భారతీయ జనతా పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (3), మండల్ → మండలం , , → , using AWB
పంక్తి 55:
అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ లచే [[1980]] [[ఏప్రిల్ 6]]న భారతీయ జనతా పార్టీ స్థాపించబడింది. అటల్ బిహారీ వాజ్‌పేయి భాజపా తొలి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. [[1984]]లో, [[ఇందిరా గాంధీ]] హత్య అనంతరం జరిగిన [[లోక్‌సభ]] ఎన్నికలలో[[కాంగ్రెస్ పార్టీ]] విజయదుందుభి మోగించగా, భాజపా 543 నియోజకవర్గాలలో ఒకటి అవిభాజ్య [[ఆంద్రప్రదేశ్]] లోని [[హనుమకొండ]] కాగా, ఏకే పటేల్ అనే బీజేపీ అభ్యర్థి గెలుపొందిన [[గుజరాత్]] లోని మెహ్సానా నియోజక వర్గం రెండోది. [[హనుమకొండ]] నుంచే కాదు మొత్తం [[ఆంద్రప్రదేశ్]] రాష్ట్రం నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి [[చందుపట్ల జంగారెడ్డి]]. ఇక ఆ ఎన్నికల్లో వాజ్ పాయ్, అద్వానీ వంటి బీజేపీ అగ్రనాయకులందరూ పరాజయం పాలయ్యారు.543 నియోజకవర్గాలలో కేవలం రెండింటిని గెలుపొందింది. [[లాల్‌కృష్ణ అద్వానీ]] రథయాత్ర ఫలితంగా [[1989]] లోక్‌సభ ఎన్నికలలో 88 సీట్లను గెలుచుకొని [[జనతాదళ్‌]]కు మద్దతునిచ్చి [[వీ.పీ.సింగ్]] నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటానికి కారణం అయింది. [[అయోధ్య]]లో రామజన్మభూమి మందిరాన్ని కట్టాలనే ప్రయత్నంతో రథయాత్రలో ఉన్న అద్వానీని [[బీహార్]] ముఖ్యమంత్రి [[లాలూ ప్రసాద్ యాదవ్]] అరెస్టు చేసిన సందర్భాన [[అక్టోబరు 23]], [[1990]]న భాజపా తన మద్దతును వెనక్కితీసుకోగా తదుపరి నెలలో [[జనతాదళ్]] ప్రభుత్యం పడిపోయింది.
 
[[1991]] లోక్‌సభ ఎన్నికలలో మండల్మండలం, మందిర్ ప్రధానాంశాలుగా జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తన స్థానాలను 120కి పెంచుకొని ప్రధాన [[ప్రతిపక్షం]]గా మారింది. కాంగ్రెస్ [[మైనార్టీ ప్రభుత్వం]]గా పాలన కొసాగించింది. [[1996]] లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద రాజకీయ పక్షంగా అవతరించింది. అప్పటి [[రాష్ట్రపతి]] [[శంకర్ దయాళ్ శర్మ]] అటల్ బిహారో వాజ్‌పేయిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించగా బి.జే.పి. ప్రభుత్వం లోక్‌సభ విశ్వాసం పొందుటలో విఫలమైంది. తత్ఫలితంగా వాజ్‌పేయి ప్రభుత్వం 13 రోజులకే పతనమైంది. 13 రోజులు అధికారంలో ఉన్నప్పుడు భాజపాకు కేవలం మూడే మూడు మిత్రపక్షాలు (శివసేన, సమతాపార్టీ, హర్యానా వికాస్ పార్టీ) ఉండేవి.
 
=== మొదటి భాజపా ప్రభుత్వం ===
పంక్తి 114:
 
హైందవ రాష్ట్రం అనే సిద్దాంతం మొదట [[భారతీయ జన సంఘ్]] ప్రతిపాదించింది కాగా ఆ సిద్దాంతంపై భాజపా చారిత్రక అభ్యంతరాలు లేవనెత్తింది. భాజపా ప్రధాన లక్ష్యం సనాతన హైందవ సంస్కృతీ విలువల స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం. పార్టీ కీలక సిద్దాంతకర్త అయిన [[దీనదయాళ్ ఉపాధ్యాయ]] రాసిన [[ఇంటిగ్రల్‌ హ్యూమనిజమ్‌]] అన్యే పుస్తకంతో భాజపా హైందవ రాష్ట్రం సిద్దాంతానికి బీజాలు పడ్డాయి. ఉపాధ్యాయ సిద్ధాంతం ప్రకారం "రాజు" మరియు "రాజ్యము" అనేవి సమాజానికి "ధర్మము" మరియు "చిత్తము(సంస్కృత 'చిత్తి', అనగా ఉద్దేశము లేదా బుద్ది)" వంటివి. భారత సమజానికి సరైన అర్థం "జాతీయతా భావన" లోనే వున్నదని ఆయన పదే పదే చెప్పారు. హిందూ (ఉపాధ్యాయ)శాస్త్రాల ప్రకారం, రాజు మరియు రాజ్యం అంటే సమాజపు "ధర్మం" మరియు క్షితి. భారతీయ సమాజం అంటే "జాతీయ గుర్తింపు". భాజపా ప్రకారం, హిందూధర్మానుసారం మానవ జీవితం, కామం, అర్థం, ధర్మం మరియు మోక్షములపై ఆధారపడియున్నది.<ref>Smith, David James, Hinduism and Modernity P189, Blackwell Publishing ISBN 0-631-20862-3</ref>.
ప్రత్యుర్థుల నుంచి భాజపా ఒక [[నిరంకుశము|నిరంకుశ]] సంస్థగా, అకారణ విదేశీ వ్యతిరేకత గలిగిన సంస్థగా నిందించబడుతూ వుందిఉంది. అటు భాజపా మద్దతుదారులు అది జాతుల (మతాల)ఆధారంగా దేశాన్ని కోణీకరించడానికి (polarise) ఇష్టపడని ఒక కన్సర్వేటివ్, జాతీయ నిబద్ధత కలిగిన పార్టీ తప్పించి మరేమీ కాదని వాదిస్తారు. ఈ ఆరోపణల్లో చాలాభాగం భాజపాను బలహీనపరచడానికి వామపక్ష పండితులు చేసే దుష్ప్రచారమే. అంతేకాక, భాజపా హిందుత్వ వాదంలోని నిరంకుశత్వం పైన వామపక్ష పార్టీలు, క్రిస్టొఫి జాఫ్రిలాట్ వంటి పాశ్చాత్య విద్యాధికులు చేసే ఆరోపణలను "మన హిందూ జాతీయ రాజకీయ జ్ఞనానికి తీవ్ర అన్యాయం చేస్తున్న సరళీకృత ఆంతరణ (simplistic transference)"గా మునుపటి రాజకీయతత్వ ఆచార్యుడు, టైమ్స్ ఆఫ్ ఇండియా విమర్శకుడు <ref>[http://www.penguinbooksindia.com/AuthorLounge/AuthorDetail.asp?aid=3104 Profile], Jyotirmaya Sharma</ref> జ్యోతిర్మయ శర్మ విమర్శించారు<ref>[http://www.hindu.com/br/2005/09/27/stories/2005092700171600.htm Hindu Nationalist Politics],J. Sharma ''Times of India''</ref>.
భాజపా జీవితము, దాని పనితీరు 1947లో జరిగిన [[భారత విభజన]]వల్ల బలంగా ప్రభావితమైనట్టు కనిపిస్తుంది. భారతదేశంలోని చాలా మతాలకు బాధాకరమైన గతం ఈ విభజన. లక్షలాది జనం రక్షణార్థమై కొత్తగా ఏర్పడిన రెండు దేశాలకు వలసపోయారు. విభజన కాలంలో నెలకొన్న ఈ అరాచకంలో చెలరేగిన దారుణ మారణహోమంలో యాభై వేలకు పైగా హిందువులు, సిక్కులు, ముస్లిములు చంపబడ్డారు. రాత్రికి రాత్రి తమ తాతలనాటి నుంచి వస్తున్న ఇళ్ళను వదలి మారణహింస, అలజడి, అయోమయాలను ఛేదించుకుంటూ వేరే దేశంలోని తమ కొత్త ఇంటికి పయనమవాల్సి రావటం, హిందూ జాతీయవాదుల నాడుల్లో లోతుగా నాటుకుపోయింది.
[[జమ్ము కాశ్మీర్]] పైన జరుగుతున్న సరిహద్దు వివాదం, 1947-48, 1962, 1965, మరియు 1971ల యుద్ధాలు, ఇటీవల 1999 లో జరిగిన [[కార్గిల్]] యుద్ధము భాజపా యొక్క సిద్ధాంత నిర్మాణంలోని మరొక ముఖ్యమైన అంశం. [[పాకిస్తాన్]], [[ప్రజా గణతంత్ర చైనా]], మరియు ఇతరత్రా వస్తున్న ముప్పులపై భారతదేశం ఒక కన్నేసి వుండాలన్నది భాజపా మరియు దాని మద్దతుదారుల అభిమతం.
మత హింసలో పాల్గొంటుందని, మతపరంగా సున్నితమైన అంశాలను రాజకీయ లాభాలకు వినియోగించుకుంటుందని భాజపాపై తరచుగా ఆరోపణలు వస్తూ వుంటాయి. ఎక్కువగా రాజకీయంగా దెబ్బదీసే ఉద్దేశంతో చేయబడే ఈ ఆరోపణలవల్ల భాజపా పట్ల ఉండాల్సిన సదభిప్రాయాన్ని చాలా మంది భారతీయులలో, ముఖ్యంగా ముస్లిములలో చీల్చివేసింది. చాలామంది [[వామపక్ష]]విలేఖరులు, విశ్లేషకులు భాజపాను స్పష్టమైన ముస్లిం వ్యతిరేక పక్షపాతపు నిరంకుశ సంస్థగా భావిస్తారు. గతంలో ముఖ్తర్ అబ్బస్ నక్వీ, దివంగత సికందర్ బఖ్త్, డా. నజ్మా హెప్తుల్లా, [[భారత యూదు|ఇండియన్ జ్యూ]] సమాఖ్యలో ప్రముఖ సభ్యుడు జె. ఎఫ్. ఆర్. జాకోబ్ వంటి ఎందరినో భాజపా తన కీలక స్థానాల్లో నిలబెట్టిందన్న నిజానికి ఈ అభిప్రాయం అలానే వుందిఉంది.
భాజపా డిమాండ్లలో, పనులలో కొన్ని నిర్ద్వంద్వంగా వివాదాస్పదమైనవి, జాతిపరమైన ఆందోళనలను రేకెత్తించేవి ఉన్నాయి. [[అయోధ్య]]లోని [[రామజన్మభూమి]] వీటన్నిటిలోకి ముఖ్యమైనది. మధ్యయుగ కాలంలో ముస్లిం దండయాత్రల్లో అయోధ్యానగరంలోని పురాతన దేవాలయాన్ని నాశనం చేసి, ఆ స్థలంలో [[బాబ్రీ మసీదు]]ను నిర్మించారని వాదన. ఈ స్థలం [[విష్ణుమూర్తి]] అవతారాల్లో ప్రముఖమైన రామాయణ నాయకుడు [[శ్రీరామ చంద్రమూర్తి]] జన్మస్థలంగా భావిస్తున్నందున ఆ హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు 1970లో వ[[విశ్వహిందూ పరిషత్]] ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. రెండు దశాబ్దాలపాటు ఈ నిరసనలు శాంతియుతంగా జరిగాయి. కాని 1980ల చివరలో, అదివరకు ఎన్నడూలేనంతగా ఈ సమస్య వివాదాస్పదమయ్యింది. నేరుగా మసీదుని పడగొట్టాలని వి హెచ్ పి డిమాండ్ చేయటం మొదలుపెట్టగా, భాజపా దాన్ని తన సొంత సమస్యగా అక్కున చేర్చుకుంది.
భాజపా కోర్కెలలో రామాలయం ప్రముఖతను సంతరించుకున్నాక, దాని కార్యకర్తలు పోరాట శ్రేణులలో చేరటం, అయోధ్యలో పెద్ద ర్యాలీలు నిర్వహించడం జరిగాయి. భారతదేశంలోని అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో 1991 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భాజపా గెలుపొంది, జాతీయస్థాయిలో ప్రాముఖ్యతను సంతరించుకోడానికీ ఈ భావశక్తి ఎంతగానో తోడ్పడింది. ఆయితే [[డిసెంబరు 6, 1992]]లో ఒక ప్రదర్శనకారుల గుంపు మసీదుపైకి దూసుకువచ్చి, చేతికొడవళ్ళు, పారలతో దాన్ని దెబ్బతీయడం వల్ల ఈ భావజాల దుర్వినియోగం (ఎమోషనల్ మ్యానిప్యులేషన్) హింసాత్మకంగా పరిణమించింది. తత్ఫలితంగా దేశవ్యాప్తంగా చెలరేగిన ఆగ్రహం, మారణహోమం, దోపిడీలు, దహనాల్లో వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. ఈ మతఘర్షణల తర్వాత భారత లౌకికవాదమనే తీవెకు ముప్పువాటిల్లినట్లు చాలా వర్గాలు భావించాయి. వి హెచ్ పి నిషేధించబడగా, అద్వానీ, ఇతర నాయకులు అరెస్ట్ కాబడ్డారు. విధ్వంసానికి సంబంధించి సి. బి. ఐలో దాఖలైన ఛార్జి షీటులో ఉన్న ఇద్దరు భాజపా నాయకులు- అద్వానీ, [[మురలీ మనోహర్ జోషి]]. ఈ అరెస్టులు జరిగినప్పటికీ, భాజపా రాజకీయ పలుకుబడి శరవేగంతో పెరుగుతునే వచ్చింది.
పంక్తి 356:
 
=== బీహార్ ===
[[బీహార్]]‌లో భాజపా పార్టీ [[జనతాదళ్ (యునైటెడ్)]]‌తో పొత్తు పెట్టుకుని వుందిఉంది. పార్టీకి అగ్రవర్ణ హిందువుల్లో మంచి బలం వుండగా, జెడి (యు)తో పొత్తు ద్వారా పెద్ద వోట్ బేస్‌ను సంపాదించుకోగలిగింది. సామాజిక పోరాటాలు ఎక్కువగా వున్న బీహార్ పల్లె ప్రాంతాల్లో, భాజపా నేతలకు తరచుగా అక్కడి భూస్వాములతో సంబంధాలు వుంటాయి. 2005 నవంబరులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను పదవి నుంచి తప్పించి, కాంగ్రెస్‌ను పడగొట్టి, బిజెపి-జెడి (యు) కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ 2006, సెప్టెంబరు 14న జార్ఖండ్లో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు అర్జున్ ముండా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో, ఆ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది.
 
=== కర్ణాటక ===
"https://te.wikipedia.org/wiki/భారతీయ_జనతా_పార్టీ" నుండి వెలికితీశారు