ఛాయరాజ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు, నవంబర్ → నవంబరు (2), డిసెంబర్ → డిసెంబరు using AWB
చి →‎జీవిత విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB
పంక్తి 40:
[[శ్రీకాకుళం జిల్లా]] లోని [[గార]] మండలం [[కొంక్యానపేట]]లో [[1948]] [[జూలై 6]]లో కొంక్యాన సూరమ్మ, సూర్యనారాయణ దంపతులకు ఛాయరాజ్‌ జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం ఊళ్లోనే సాగింది. బిఎస్సీ బిఇడి చేసిన ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేశారు. సామాజికశాస్త్రంలో ఎం.ఎ. చదివారు. ఈయన జీవ శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేశారు. 2005లో గజిటెడ్‌ ప్రధానోపాధ్యాయునిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, [[దూసి|దూసిపేట]] లో ఉద్యోగ విరమణ పొందారు. మొదటి నుండి సాహిత్య కృషి సాగించారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటాన్ని కావ్యరూపంగా మలిచారు. కొండకావ్యం 'గుమ్మ', స్త్రీ, పురుష సంబంధాలను విప్లవీకరించిన 'నిరీక్షణ', బుదడు, తొలెరుక, మన్ను నన్ను మౌనంగా ఉండనీయదు, మాతృభాష, దర్శిని, రసస్పర్శ, దుఖ్ఖేరు తదితర కథలు, కావ్య రచనలు చేశారు. ఆయన రచనలు శ్రీకాకుళం, కారువాకిని ఇటీవలే ఆవిష్కరించారు. 1980లో జనసాహితీలో సభ్యునిగా చేరిన ఛాయరాజ్‌ 2007 నుండి ఇప్పటివరకూ ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు. ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌, తెలుగు వెలుగు, [[ఆంధ్రప్రదేశ్‌]] సాహితీ సాంస్కృతిక సమాఖ్య, జిల్లా సాంస్కృతిక మండలి అవార్డులు అందుకున్నారు.
 
శిల్పగతమైన శక్తులు ఎన్నివున్నా, కవికి వ్యక్తిత్వాన్ని ఇచ్చేవి అతని విశ్వాసాలు, అభిప్రాయాలే. సమాజం గురించి, జీవితం గురించి స్థిరమైన అభిప్రాయాలు లేనివాడు ఎన్నాళ్లయినా తనదని చెప్పుకోదగ్గ వ్యక్తిత్వం పొందలేడు. ఈ నిర్దిష్టమైన విలువలు తన ప్రతి రచనలోనూ మేళవించి సామాజిక ప్రయోజనం పరమావధిగా రచనలు చేస్తున్న అతి కొద్దిమంది తెలుగు కవులలో ఛాయరాజ్ ఒకరు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన కవి ఛాయరాజుకు 2005లో ప్రతిష్ఠాత్మక ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు లభించింది.[[తెలుగు]] కవిత్వంలో ఫ్రీవర్స్ ఫ్రంటుకు ఉత్తమ బహుమానం అన్న విలువ వుందిఉంది.
 
ఛాయరాజ్ రచించిన నవల 'కారువాకి'.. ఆయన మరణానికి కేవలం రెండు రోజుల ముందు.. 19.09.13న ఆవిష్కృతమైంది. అలాగే.. 1959-70 నడుమ సాగిన శ్రీకాకుళ గిరిజనోద్యమాన్ని 'శ్రీకాకుళం' కథాకావ్యంగా ఆయన ఆవిష్కరించారు. ఉపాధ్యాయుడుగా పనిచేసిన ఆయన.. ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారు.
"https://te.wikipedia.org/wiki/ఛాయరాజ్" నుండి వెలికితీశారు