విజయశాంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| భార్య_భర్త = [[నందమూరి శ్రీనివాస్ ప్రసాద్]]
}}
దక్షిణ భారత సినీ రంగంలో [[విశ్వ నట భారతి]]గాభారతిగా వినుతికెక్కిన '''విజయశాంతి''' [[తెలుగు సినిమా|తెలుగు]] చలన చిత్రాలలో ప్రసిద్ధిగాంచిన నటి. ఈమె [[జూన్ 24]], [[1964]]న [[వరంగల్]]లో జన్మించి, [[మద్రాసు]]లో పెరిగింది. విజయశాంతి పిన్ని [[విజయలలిత]] కూడా అలనాటి తెలుగు సినిమా నటే. విజయశాంతి అసలు పేరు '''శాంతి'''. ఆమె తెరపేరు లోని ''విజయ'' తన పిన్ని [[విజయలలిత]] పేరు నుండి గ్రహించబడింది. విజయశాంతి తన 7వ సంవత్సరములోనే బాలనటిగా సినీరంగములో ప్రవేశించినట్లు వినికిడి, కానీ ఆమె బాలనటిగా నటించిన చిత్రాల వివరాలు అందుబాటులో లేవు. ఆమెను కథానాయకిగా తెరకు పరిచయము చేసినది ప్రముఖ తమిళ దర్శకుడు [[భారతీరాజా]]. ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా [[కల్లుక్కుళ్ ఈరమ్]] (రాళ్లకూ కన్నీరొస్తాయి) కథానాయికగా విజయశాంతి మొదటి సినిమా. తన మాతృభాష తెలుగులో విజయశాంతి తొలి చిత్రం అదే ఏడాది (1979) అక్టోబరులో ప్రారంభమై ఆ తరువాతి ఏడు విడుదలైన [[కిలాడి కృష్ణుడు]]. ఈ చిత్రంలో హీరో సూపర్ స్టార్ [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]; చిత్ర దర్శకురాలు [[విజయనిర్మల]].
 
విజయశాంతి కథానాయికగా పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు పరిశ్రమలో నిలదొక్కుకోవటానికి గ్లామర్ ప్రధానమైన పాత్రలనే ఎక్కువగా పోషించింది. వాటిలో చెప్పుకోదగ్గవి ఏవీ లేనప్పటికీ ఉన్నంతలో మహానటులు ఎన్టీయార్, ఏయెన్నార్ ల కలయికలో వచ్చిన 'సత్యం - శివం'లో ఆమె పోషించిన పాత్ర కొద్దిగా గుర్తు పెట్టుకోదగ్గది. ఈ నాలుగేళ్లలో ఆమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది. విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా [[టి.కృష్ణ]] దర్శకత్వంలో [[ఈ తరం]] సంస్థ [[1983]]లో నిర్మించిన [[నేటి భారతం]]. అప్పటి నుండి ఆమె వెనుదిరిగి చూసుకోనవసరం లేకుండాపోయింది. క్రమంగా కథానాయికగా ఒక్కో మెట్టే అధిరోహిస్తూ దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే మరే నటీ అందుకోలేని స్థాయికి చేరింది.
 
== విజయశాంతి సినీ ప్రస్థానం ==
పంక్తి 23:
[[జయసుధ]], [[జయప్రద]] అభినయంతో, [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]], [[మాధవి]] అందచందాలతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది '''విజయశాంతి''' సినీ ప్రస్థానం. 1979లో తొలిసారి కథానాయికగా కెమెరా ముందుకొచ్చేనాటికి ఆమె వయసు కేవలం పదిహేనేళ్లు. [[భారతీరాజా]] వంటి సృజనశీలి వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్నా ఆమె తనదంటూ ఓ గుర్తింపుకోసం నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. తొలి నాలుగేళ్లలో [[కిలాడీ కృష్ణుడు]], [[పెళ్లీడు పిల్లలు]], [[సత్యం -శివం]], [[వంశగౌరవం]], [[కృష్ణావతారం]], [[రాకాసి లోయ]], [[పెళ్ళి చూపులు (సినిమా)|పెళ్లిచూపులు]] మొదలైన తెలుగు చిత్రాల్లో ఆడి పాడే కథానాయిక వేషాలే వరించాయామెని. ఈ కాలంలో రాశి పరంగా తెలుగుకన్నా తమిళంలో ఎక్కువ చిత్రాల్లో నటించినప్పటికీ అవేవీ ఆమె గుర్తుంచుకోదగ్గవి కావు. పైపెచ్చు వాటిలో కొన్ని మర్చిపోదగ్గ చిత్రాలు కూడా. 1981లో వచ్చిన [[రజంగం]] అనే [[తమిళ]] చిత్రంలో స్విమ్ సూట్ ధరించి కొద్దిపాటి సంచలనం సృష్టించిందామె.
 
1983లో [[టి. కృష్ణ]] రూపంలో అదృష్టం ఆమె [[తలుపు]] తట్టింది. [[ప్రజా నాట్య మండలి]] నాటకాల ద్వారా ప్రగతిశీల భావాలుగల ప్రయోక్తగా అప్పటికే పేరొందిన టి. కృష్ణ తొలిసారిగా ఒక తెలుగు చలనచిత్రాన్ని రూపొందిస్తూ అందులో ఒక ప్రధాన పాత్రకు అనేకమందిని పరిశీలించిన పిమ్మట విజయశాంతిని ఎంచుకున్నాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ చిత్ర కథానాయిక పాత్రలో జీవించడం ద్వారా [[నేటి భారతం]] ఘన విజయానికి పరోక్షంగా కారణమైంది విజయశాంతి. అలా, తెలుగు తెరపై అప్పటికే పాతుకుపోయిన కథానాయికలను సవాలు చేస్తూ మరో తార ఉద్భవించింది. అటుపై అందొచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని మరో రెండేళ్లలో ఆ తార ఎవరికీ అందనంత ఎత్తెదిగి ధ్రువతారగా నిలిచింది. [[నేటి భారతం]] చిత్రంలో తన నటనకు మొదటిసారిగా ఉత్తమ నటిగా [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వ [[నంది బహుమతినిబహుమతి]]<nowiki/>ని కూడా గెలుచుకుంది.
 
=== 1984 నుండి 1985 ===
పంక్తి 42:
 
=== 1991 నుండి 1995 ===
[[కర్తవ్యం]] తెచ్చి పెట్టిన సూపర్ స్టార్ హోదా వల్ల 1991 నుండి విజయశాంతి నటించే చిత్రాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆమెను ఆట పాటలకు మాత్రమే పరిమితమైన కథానాయిక పాత్రలో చూడటానికి ప్రేక్షకులు అయిష్టత చూపించసాగారు. ఆమె ఉందంటే ఆ పాత్రకు ఏదో ప్రత్యేకత ఉండి తీరుతుందన్న నమ్మకంతో సినిమాకు వచ్చే ప్రేక్షక గణం పెరిగిపోయింది. ఆ కారణంగా దర్శక నిర్మాతలు కూడా ఆమె కోసమే కథలు తయారు చేసి [[సినిమాలు]] తీయడం మొదలు పెట్టారు. ఆ ఒరవడిలో వచ్చినవే [[మొండి మొగుడు - పెంకి పెళ్లాం]], [[ఆశయం]], [[మగరాయుడు]], [[పోలీస్ లాకప్]], [[లేడీ బాస్]], [[స్ట్ర్రీట్ ఫైటర్]], [[అత్తా కోడళ్లు]] తదితర చిత్రాలు. శతదినోత్సవాల సంగతి అవతల పెడితే ఇవన్నీ ఎంతో కొంత లాభాలార్జించినవే. ఇవే కాక 1991 - 1995 మధ్య కాలంలో ఆమె ఇతర ప్రముఖ హీరోల సరసన ప్రాధాన్యత గల పాత్రల్లో నటించగా విజయం సాధించిన చిత్రాలు [[సూర్య ఐ.పి.ఎస్.]], [[లారీ డ్రైవర్]], [[గ్యాంగ్ లీడర్]], [[రౌడీ ఇన్స్ పెక్టర్]], [[మెకానిక్ అల్లుడు]] మరియు [[చినరాయుడు]]. మంచి చిత్రంగా విమర్శకుల ప్రశంసలందుకున్నా బాక్సాఫీసు వద్ద చతికిలబడిన [[జైత్ర యాత్ర]] కూడా ఈ కాలంలో వచ్చిందే.
 
ఈ కాలంలోనే [[కర్తవ్యం]] చిత్రాన్ని [[తేజస్విని]] పేరుతో హిందీలో[[హిందీ సినిమా రంగం|హిందీ]]<nowiki/>లో స్వయంగా పునర్నిర్మాణం చేసి తెలుగులో తను పోషించిన '''వైజయంతి''' పాత్రను '''తేజస్విని'''గా తిరిగి తనే పోషించింది. [[ఎన్. చంద్ర]] దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1994లో విడుదలై ఉత్తరాదిన మంచి విజయాన్ని చేజిక్కుంచుకుంది.
 
పై చిత్రాలన్నీ ఒకెత్తు కాగా 1992 లో ఆమె నటించిన [[తమిళ సినిమా|తమిళ]] చిత్రం [[మన్నన్]] ఒకటే ఒకెత్తు. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత ఆమె నటించిన తొలి తమిళ చిత్రం అది. అందులో సూపర్ స్టార్ [[రజనీకాంత్]]కు పోటీగా అహంకారపూరితమైన కథానాయిక పాత్రలో ఆమె జీవించి తమిళ తంబిలచే జేజేలు కొట్టించుకుంది (ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో [[చిరంజీవి]] నాయకుడిగా [[ఘరానా మొగుడు]]గా తెరకెక్కింది). ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో ఆమె రజనీకాంత్ ను చెంపదెబ్బ కొట్టవలసి వస్తుంది. తమిళనాట రజనికాంత్ కున్నవీరాభిమానుల సంగతి అందరికీ ఎరుకే. సినిమాలో రజనీకాంత్ పాత్రను వేరే పాత్ర తిట్టినా సహించకుండా చెప్పులు విసిరేసే రకం వాళ్లు. 'మరే ఇతర నటి ఆ పనిచేసినా నా అభిమానులు తెరలు చించేసి ఉండేవారు. విజయశాంతి కాబట్టి వాళ్లు ఊరుకున్నారు' అని ఆ సినిమా శతదినోత్సవ సభలో రజనీకాంత్ పేర్కొనడం విశేషం.
 
1993 లో విజయశాంతి జీవితంలో ఒక మరపురాని సంఘటన జరిగింది. ఆ ఏడాది నవంబరులో తిరుపతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో తెలుగు చిత్ర రంగంలోని అనేక మంది ఇతర ప్రముఖులతో పాటు అదృష్టవశాత్తూ తప్పించికుని బయటపడింది ఆమె.
"https://te.wikipedia.org/wiki/విజయశాంతి" నుండి వెలికితీశారు