ప్రతివాది భయంకర వెంకటాచారి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ → డిసెంబరు using AWB
పంక్తి 9:
పేలుడు స్థలానికి కేవలం కొన్ని వందల గజాల దూరంలోనే ఉన్న ముస్తఫా, పేలుడును విని ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నాడు. వెంటనే దర్యాప్తు మొదలైంది. ఘటనా స్థలంలో మరో మూడు బాంబులు దొరికాయి. అదొక విప్లవకారుల కుట్ర అని, అధికారులను చంపే పథకమనీ ఓ ఐదు రోజుల వరకూ దర్యాప్తు అధికారులకు తెలియలేదు. ఐదు రోజుల తరువాత కాకినాడకు చెందిన ఎస్.కె.వి.రాఘవాచారి అనే వ్యక్తి [[రామచంద్రాపురం]] సబ్ ఇన్స్పెక్టరుకు కుట్ర సంగతి వెల్లడించడంతో విషయం బైటపడింది. పోలీసులు ఒకరొకరినే పట్టుకుంటూ వచ్చారు. [[సెప్టెంబర్ 11]] న భయంకరాచారిని [[కాజీపేట]] రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు.
 
డిసెంబర్డిసెంబరు 1933 నుండి ఏప్రిల్ [[1934]] వరకు [[తూర్పు గోదావరి]] జిల్లా సెషన్సు కోర్టు ఈ కేసును విచారించింది. మొత్తం తొమ్మిది మందికీ వివిధ వ్యవధుల జైలు శిక్షను విధించింది. సెషన్సు కోర్టు ఇచ్చిన తీర్పుపై నిందితులు [[మద్రాసు]] [[హైకోర్టు]]కు వెళ్ళగా అక్కడ తీర్పు [[1935]] సెప్టెంబరు 26 న వచ్చింది. హైకోర్టు మాత్రం భయంకరాచారి, కామేశ్వరశాస్త్రి లను మాత్రమే కుట్రకు ప్రధాన నిందితులుగా పేర్కొంది. మిగిలిన ఏడుగురూ అప్పటికే గడిపిన రెండేళ్ళ శిక్ష సరిపోతుందని భావించి విడుదల చేసింది. భయంకరాచారికి ఏడేళ్ళ జైలుశిక్షను విధించి, [[అండమాన్ నికోబార్ దీవులు|అండమాను]] జైలుకు పంపింది. కామేశ్వరశాస్త్రికి నాలుగేళ్ళ శిక్ష విధించింది. 1937 లో ప్రాంతీయ ఎన్నికల్లో [[కాంగ్రెసు]] గెలిచినపుడు భయంకరాచారి జైలు నుండి విడుదలయ్యాడు.
 
==మూలాలు==