"నందమూరి తారక రామారావు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎బాల్యము, విద్యాభ్యాసము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంను → కాన్ని using AWB
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (→‎బాల్యము, విద్యాభ్యాసము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంను → కాన్ని using AWB)
 
==బాల్యము, విద్యాభ్యాసము==
నందమూరి తారక రామారావు [[1923]], [[మే 28]] వ తేదీన, సాయంత్రం 4:32కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని [[కృష్ణా జిల్లా]], [[పామర్రు]] మండలంలోని, [[నిమ్మకూరు]] గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు. మొదట కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య [[విజయవాడ]] మునిసిపలు హైస్కూలులో చదివాడు. తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరాడు. ఇక్కడ [[విశ్వనాథ సత్యనారాయణ]] తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును ఒక నాటకములో ఆడవేషం వేయమన్నాడు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి 'ససేమిరా' అన్నాడు. మీసాలతోటే నటించడం వలన ఆయనకు "మీసాల నాగమ్మ" అనే పేరు తగిలించారు. [[1942]] మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకంనురామతారకాన్ని పెళ్ళి చేసుకున్నాడు. వివాహో విద్యానాశాయ అన్నట్లు పెళ్ళయిన తరువాత పరీక్షల్లో రెండుసార్లు తప్పాడు. తర్వాత [[గుంటూరు]] [[ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల]]లో చేరాడు. అక్కడకూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే [[నేషనల్ ఆర్ట్ థియేటర్]] గ్రూప్ (NAT) అనే నాటక సంస్థను స్థాపించి [[కొంగర జగ్గయ్య]], [[ముక్కామల]], [[నాగభూషణం]], [[కె.వి.ఎస్.శర్మ]] తదితరులతో '''చేసిన పాపం''' వంటి ఎన్నో నాటకాలు ఆడాడు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ మంచి [[చిత్రకారుడు]] కూడా. రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో ఆయనకు బహుమతి కూడా లభించింది. [[సుభాష్ చంద్రబోసు]] [[విజయవాడ]] వచ్చినప్పుడు ఎన్టీఆర్ బోసు బొమ్మను చిత్రించి ఆయనకు కానుకగా ఇచ్చాడు.
 
==కుటుంబం==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2140665" నుండి వెలికితీశారు