"భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ" కూర్పుల మధ్య తేడాలు

చి (→‎[[భారత ఎన్నికల కమీషను]]: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేసినది. → చేసింది. using AWB)
 
==రాజకీయ పార్టీల చరిత్ర==
[[భారత జాతీయ కాంగ్రెస్]] యొక్క ఏకఛత్రాధిపత్యానికి [[1977]]లో మొదటి సారిగా విఘాతం గలిగినది. [[ఇందిరా గాంధీ]] నేతృత్వంలో ఈ పార్టీ మొదటిసారిగా ఓటమిని చవిచూసింది. [[భారత అత్యవసర స్థితి|అత్యవసర పరిస్థితి]] కాలంలో కాంగ్రెస్ యొక్క నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా 4 ప్రముఖ పార్టీలచే ఏర్పాటైన [[జనతా పార్టీ]] [[మురార్జీ దేశాయ్]] నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే [[1989]]లో రెండో సారి అధికారాన్ని కోల్పోగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (వి.పి.సింగ్) నేతృత్వంలో [[భారతీయ జనతా పార్టీ]] మరియు వామపక్షాల మద్దతుతో [[జనతాదళ్]] ప్రభుత్వం ఏర్పడింది.
 
1992 లో మరియు ఆ తరువాత కేంద్రంలో ఏకపార్టీ గుత్తాధిపత్యం నశించి, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఈ వ్యవస్థలో అనేక పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో ప్రాంతీయ పార్టీలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, తెలుగుదేశం, అన్నా డి.యం.కె. అస్సాం గణపరిషత్, నేషనల్ ఫ్రంట్, లోక్‌దళ్, [[బహుజనసమాజ్ పార్టీ]], లాంటివి ముఖ్యమైనవి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2139395" నుండి వెలికితీశారు