జె.బి.కృపలానీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
క్రియాశీలక ఎన్నికల రాజకీయాల్లో కొనసాగుతూనే, కృపలానీ క్రమేణ రాజకీయ నాయకుడిగా కంటే కమ్యూనిస్టుల ఆధ్యాత్మిక గురువుగా పరిణితి చెందాడు. ముఖ్యంగా [[వినోబా భావే]]తో పాటు కృపలానీని అంతరించిపోతున్న గాంధేయవాదుల వర్గానికి నాయకునిగా భావిస్తారు. 1970లలో వినోభా భావేతో పాటు ఈయన అనేక పరిరక్షణ మరియు సంరక్షణా కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేశాడు.
 
1972-73లో, కృపలానీ రానురాను నిరంకుశంగా తయారవుతున్న అప్పటి ప్రధానమంత్రి [[ఇందిరా గాంధీ]] యొక్క పాలనపై నిరసన ధ్వజమెత్తాడు. కృపలానీ, [[జయప్రకాశ్ నారాయణ్]]‌లు ఇందిరా గాంధీ పాలన నియంతృత్వంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉందని భావించారు. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ యంత్రాగాన్ని ఉపయోగించుకుందన్న అభియోగము న్యాయస్థానములో నిర్ధారణ కావడంతో, ప్రజలు ఆమె పాలన విధానాలపై విస్మయం చెందారు మరియు ఆమె రాజకీయ ప్రతిపక్షాలు మరింత బలిష్టమయ్యాయి. నారాయణ్ మరియు లోహియాలతో పాటు కృపలానీ దేశమంతటా పర్యటించి అహింసాయుత ప్రదర్శనలు మరియు పౌర నిరసనలు నిర్వహించాలని ప్రజలను కోరారు. 1975లో [[భారత అత్యవసర స్థితి|అత్యయిక పరిస్థితినిపరిస్థితి]]ని విధించినప్పుడు పెద్ద ఎత్తున నిరసన రేపడానికి కారకుడైనందుకు, [[జూన్ 26]], 1975 రాత్రి అరెస్టు చేయబడిన మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుల్లో 80యేళ్ళు పైబడిన కృపలానీ ఒకడు. [[భారత అత్యవసర స్థితి|ఎమర్జెన్సీ]] అంతం కావడం, 1977 ఎన్నికల్లో జనతా పార్టీ గెలుపొంది స్వాతంత్ర్యము తర్వాత మొట్టమొదటిసారిగా ఒక కాంగ్రేసేతర ప్రభుత్వం నెలకొల్పటం చూడటానికి కృపలానీ జీవించే ఉన్నాడు.
 
కృపలానీ 94 యేళ్ళ వయసులో [[1982]], [[మార్చి 19]]న మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/జె.బి.కృపలానీ" నుండి వెలికితీశారు