ద్వారకా తిరుమల: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దేశమునకు → దేశానికి, లు నుండి → ల నుండి, ధృవ → ధ్రువ using AWB
పంక్తి 101:
'''ద్వారకా తిరుమల''' ([[ఆంగ్లం]] Dwaraka Tirumala) [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రము యొక్క [[పశ్చిమ గోదావరి]] జిల్లాలోని ఒక గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>, మండలము మరియు [[ఏలూరు]] నుండి 42 కి.మీ.లు దూరములో ఉన్న [[ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా|పుణ్య క్షేత్రము]]. పిన్ కోడ్: 534 426. ఏలూరునుండి ద్వారకాతిరుమలకు మూడు బస్సు రూట్లు - వయా [[భీమడోలు]], వయా [[తడికలపూడి]], వయా [[దెందులూరు]] - ఉన్నాయి. భీమడోలునుండి ఇక్కడికి 15 కి.మీ.
 
ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయము. స్వయంభువుగా ప్రత్యక్షమైన [[వేంకటేశ్వర స్వామి]]ని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశమునకుప్రదేశానికి ద్వారక తిరుమల అని పేరు వచ్చింది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల '''చిన్నతిరుపతి'''గా ప్రసిద్ధి చెందినది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు. మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉడడం కూడా అరుదు.
 
"పెద్దతిరుపతి" ([[తిరుమల|తిరుమల తిరుపతి]])లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరము క్రింద రెండు విగ్రహములు ఉండటము ఇక్కడి విశేషము. ఒక విగ్రహము సంపూర్ణమైనది. రెండవది స్వామియొక్క పై భాగము మాత్రమే కనుపించు అర్ధ విగ్రహము.
పంక్తి 116:
[[బొమ్మ:Garuda Dwarakatirumala.JPG|thumb|100px|right|ద్వారకాతిరుమల కొండ క్రింద [[గరుడుడు|గరుడ]] విగ్రహం]].
 
స్థల పురాణము ప్రకారము ఈ క్షేత్రము రాముని తండ్రి [[దశరథ మహారాజు]] కాలము నాటిదని భావిస్తారు. "ద్వారకుడు" అనే ఋషి తపసు చేసి స్వామివారి పాదసేవను కోరాడు. కనుక పాదములు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగము మాత్రమే మనకు దర్శనమిస్తుంది. [[విశిష్టాద్వైతం|విశిష్టాద్వైత]] బోధకులైన శ్రీ [[రామానుజాచార్యులు]] ఈ క్షేత్రాన్ని దర్శించినారనీ, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధృవమూర్తికిధ్రువమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే, ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ, తరువాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనుపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్ధకామ [[పురుషార్థాలు|పురుషార్ధములు]] సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం.
 
ఇక్కడ స్వామి వారికి అభిషేకము చేయక పోవడము ఇంకొక విశేషము. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి [[విగ్రహము]] క్రిందనున్న ఎర్రచీమలను కదుల్చును. ఈ గుడి యొక్క సంప్రదాయము ప్రకారము ప్రతియేటా రెండు కళ్యానోత్సవములు వైశాఖ మరియు ఆశ్వయిజ మాసములలో జరుపుతారు. ఇందుకు కారణం- స్వయంభూమూర్తి [[వైశాఖమాసము|వైశాఖమాసం]]<nowiki/>లో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్ఠించారనీ చెబుతారు.
పంక్తి 158:
 
[[Image:Chinnatirupathi 10.JPG|right|thumb|150px|కుంకుళ్ళమ్మవారి గుడి వద్దనున్న ఒక బోర్డు]]
'''కుంకుళ్ళమ్మ (రేణుకా దేవి) ఆలయం''' : కొండకు 1 కి.మీ. దూరంలో, భీమడోలుభీమడోల నుండి ద్వారకా తిరుమల మార్గంలో "కుంకుళ్ళమ్మ" ఆలయం ఉంది. ఈమె ఈ వూరి [[గ్రామదేవత]]. ప్రధాన ఆలయంలో స్వామి దర్శనం చేసుకొన్న భక్తులు తిరిగి వెళుతూ కుంకుళ్ళమ్మ దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు.
 
'''వెంకటేశ్వర స్వామి, జగన్నాధ స్వామి ఆలయాలు''' : ద్వారకా తిరుమలకు 2 కి.మీ. దూరంలో, భీమడోలు మార్గంలో ఉన్నాయి. హవేలి లింగపాలెం గ్రామ పరిధిలో సుమారు 130 సంవత్సరాల క్రితం పూరీ (ఒడిషా)కి చెందిన "మంత్రరత్నం అమ్మాజీ" అనబడే లక్ష్మీదేవి అనే భక్తురాలు ఇక్కడ తమ ఇలవేల్పు వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మింపజేసింది. అప్పటినుండి ఆ గ్రామానికి లక్ష్మీపురం అనే పేరు వాడుకలోకి వచ్చింది. వారిది పూరీ జగన్నాధమఠం కనుక జగన్నాధ స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అమ్మవార్లు, జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్ర, ఆళ్వారుల సన్నిధులు ఉన్నాయి. ద్వారకా తిరుమలను ఎగువ తిరుపతిగాను, ఈ లక్ష్మీపురాన్ని దిగువ తిరుపతిగాను భక్తులు భావిస్తారు. తిరుగు ప్రయాణంలో ఈ స్వామిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీ. 1992లో ఈ ఆలయాన్ని నిర్వహణ కొరకు ద్వారకాతిరుమల దేవస్థానానికి అప్పగించారు.
"https://te.wikipedia.org/wiki/ద్వారకా_తిరుమల" నుండి వెలికితీశారు