టెలీఫోను: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు (2), లో → లో , → using AWB
పంక్తి 2:
[[దస్త్రం:ATTtelephone-large.jpg|150px|right|thumb|టచ్ టోన్® సింగల్ లైన్ వాణిజ్య టెలీఫోను, వార్త నిరీక్షణ ల్యాంపు తో]]
 
టెలిఫోను (దూరవాణి) అనేది దూర ప్రాంతాలకు సమాచారాన్ని ధ్వని తరంగాల నుండి విద్యుత్ తరంగాలుగా మార్చి తీగల ద్వారా లేదా యితర మాధ్యమం ద్వారా చేరవేసే పరికరం. '''టెలీఫోను''' ([[గ్రీకు|గ్రీకు భాష]] నుండి 'టెలీ' (τηλέ) = దూర, మరియు 'ఫోను' (φωνή) = వాణి) ఒక 'దూర సమాచార' పరికరం, దీనిని శబ్ద ప్రసారం మరియు శబ్ద గ్రహణ కొరకు ఉపయోగిస్తారు. సాధారణంగా ఇద్దరు సంభాషించుకోవడానికి, కొన్ని సమయాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది సంభాషించుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఇది సర్వసాధారణ పరికరం. దీనియొక్క మొదటి పేటెంట్ హక్కును 1876 లో [[అలెగ్జాండర్ గ్రాహంబెల్]] అనే శాస్త్రజ్ఞుడు పొందాడు. తర్వాత టెలిఫోన్ లలో యితర మార్పులు యితర శాస్త్రజ్ఞులచే చేయబడ్డాయి. ఇది క్రమేణా ప్రపంచంలో వ్యాపార వర్గాలకు, ప్రభుత్వాలకే పరిమితం కాకుండా సామాన్య మానవునికి కూడా అందుబాటులోకి వచ్చింది.
 
టెలిఫోన్ (దూరవాణి) లో ముఖ్యమైన భాగములు, మైక్రోఫోన్ (ట్రాన్స్ మీటరు) మాట్లాడుటకు, మరియు రిసీవర్ (వినుటకు) ఉంటాయి. ప్రతి టెలీఫోన్ కు ఒక సంఖ్య ఉంటుంది. దానికి వేరొక ఫోన్ తో చేసినపుడు అవి అనుసంధానించబడి టెలిఫోన్ నుండి శబ్దం వినబడుతుంది. దీని ఆధారంగా ఫోన్ వచ్చే సమాచారం తెలుసుకోవచ్చు. సుమారు 1970 ప్రాంతం వరకు అనేక టెలిఫోన్ లు రోటరీ డయల్ (నంబర్లు త్రిప్పుట) తో పనిచేయసాగాయి. కానీ 1963 లో AT&T అనే సంస్థ పుష్ బటన్ డయల్ తెలీఫోన్లను మొదట ప్రవేశపెట్టింది<ref>Dodd, Annabel Z., ''The Essential Guide to Telecommunications''. Prentice Hall PTR, 2002, p. 183.</ref>. రిసీవర్ మరియు ట్రాన్స్ మీటర్ లు ఒకే హాండ్ సెట్ కు అమర్చి ఒకేసారు మాట్లాడుటకు, వినుటకు సౌలభ్యం చేకూర్చారు. ఈ హాండ్ సెట్ కొన్ని తీగలతో టెలిఫోన్ సెట్ కు అనుసంధానించబడుతుంది.
పంక్తి 15:
ప్రసారిణిగా, రిసీవర్ గా ఇవి సమర్థవంతంగా పనిచేయాలంటే, వీటి నిర్మాణంలో కొద్దిగా మార్పులు అవసరమని అతడు గుర్తించాడు. పీపాకు ఒకవైపున పెద్ద రంధ్రం తొలిచి దానికి అడ్డంగా జంతు సంబంధమైన పల్చని చర్మం పొరను కట్టి, దీన్ని ప్రసారిణిగా ఉపయోగించాడు. అల్లిక సూది చుట్టూ తీగలు చుట్టి ఫిడేలుకు సంధించి దీన్ని రిసీవర్ గా వాడాడు. ఒకరోజు రిసీవర్ ని తరగతి గదిలో వుంచి, వర్క్ షాపులో ఉన్న ప్రసారిణి ముందు నిలబడి సంగీత వాద్యాలను వాయిస్తూ చర్మం పొర ముందు గానం చేశాడు. తరగతిలో కూర్చున్న పిల్లలకు రిసీవర్ నుంచి కొన్ని అస్పష్ట శబ్దాలు వినబడ్డాయి.
 
1861 అక్టోబర్ లోఅక్టోబరులో ఫ్రాంక్ ఫర్డు భౌతిక శాస్త్ర సంఘం అధ్వర్యంలో విజ్ఞాన శాస్త్రజ్ఞుల ముందు తన పరికరాన్ని ప్రదర్శించి ఫిలిప్ రీన్ ఉపన్యసించాడు. "విద్యుత్ ద్వారా టెలీఫోన్" అనే అంశం పై మాట్లాడుతూ అతను ఇలా చెప్పాడు. --"'''ఏ శబ్దమైనా మన చెవిలో కంపనాలు సృష్టిస్తుంది. వీటిని గ్రాఫ్ ద్వారా సూచించవచ్చు. ఈ కంపనాలను కృత్రిమ పద్ధతుల్లో సృష్టించగలిగితే, అవి మనకు సహజ శబ్దాల లాగే వినబడతాయి'''." వుపన్యాసం, ప్రయోగ ప్రదర్శన సవ్యంగానే జరిగాయి. ఇది సంచలనాత్మకంగా ఉంటుందని వూహించిన రీన్ కి నిరాశ కలిగింది. అల్లిక సూది నుంచి వెలువడిన శబ్దాలను విన్న మేధావులు అందరూ కేవలం మందహాసం ప్రదర్శించి ఇళ్ళకు వెళ్ళి పోయారు. Annals of the physical society పత్రికలో మాత్రం ఓ చిన్న నివేదిక ముద్రించబడింది. టెలీఫోన్ కేవలం అతి సాధారణమైన ఓ పరికరమని అందులో రాయబడింది. ఉత్సాహ వంతులైన కొందరు యువకులు మాత్రం ఆ పరికరం నమూనాలు కావాలని అడిగారు.
 
సుమారు రెండేళ్ళ తరువాత "చిన్న పిల్లలకో ఆట బొమ్మ" అనే శీర్షిక కింద టెలిఫోన్ ని ఎలా నిర్మించాలో ప్రఖ్యాత జర్మన్ పత్రిక డీ గార్టన్ లాబ్ వివరించింది. మరో సంవత్సరం గడిచాక గీసెన్ నగరంలో నెచురల్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశం జరిగినప్పుడు రీన్ తన పరికరాన్ని అక్కడ ప్రదర్శించాడు. ప్రేక్షకుల్లోని కొందరు యువ శాస్త్రజులు అతణ్ణి ప్రశంసించారు. ఈ సమావేశంలో కొంత ప్రచారం లభించాక Annala of the physical society పత్రిక టెలిఫోన్ పై ఓ వ్యాసం రాయాలని రీన్ ని కోరింది. "సమయం మించిపోయింది. మీ పత్రికలో ప్రచురించకపోయినా నా పరికరానికి ప్రపంచమంతటా ప్రచారం లభిస్తుంది."—అని రీస్ ప్రత్యుత్తరం వ్రాశాడు.
పంక్తి 39:
 
==కమ్యూనికేషన్ సాధనంగా టెలీఫోన్==
కమ్యూనికేషన్ సాధనంగా టెలిఫోన్ ని పెద్ద ఎత్తున వాడడంలో జర్మన్ లు కృతకృత్యులయ్యారు. హీన్ రిచ్ స్టీఫాన్ బెర్లిన్ నగరంలో పోస్ట్ మాస్టర్ జనరల్ గా పనిచేస్తుండేవాడు. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ నీ, పోస్ట్ కార్డును తొలిసారిగా తయారుచేసిందీ ఇతడే. లోహం తీగల గుండా మాట్లాడటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అతడు విన్నాడు గానీ ఇతర వివరాలేవీ తెలియలేదు. సైంటిఫిక్ అమెరికన్ పత్రిక 1877 అక్టోబర్అక్టోబరు సంచికలో టెలిఫోన్ గురించి ఓ వ్యాసం ప్రకటించింది. పరికరం నమూనాను పంపమని వెంటనే స్టీఫాన్ ఉత్తరం రాశాడు. ప్రత్యుత్తరం వచ్చే లోపునే [[లండన్]] టెలిగ్రాఫ్ కార్యాలయం అధికారి [[బెర్లిన్]]కు వెళ్ళి వస్తూ తనవెంట ఓ టెలిఫోన్ తీసుకొచ్చాడు. దాన్ని ఆ రోజే బెర్లిన్, పాట్స్ డాం లలో అమర్చడం జరిగింది. ప్రయోగాత్మకంగా దాన్ని పరీక్షిస్తున్నప్పుదు వెర్నర్ సీమన్స్ అక్కడికి రావడం తటస్థించింది. ఈ పరికరాన్ని మెరుగుపరచడానికి వీలుందనీ, జర్మనీలో టెలిఫోన్ ల నిర్మాణానికి బెల్ ఇంకా అనుమతి పొందలేదనీ గ్రహించి, తన ఫాక్టరీ లోనే పెద్ద ఎత్తున తయారు చేయడం ప్రారంభించాడు. ఒక వారం రోజుల్లోనే జనరల్ పోస్టాఫీసు, టెలిగ్రాఫ్ ఆఫీసుల మధ్య ఫోన్ సౌకర్యం ఏర్పాటు చేశాడు. బెర్లిన్ ప్రజలు దీన్ని చూసి ముగ్దులై టెలిఫోన్ లను విస్తృతంగా కొని ఇండ్లలో ఆటబొమ్మలుగా కూడా వాడసాగారు.
 
టెలిఫోన్ లకు కేంద్రంగా పనిచేసే తొలి స్విచ్ బోర్డుని 1878 లో కనెక్టికట్ రాష్ట్రంలోని న్యూహేవన్ తయారుచేసి పెట్టారు. ఒక సంవత్సరం లోపుగానే లండన్, మాంచెష్టర్, లివర్ పూల్ నగరాల్లో వరుసగా 50,80,40 టెలిఫోన్ లకు సరిపడా ఎక్సేంజిలను నిర్మించారు. ఇవన్నీ ప్రైవేట్ రంగంలో తయారైనవే. 1911 లో బ్రిటన్ లోని టెలిఫోన్ ల బాధ్యతను జనరల్ పోస్టాఫీసు స్వీకరించింది.
"https://te.wikipedia.org/wiki/టెలీఫోను" నుండి వెలికితీశారు