లాల్ కృష్ణ అద్వానీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
[[1927]] [[నవంబర్ 8]]న [[సింధ్]] ప్రాంతంలోని [[కరాచి]]లో జన్మించిన అద్వానీ [[కరాచీ]], [[హైదరాబాదు (పాకిస్తాన్)|హైద్రాబాదు]]లలో విద్య నభ్యసించి 15 సం.ల ప్రాయంలోనే [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] (ఆర్.ఎస్.ఎస్)లో ప్రవేశించి ఆర్.ఎస్.ఎస్ సిద్ధాంతాలను పూర్తిగా ఒంటపట్టించుకొని ఇంజనీరింగ్ చదువును కూడా మానివేసి పూర్తిగా దేశ రాజకీయాలకే అంకితమయ్యాడు. దేశ విభజన అనంతరం భారత్ కు తరలివచ్చాడు. [[మహాత్మా గాంధీ]] హత్య అనంతరం అనేక మంది ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలతో పాటు అద్వానీ కూడా అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత [[శ్యాం ప్రసాద్ ముఖర్జీ]] స్థాపించిన [[భారతీయ జనసంఘ్]] పార్టీలో చేరి చురుగ్గా పనిచేశాడు. [[దీన్ దయాళ్ ఉపాధ్యాయ]] సహకారంతో మంచి కార్యకర్తగా పేరుపొంది, [[రాజస్థాన్]] [[జనసంఘ్]] పార్టీ అధ్యక్షుడికి సలహాదారునిగా నియమించబడ్డాడు.
== 1960, 70 దశాబ్దం ==
1966లో [[ఢిల్లీ]] మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికలలో జన సంఘ్ తరపున ఎన్నికై మరుసటి సంవత్సరమే [[ఢిల్లీ]]మున్సిపల్ [[కార్పోరేషన్]] అధ్యక్షుడయ్యాడు. 1970లో [[రాజ్యసభ]]కు ఎన్నికైన అద్వానీ జనసంఘ్ లో ప్రముఖ పాత్ర వహించి దేశ ప్రజలను ఆకర్షించాడు. 1975లో [[మీసా చట్టం]] కింద అరెస్ట్ అయ్యాడు. [[భారత అత్యవసర స్థితి|ఎమర్జెన్సీ]] కాలంలో తన అనుభవాలను వివరిస్తూ అద్వానీ [[ది ప్రిజనర్స్ స్క్రాప్ బుక్]] గ్రంథాన్ని రచించారు. 1976లో జైలు నుంచే రాజ్యసభకు ఎన్నికైనాడు. ఎమర్జెన్సీ అనంతరం జనసంఘ్ పార్టీ [[జనతా పార్టీ]]లో విలీనం కావడంతో అద్వానీ 1977లో జనతా పార్టీ తరపున పోటీ చేసి [[మొరార్జీ దేశాయ్]] ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖా [[మంత్రి]]గా పనిచేశారు. ఆ విధంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రిగా పనిచేసిన మొట్టమొదటి కాంగ్రెసేతర వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. జనతా పార్టీ పతనంతో జనసంఘ్ పార్టీ వేరుపడి [[భారతీయ జనతా పార్టీ]] పేరుతో కొత్త పార్టీ స్థాపించడంతో అద్వానీకి దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం కల్గింది.
 
== 1980 దశాబ్దం ==
కాని ప్రారంభంలో పార్టీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. 1982లో పార్టీకి లభించిన [[లోక్‌సభ]] స్థానాల సంఖ్య రెండు మాత్రమే. 1986లో అద్వానీ [[భారతీయ జనతా పార్టీ]] అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1989 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ స్థానాల సంక్యను 86 కు పెంచగలిగినాడు. అద్వానీ లోక్‌సభలోకి తొలి సారిగా ప్రవేశించినది కూడా 1989లోనే.
"https://te.wikipedia.org/wiki/లాల్_కృష్ణ_అద్వానీ" నుండి వెలికితీశారు