినంత మాత్రాన అది పండు కాదుగదా!
 
32.
పంక్తి 261:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' కోపము వలన గొప్పతనము నశించటమే గాక దుఃఖము కలుగుతుంది. కోపమును తగ్గించుకొన్న యెడల అన్ని కోరికలు ఫలిస్తాయి.
 
33.
పంక్తి 269:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' నీటిలో నున్నపుడు మొసలి ఏనుగును కూడ జయింస్తుంది. కాని బయట కుక్కను కూడ ఏమి చేయలేదు. అది స్థానమహిమేకాని తనమహిమకాదు.
 
34.
పంక్తి 277:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' నీటిలో స్వేచ్చగ సంచరించే చేప భూమి మీదకు రాగానే చనిపోతుంది. అదిస్థాన మహిమకాని తనమహిమ మాత్రం కాదుకదా!
 
35.
పంక్తి 285:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' నీటిమీద ఏ ఆటంకము లేకుండ తిరిగి ఓడ భూమి పై ఒక మూరెడు కూడ వెళ్ళలేదు. ఎంత నేర్పరి అయినప్పటికీ తన స్థానము మారిన పనికి రాని వాడవుతాడు.
 
36.
పంక్తి 293:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' తక్కువ కులము వాడైనప్పటికి ధనమున్నట్లయితే అతడు గౌరవాన్ని పొందును. ధనము లేనట్లయితే ఉన్నత కులస్థుడు కూడ రాణింపదు. కాబట్టి కాలముకంటే ధనము ఎక్కువ.
 
37.
పంక్తి 301:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' మంచి కులము గలవాడు, మంచి గోత్రముకలవాడు, చదువు కలిగిన వాడు బంగారము గలవానికి బానిసలవు అవుతారు. లోకములో ధనమే ప్రధానము.
 
38.
పంక్తి 309:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' ధనమున్నవాడు సన్నిపాత రోగం వచ్చిన వచ్చినవలె ఎవరైన తనని చూచిన చూడనట్లుగా, వినినప్పటికీ విననట్లుగా నటిస్తాడు.
 
39.
పంక్తి 317:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' మనిషి పుట్టీంపుడు తన కూడ తీసికొని రాలేదు. చనిపోయినప్పుదు కూద ఏమి తీసికొని వెళ్ళలేడు తానెక్కదికిపోతడో, సంపదలు ఎక్కడికి పోతాయో తెలియక లోభియై గర్వించటం వ్యర్ధము.
 
40.
పంక్తి 325:
విశ్వదాభిరామ! వినుర వేమ! 40
 
'''భావం:''' తనస్వంతమని పోషించుటకు ఈ సరీరము ఎవరిదీకాదు. దాచినపెట్టుటకు ధనము ఎవరిదీకాదు. పారిపోకుండ నిలుచుటకు ఈ ప్రాణము ఎవరిదీకాదు. ఇవి ఏమియు శాశ్వతములు కావు.
 
41.
పంక్తి 333:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' గొడ్డు బోతైన ఆవు దగ్గరకి పాలుపితకటానికి కుండను తీసికొనివెళ్తే పండ్లు రాలేటట్టు తన్నుతుంది కాని పాలు ఇవ్వదు అదే విధముగా లోభిని యాచించటం కూడ వ్యర్థము.
 
42.
పంక్తి 341:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' మేక మెడకిందనున్న చన్నులను కుడిచిన పాలు దొరకవు. ఇదే రీతిగాలోభిని యాచించిన ప్రయోజనముండదు.
 
43.
పంక్తి 349:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' ఎదుతి వారికి సహాయము చేయనివాడు పుట్టినా చచ్చినా ఒకటే. పుట్టలో చెదలు పుట్టినా, చచ్చినా ఒకటే కదా!
 
44.
పంక్తి 357:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' ఆయువు ఉన్నంత కాలము మనుష్యులు ఆశ వదలలేక కాలము గడుపుచుందురు. మురికి కుండలో ఈగలు ముసిరినట్లే వారు సంచరించుదురు.
 
45.
పంక్తి 365:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' నీళ్ళలోని చేప కొంచెం మాంసానికి ఆశపడి గాలానికి చిక్కినట్టు, మనిషి ఆశ పుట్టి చెడిపోతాడు.
 
46.
పంక్తి 373:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' ఆశ చాలా పాపమయినది. అశచే మునులు సహితము చెడిపోయిరి. ఆ ఆశను విడిచినవారే నిష్కల్మషమయిన మనసు గలవారు.
 
47.
పంక్తి 381:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' అన్ని దానములకంటె అన్నదానము గొప్పది. కన్నతల్లి కంటె మించినదిలేదు. గురువుకంటె గొప్పదిలేదు.
 
48.
పంక్తి 389:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' ఆశ వదలి, ఆశలను అగ్ని చల్లార్చుకొని, కామమువదలి గోచిబిగించి కట్టి, జ్ఞానము తెలుసుకొనువాడే నేర్పరియైన యోగి.
 
49.
పంక్తి 397:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' భూమిపై బంగారులేళ్ళు వున్నవో లేవో అని ఆలోచింపకయే శ్రీరాముడు భార్యను విడచి ఆ లేడి వెంటబడెను. ఆ మాత్రము తెలుసుకొన లేనివాడు దేవుడెట్లయ్యెను?
 
50.
పంక్తి 405:
విశ్వదాభిరామ! వినురవేమ! 50
 
'''భావం:''' గ్రద్ద చనిపోయిన పశువుయొక్క చర్మమును, కండలను ఊడబెరికి తినును, ఈ రాజులును ఆ గ్రద్దవంటివారే కదా.
 
51.
పంక్తి 413:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' కెరటములో బుట్టిన బుడగలు అప్పుడే నిశించును. కలలోకనబడులక్ష్మిని పొందలేము. ఈభూమిలో భోగభాగ్యములుకూడా ఇట్టివేకదా!
 
52.
పంక్తి 421:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' కొండముచ్చులు కోతిని తెచ్చి, క్రొత్తవస్త్రమునట్టి పూజించినట్లే నిర్భాగ్యులు గుణము లేనివారిని కొలుచుచుందురు.
 
53.
పంక్తి 429:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' అబద్ధమాడు వానిని గ్రామపెద్ద తెలుసుకొనును. సత్యవంతుని భగవంతుడు తెలుసుకొనును. తిండిపోతుని భార్య యెరుగును.
 
54.
పంక్తి 437:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' నీరు పల్లమెరుగును, సత్యము అసత్యము భగవంతుడు తెలుసుకొనును. కుమారుని పెట్టుక తల్లికే తెలుసును.
 
55.
పంక్తి 445:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' మాసిన చీరతోను, మాసినతలతోను, మురికిగాయున్న శరీరముతోనువున్నచో గొప్పకులమునందు బుట్టినవారినయినను హినముగాచూతురు.
 
56.
పంక్తి 453:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' ఉప్పులేని కూర రుచిగావుండదు. పప్పులేని భోజనము బలవర్ధకముకాదు. అప్పులేనివాడే ధనవంతుడు.
 
57.
పంక్తి 461:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' ఈ ప్రపంచములో జనులు చెట్లపాలు మంచివి గావందురు. గేదెపాలు వారికి హితముగా నుండును. ఈ ప్రపంచములో పదిమందీ ఆడుమాటయే చెల్లును.
 
58.
పంక్తి 469:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' పట్టుదలయే వహింపరాదు. వహించినచో ఆ పట్టు వదలరాదు. పట్టినపట్టు నడిమిలోనే విడచుటకంటే మరణము మేలు.
 
59.
పంక్తి 477:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' ఇతరుల తప్పులను పట్టుకొనువారు, అనేకులు గలరు. కాని తమ తప్పులను తాము తెలుసుకొనలేరు.
 
60.
పంక్తి 485:
విశ్వధాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' తరచుగ పాడుచుండిన కంఠధ్వని మాధుర్యముగ నుండును. ప్రతిదినము తినుచుండిన వేపవేరైనను తియ్యగ నుండును. ప్రయత్నము చేయచుండిన పనులు నేరవేరును. ఈ ప్రపంచమున పద్ధతులు యీ విధముగ ఉండును.
 
61.
పంక్తి 493:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' తనయందు అనేక్ తప్పులు పెట్టుకొని, దుర్మార్గులు ఇతరుల తప్పులను యెన్నుచుదురు. చక్కిలమునుచూచి జంతిక నవ్వినట్లు వుండును కదా!
 
62.
పంక్తి 501:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' ఇనుము విరిగిన కాల్చి, అతుకవచ్చును, మనసు విరిగినచో మరల అంటీంచుట ఎవరితనము కాదు.
 
63.
పంక్తి 509:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' ఇతరులను పాదుచేయవలెయునని కొందరు ఆలోచనచేయుదురు. కాని, తమకు కలుగు ఆపదలను గ్రహింపలేరు. ఒకరిని పాదుచేయ వలయుననిన, భగవంతుడు వారినే పాడుచేయును.
 
64.
పంక్తి 517:
విశ్వదాభిరామ! వినురవేమ.
 
'''భావం:''' దుర్మార్గుని చేతికి ధనముయిచ్చి, దానికై మరల అతని వెంట తిరుగుట తెలివితక్కువతనము. పిల్లిమ్రింగినకోడి పిలిచిననూ పలుకదుకదా.
 
65.
పంక్తి 525:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' ఇతరులకు సంతోషము కలుగునట్లు మాటలాదు విధానము నేర్చుకొని వారి మనస్సు ఆనందపరచి, శ్రమపడకుండ వారి నుండి చేతిలో సొమ్ము తేరగనే రాదు.
 
66.
పంక్తి 533:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' చంపదగినట్టి శత్రువు తన చేతిలో చిక్కిననూ, అపకారము చేయక, దగిన ఉపకారమునే చేసి విడిచిపెట్టుట మంచిది.
 
67.
పంక్తి 541:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' వానగురియనచో కరువు వచ్చును, వానకురిసిన వరద వచ్చును. వరదా కరువూ రెండునూ కదాని వెంటా మరియెకటి వచ్చునని తెలుసుకొనవలెను.
 
68.
పంక్తి 549:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' పుట్టిన వారందరూ మరణించనిచో యీ భూగోళము పట్టదు. యమునిలెక్క ప్రకారము ఒకరి తరువాత ఒకరుచనిపొవుచునే యుందురు.
 
69.
పంక్తి 557:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' ఈ కలియుగములో వానరాకడ, ప్రాణము పోకడ ముందుగా యెవరునూ తెలుసుకొనలేరు. ఇది కలియుగ ధర్మము.
 
70.
పంక్తి 565:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' స్వాతికార్తిలో ముత్యపు చిప్పలో పదినచినుకు ముత్యమగును నీటబదినది నీటిలో కలిసిపోవును. ప్రాప్తించుచోట ఫలము తప్పదు.
 
71.
పంక్తి 573:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' ఎన్నిచోట్ల తిరిగి ఎన్ని కష్తములు పడినను, లాభము కలుగునీయక శని వెంటాడి తిరుగుచుండును. తమ ప్రదేశము క్రొత్తదైననూ, తినువారు క్రొత్తవారు కాదుగదా.
 
72.
పంక్తి 581:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' పూర్వజన్మమున చేసిన కర్మ అనుభవింఒపక తప్పదు. ధర్మరాజు వంటివాడు. ఒక సామాన్యమైన చిన్నరాజు దగ్గర కొంతకాలము కంకుభట్టుగా వుండెను.
 
73.
పంక్తి 589:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' విలుగానిచోట అధికుదనని సంచరించరాదు. సామాన్యముగనుండుట నీచముగాదు. అద్దములో కొంత చిన్నదిగ కంపించిననూ అసలు చిన్నది కాదుగకా.
 
74.
పంక్తి 597:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' చెడ్డకాలము వచ్చినపుదు భోగములన్నియు వదులుకొని సామాన్యముగ కాలము గడుపవలయును. అర్జునుడు రాజ్యము పోగొట్టుకొని విరాటరాజు కొలువులో చేరెనుగదా.
 
75.
పంక్తి 605:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' బలము బలము లేనప్పుదు సింహమునైనను బక్కకుక్క కరచి బాధపెట్టును. సక్తిలేనప్పుడుపంతంములకుపోకతలవంచుకొని తిరుగుటమంచిది.
 
76.
పంక్తి 613:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' గొప్ప ధనవంతుదైన రావణుని లంకను సామాన్యమైన కోతులు నాసనము చేసెను. చెడ్డకాలము వచ్చినప్పుదు సామాన్యులైనను అపకారము చేయుదురు.
 
77.
పంక్తి 621:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' మొదట ఉపకారము చేసెదననిచెప్పి, త్రిప్పిత్రిప్పి తరువాత పొమ్మను లోభులకు, అపకారము వుండేలు దెబ్బవలె తప్పక తగులును.
 
78.
పంక్తి 629:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' దాతదగ్గర లోభిచేరినచో, చచ్చినను ధర్మము, పరోపకారము చేయనీయుడు. సకల కోరికలనిచ్చు కల్పవృక్షము క్రింద ముండ్లపొదవుండినచో కల్పవృషము దగ్గరకు పోనీయదుగదా.
 
79.
పంక్తి 637:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' ఆలోచింపగా, లేదనక అడ్డుచెప్పక తట్టుపడక మనస్సులో "యీయనా, వద్దా ! అని ఆలోచింపక తనది కాదని ఇతరులకు పెట్టుటే మంచిదే.
 
80.
పంక్తి 645:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' ధనము సంపాదించి, దానమీయక, తాను తినక, దాచుకొనుట, తేనెటీగ తేనెను ప్రోగుచేసి బాటసారికి యిచ్చునట్లుగనే ఇతరుల పాలు చేయుట అగును.
 
81.
పంక్తి 653:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' కేరళ దేశము పోయిననూ కుక్క సింహము కాలేదు. కాశీకి పోయినను పంది యేనుగు కాలేదు. ఇతర కులము వారు బ్రహ్మణులు కాలేరు.
 
82.
పంక్తి 661:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' తవుడును చూచుటకు బోవగా బియ్యము గంప కుక్క తినివేసినట్లుగ, వైశ్యునిసొమ్ము నీచుల పాలగు చుండును.
 
83.
పంక్తి 669:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' దాతృత్వము లేనివానిని యెన్ని సార్లు అడిగినను యేమియు లాభములేదు. సముద్రములో ముంచిననూ అవురుగడ్డి దర్భగాదు.
 
84.
పంక్తి 677:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' రాతి గుండు పగులగొట్టవచ్చును. కొండలన్నియు డండిగొట్ట వచ్చును. కఠిన హృదయుని మనసు మాత్రము మార్చలేము.
 
85.
పంక్తి 685:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' వంకరగా నువ్నె కర్రను కాల్చి దాని వంపు తీయవచ్చును. కొండ లన్నిటినీ పిండిగొట్ట వచ్చును. కాని కఠిన హృదయము మనసు మాత్రము మార్చలేము.
 
86.
పంక్తి 693:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' ధనవంతుని వీపుపై పుండు పుట్టినను, ఆ విషయమును లోకములో అందరును చెప్పుకొందురు. పేదవాని యింటిలో పెండ్లి అయినను చెప్పుకొనరు.
 
87.
పంక్తి 701:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' కష్టములు కలిగినప్పుడు బంధువులు దగ్గరకు పోయిపరిశీలిపపుము, భయము కలిగినప్పుడు, ధైర్యమును పరీక్షింపుము. దరిద్రముగా వున్నప్పుడు భార్యగుణము పరీక్షింపుము.
 
88.
పంక్తి 709:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' భార్యమాటలు విని అన్నదమ్ములను వదలిపోవుట అజ్ఞానము కుక్కతోక పట్టుకొని గోదవరి ఈదుట అసాధ్యము అనితెలుసుకొనుము.
 
89.
పంక్తి 717:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' భర్తకాలములో కష్టపడి గృహమును కాపాడినచో, కొడుకులు పెద్దవారైనప్పుడు సుఖపడ వచ్చును. ఎంతవారికైననూ కలిమి, లేమి రెండునూ జీవితములో వచ్చుచుండును.
 
90.
పంక్తి 725:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' చెప్పులో ఉన్నరాయి, చెవిలో దూరిన జోరీగ, కంటొలోపడిన నలసు కాలిముల్లు, ఇంటిలోని జగడం వెంటనే తగ్గక చాలా బాధిస్తాయి.
 
91.
పంక్తి 733:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' తల్లిదండ్రులపై ప్రేమ లేని పుత్రుడు పుట్టినా చనిపోయినా నష్టములేదు. పుట్టలో చెదలు పుడుతూ ఉంటాయి. నశిస్తూ ఉంటాయి.
 
92.
పంక్తి 741:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' మనిషి తనకు లేనప్పుడు దేవుని దూషిస్తాడు. ఉన్నప్పుడు దేవుని మరచిపోతాడు. ఇదే మనిషికి దేవునికి సంబంధమై ఉంటుందేమోకదా!
 
93.
పంక్తి 749:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' మనసులో ఉన్నది ఒకటి, పైకి మాటాదేది మరొకటి. తన గుణము ఒకటి, అలోచన వేరొకటి ఉన్నవానికి మోక్షము దొరకదు.
 
94.
పంక్తి 757:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' ఇంటిలో ప్రవేశించిన కుక్క కుండలు వెదనుకునట్లుగ గదిలోకి వచ్చిన దొంగ ధనము కొరకు వెదుకునుగాని దేవునికిమ్రొక్కడు.
 
95.
పంక్తి 765:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' మనిషి చాటు మాటూగ అనేక తప్పుచేసి ఇతరుల ఎదుట మంచివాడుగా నటించవచ్చును. కాని సర్వము తెలిసిన భగవంతుడు మనిషి చేసిన తప్పులనుగుర్తిస్తాడు.
 
96.
పంక్తి 773:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' వేష భాషలు నేర్చుకొని కాషాయ బట్టలు కట్టినంత మాత్రాన మోక్షమురాదు. తలలు చేసినంత మాత్రాన అతని మనసు బోడిది కాదుకదా!
 
97.
పంక్తి 781:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' మూర్ఖుణ్ని మూర్ణుడే మెచ్చుకొంటాడు. అజ్ఞానియైన వాడు లోభివానినే మెచ్చుకుంటాడు. పంది బురదనే కోరుకుంటుంది. కాని పన్నీరును కోరుకోదు.
 
98.
పంక్తి 789:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' గాజు బుడ్డిలో ఏవిధముగా దీపము నిలకడతో వెలుగుతుందో అదే విధముగ తెలివిగల వారియండు జ్ఞాన దీపము ప్రవేశిస్తుండి.
 
99.
పంక్తి 797:
విశ్వదాభిరామ! వినుర వేమ!
 
'''భావం:''' ఇతర దానములు ఎన్ని చేసిననూ అన్నదానముతో సాటిగావు. లేలోచించినచో అన్నమే యీ లోకములో జీవనాధారము.
 
100.
పంక్తి 805:
విశ్వదాభిరామ! వినురవేమ!
 
'''భావం:''' ఈ లోక మందును, పరలోక మందును గూడసుఖపడుటకు మార్గముగ, నుందునని ఈ శతకము వ్రాసితిని. దీనిని చదివిన వారికిని విన్నవారికిని శుభములు కలుగును. ఇది నిజము.
 
1.
"https://te.wikipedia.org/wiki/వేమన_శతకము" నుండి వెలికితీశారు