పీసపాటి నరసింహమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రంగస్థల ప్రస్థానం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4) using AWB
పంక్తి 42:
 
== రంగస్థల ప్రస్థానం ==
[[1938]] లో ''రంగూన్‌రౌడీ'' నాటకంలో కృష్ణమూర్తి పాత్ర ద్వారా పీసపాటి నాటకరంగంలోకి అడుగుపెట్టాడు. [[1946]] లో ''పాండవోద్యోగ విజయాలు'' నాటకంలో మొదటిసారిగా [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుడి]] పాత్ర వేశాడు. [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వం ఆయనకు రెండు పర్యాయాలు సంగీత నాటక అకాడమీలో సభ్యత్వం ఇచ్చి గౌరవించింది. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] [[1993]] లో ఆయనను ''[[కళాప్రపూర్ణ]]'' ఇచ్చి సత్కరించింది. దాదాపు ఏడు దశాబ్దాలపాటు వేలాది ప్రదర్శనలు ఇచ్చిన పీసపాటి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. [[తిరుపతి వేంకటకవులు]], [[విశ్వనాథ సత్యనారాయణ]] వంటివారు వీరిని ఎంతగానో అభినందించారు. [[ఎన్.టి.రామారావు]] గారు వీరి నటనను (కృష్ణ పాత్రను)చూసేవారు.
 
పాండవోద్యోగ విజయాలతో పాటు ''గౌతమబుద్ధ'', ''లవకుశ'', ''తారాశశాంకం'', ''చింతామణి'' లాంటి నాటకాలు అనేకం ఆడినా పీసపాటికి ఎనలేని కీర్తి కృష్ణుని పాత్ర వల్లే వచ్చింది. అత్యుత్తమ కృష్ణునిగా ఉద్యోగవిజయాల నాటక రచయితల్లో ఒకరైన [[చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి]] నుంచి అవార్డు అందుకోవడం, [[టంగుటూరి ప్రకాశం]] నటరాజు విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వటం, [[బిలాస్‌పూర్]] లో తెలుగురాని ఒక [[బెంగాలీ]] జంట నాటకం చూసి, గ్రీన్‌ రూమ్‌లో ఆయనను తనివితీరా ముద్దాడడం తన జీవితంలో మరపురాని సంఘటనలుగా పీసపాటి పేర్కొన్నాడు.
 
పద్యగానంలో పీసపాటి ప్రసిద్ధమైన మార్పులు తీసుకువచ్చాడు. తెలుగు పౌరాణికాల్లో పద్యాలను సుదీర్ఘమైన రాగాలతో పాడడం అలవాటుగా ఉండేది. ఒక నిముషం పద్యానికి ఐదేసి నిముషాల రాగం తియ్యడం ఆనవాయితీగా ఉండేది. పీసపాటి ఆ పద్ధతిని విడనాడి, అనవసరమైన సాగతీతలను విసర్జించి, సాహిత్యానికి ప్రముఖ స్థానం కల్పిస్తూ పద్యం పాడి ప్రజలను అలరించాడు. పీసపాటి కృష్ణుడి వేషధారణలో కూడా మార్పులు తీసుకువచ్చాడు. దేహానికి అంటిపెట్టుకుని ఉండే నీలపు రంగు చొక్కా ధరించి నిజంగా నీలపు కృష్ణుడేననే భ్రమ కల్పించాడు.