"తిరుమల తిరుపతి దేవస్థానములు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎కల్యాణమస్తు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది., ధృవ → ధ్రువ using AWB
చి (→‎కల్యాణమస్తు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ద్వార → ద్వారా (2) using AWB)
చి (→‎కల్యాణమస్తు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది., ధృవ → ధ్రువ using AWB)
 
శుద్ధి: సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ శుద్ధి జరుగుతుంది. శుద్ధిలో భాగంగా గత రాత్రి జరిగిన అలంకరణలు, పూలమాలలు అన్నిటినీ తొలగించి, వాటిని సంపంగి ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు.
*అర్చన: శ్రీవారికి ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది. దీనికోసం జియ్యంగారు యమునత్తురై (పూలగది) నుంచి పుష్పమాలలు, తులసిమాలలతో ఉన్న వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవుపాలు, చందనం, పసుపునీళ్లు, గంధపునీటితో అర్చకులు అభిషేకం చేస్తారు. చివరగా పుష్పాంజలి. అనంతరం భోగ మూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూలవిగ్రహానికీ భోగమూర్తికీ స్వర్ణసూత్రాన్ని కలుపుతారు. ఈ సూత్రం ద్వారానే ధృవబేరంధ్రువబేరం నుంచి భోగశ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక. ఆ తరువాత మూలవిగ్రహానికి పుష్పన్యాసం చేసి, అలంకారాసనం సమర్పిస్తారు. అనంతరం నామధారణ. కర్పూరంతో శ్రీవారి నుదుటి మీద ఊర్థ్వపుండ్ర చిహ్నాన్ని దిద్దుతారు. యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు. తరువాత శ్రీవారి సువర్ణపాదాలను (తిరువడి) స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు.
*తోమాలసేవ: తమిళంలో 'తోడుత్తమాలై' అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. బహుశా ఈ మాటే కాలక్రమేణా మార్పులకు లోనై 'తోమాల'... తోమాలసేవ అయి ఉండవచ్చు. దీన్నే భగవతీ ఆరాధన అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత తోమాలసేవ చేస్తారు.
*కొలువు: తోమాలసేవ తర్వాత పదిహేను నిమిషాలపాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్‌ జరుగుతుంది. బలిబేరానికి రాజోచిత మర్యాదలు జరిపి ఆనాటి గ్రహసంచార క్రమాన్ని, ఆరోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు. ముందురోజు హుండీ ఆదాయం వివరాలను ఏయే నోట్లు ఎన్ని వచ్చిందీ, నాణాలు సహా (డినామినేషన్‌ ప్రకారం) మొత్తం విలువ తెలియజేస్తారు. అనంతరం నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు.
*అభిషేకం: శ్రీవారి ఆలయంలో శ్రీనివాసునికి జరిగే సేవలన్నింటిలోకి విశిష్టమైంది ప్రతిశుక్రవారం ఉదయం జరిగే అభిషేకం. ఈ సేవ ప్రాశస్త్యం ఏమిటంటే అభిషేక సమయంలో నిత్య కల్యాణశోభితుడైన స్వామివారి నిజరూప దర్శనభాగ్యం భక్తులకు లభిస్తుంది. గురువారం రాత్రి పూలంగి సేవ తరువాత దర్శనంలోనూ, శుక్రవారం ఉదయం అభిషేక సమయంలోనూ, అభిషేకానంతర దర్శనకాలంలో తప్ప మిగతా అన్ని రోజులూ స్వామి వెడల్పాటి తెల్లని కర్పూరనామంతో దర్శనమిస్తాడు. ఈ మూడు సందర్భాల్లో మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం సాధ్యపడుతుంది. దీన్నే నేత్రదర్శనం, నిజపాద దర్శనం అంటారు.
*తల కోన.
[[తిరుమల]] ఏడు కొండల వరుసలో తల భాగాన వున్నందున ఈ కొండకు [[తల కోన]] అని పేరు వచ్చింది. ప్రకృతి రమణీయతకు ఇది ఆలవాలము. చూడ చక్కని జలపాతాలకు ఇది నెలవు. అడవిలో సాహస యాత్ర చేయ దలచిన వారికిదిఎంతో ఉత్సాహానిస్తుంది. ఇన్ని హంగులున్నందునే ఇక్కడ అనేక సినిమాల చిత్రీకరణ జరిగింది. ఈ అటవీ ప్రాంతంలో అనేక ఔషధ మొక్కలకు కూడా ప్రసిద్దే, అందుకే ఇక్కడున్న చెట్లకు వాటి పేర్లు/ వాTi శాస్త్రీయ నామాలను కూడా రాసిన బోర్డులు వేలాడ దీశారు. [[గిల్లి తీగ]] వంటి అనేక ఔషధ మొక్కలకు ఇది కేంద్రము. అందుకే ఈ ప్రదేశము బొటానికల్ టూర్ చేసే వారికి సరైన ప్రదేశము. మద్ది, జాలాది, చందనం, ఎర్రచందనం మొదలైన చెట్లకు కూడా ఇది నిలయము. అరుదైన అడవి జంతువులకు కూడా ఇది కేంద్రమే. అడవి కోళ్లు, నెమళ్లు, దేవాంగ పిల్లి, ముచ్చు కోతి, ఎలుగ బంట్లు, వంటి వన జీవ జాతికి ఈ ప్రాంతం పెట్టింది పేరు. ఇక్కడ ముఖ్య ఆకర్షణ ఇక్కడున్న అనేక జలపాతాలు. రెండు కొండల మధ్యనుండి సుమారు మూడు వందల ఎత్తునుంచి పడే జలపాతాన్ని చూస్తుంటే మనసు ఉరకలేస్తుంది. దీన్ని శిరోద్రోణ తీర్థం అంటారు. ఈ నీటిలో అనేక ఔషధ గుణాలుంటాయి. దీనికి దిగువన నెల కోన అనే ప్రాంతం వుందిఉంది. అక్కడే సిద్దేశ్వర ఆలయమున్నది. [[శివ రాత్రి]] పర్వదినాన భక్తులు సుదూర ప్రాంతాలనుంచి ఇక్కడికి వస్తారు.
*ఎలా వెళ్లాలి:
తిరుపతి నుండి సుమారు యాబై కిలోమీటర్ల దూరంలో వున్నది తలకోన. తిరుపతి నుండి చాల బస్సులుంటాయి. ఇక్కడ అటవీ శాఖవారి, పర్యాటక శాఖ వారి, దేవాదాయ శాఖవారి అతిథి గృహాలున్నాయి. వసతి భోజన సదుపాయాలున్నాయి. అడవి అందాలను తిలకించడానికి వాచ్ టవర్లను, చెట్లపై కర్ర వంతెనలు ఏర్పాటు చేశారు.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2140531" నుండి వెలికితీశారు