ఉరుము నృత్యము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఉరుము వాద్య నిర్మాణం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గరిష్ట → గరిష్ఠ, శుద్ది → శుద్ధ using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[అనంతపురం]] జిల్లా జానపద కళారూపం - '''ఉరుము నృత్యం'''. చితికి జీర్ణమైపోయిన అనేక [[జానపద కళారూపాలు]] ఈనాడు మనకు కనబడకుండా కనుమరుగై పోయాయి. అలా కనుమరుగైన కళారూపాలలో ఉరుముల [[నాట్యము|నృత్యం]] ముఖ్యమైనది. తలకు అందంగా రుమాళ్ళు చుట్టుకుని మెడలో కాసుల దండలు ధరించి ఎఱ్ఱని, పచ్చనివీ శాలువలు కప్పుకుని, నిలువు అంగీలు ధరించి, పల్ల వేరు చెట్టు కర్రతో తయారు చేసిన ఉరుములకు చర్మపు మూతలు మూసి, కదర పుల్లలతో వాయించు కుంటూ దేవాలయ ప్రాంగణాల్లో, ఉరుముల నృత్యం చేస్తూ వుంటారు. ఉరుము అనే పేరును బట్టి వాయిద్య [[ధ్వని]] ఉరుమును[[ఉరుము]]<nowiki/>ను పోలి వుండ వచ్చును. అందు వల్ల వాటికి ఉరుములు అనే నామకరణం చేసి వుండవచ్చు.
==ఉరుము నృత్యం==
[[అనంతపురం జిల్లా]]కే ప్రత్యేకమైన జానపద కళారూపం [[ఉరుము నృత్యం]]. అనంతపురం జిల్లాలో దాదాపుగా రెండు వందల కుటుంబాలు ఈ వృత్తితో జీవనం సాగిస్తున్నారు. బృంద నృత్యానికి చెందిన ఈ కళారూపం కులపరమైనది కూడా. [[మాల]] తెగకు చెందిన వారి జీవన వృత్తి ఉరుము నృత్యం. జానపద కళారూపాలలో చాలా కళలు దైవారాధనలో భాగంగా వృత్తివిద్యలయ్యాయి. ఉరుము నృత్యం కూడా దైవారాధనలో వృత్తి విద్యగా మారిందే. మాల తెగలో ఉరుము వాయించే వీళ్ళను ఉరుములోళ్ళు అంటారు. ఉరుములోళ్ళు చెన్నకేశవుని వారసులమని మాచెర్ల గోత్రీకులమని చెప్పుకుంటారు.
పంక్తి 11:
ఉరుముల వారిని అక్కమ్మ దేవతల ప్రతిరూపంగా భావిస్తారు. దైవ సమానంగా భావించి ఆ దేవతలను పూజించే సమయంలో వారి కాళ్ళు కడిగి పాదాభివందనం చేస్తారు. నిండు కుండలోని అన్నం ఇంటి ముందుకొచ్చిన ఉరుములోల్లకు భోజనం పెడ్తారు. ఉరుములోల్లు బీజాక్షరాలతో వారిని దీవించడం కనిపిస్తుంది. ఈ బీజాక్షరాల వాక్కులు మూడు. 1. [[అమృత వాక్కు]] 2. [[విషవాక్కు]] 3. [[వేదవాక్కు]].
==రాయల కాలంలో==
[[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్య]] కాలంలో వీరికి మాన్యాలు ఇచ్చినా కాలక్రమేణా అంతరించి పోయి, ప్రస్తుతం కుల వృత్తిని నమ్ముకుంటూ పొట్ట గడవని స్థితిలో డెబ్బై కుటుంబాల దాకా ఉరుములవారు [[అనంతపురం]] జిల్లాలో ఉన్నారు. వీరిని [[ఉరుములోళ్ళు]] అని కూడా పిలుస్తారు. వీరు [[మాల]] తెగలో ఎక్కువగా ఉన్నారు. [[ఉరుము]] అనబడే చర్మ వాయిద్యం ప్రాచీనమైంది. ఆదిమ జాతుల [[నర్తనము|నర్తన]] రూపంలో వలయాకార విన్యాసాలు చేస్తూ ఉరుములతో భయంకర మైన శబ్దాలు సృష్టిస్తూ, వీరు చేసే నాట్య అతి గంభీరంగా వుంటుంది.ఉరుముల వాయిద్యం ఒకే సారి ఏక ధాటిగా వాయిస్తే కారు మొయిళ్ళు ఉరుములతో పయనిస్తున్నట్లు భ్రమ వ్వక్త మౌతుంది. అందుకే ఆ వాయిద్యానికి ఉరుము అని పేరు పెట్టారేమో ననిపిస్తుంది. ఒక చేత అరీరణం యొక్క చర్మాన్ని ప్రేము పుల్లలతో రాస్తూ ఈ శబ్దాలు సృష్టిస్తారు. మరో చేతితో పుల్లతో లయ విన్యాసాలు తాళ యుక్తంగా సాగుతాయి. వీరి ఆరాధ్య దైవం శ్రీశైల మల్లన్న. ఆయన మహాత్య్వ గాథలు ఉరుముపై దరువులు వేస్తూ గాన చేస్తారు. చరణానికి చరణానికీ మధ్య ముక్తాయింపుల్తో గంభీరమైన శబ్దాలు సృష్టించి వలయాకార విన్యాసాలు చేస్తారు:
 
==ఉరుము వాద్య నిర్మాణం==
పంక్తి 46:
</poem>
 
పాట అవగానే కుంచెలు పట్టుకున్న వారంతా వూగటం ఒక్కొక్క అడుగు వెనక్కి, ముందుకు వేయటం చేస్తుండగా చుట్టూ చేరిన జనం [[బండారు]] కుంకాన్ని చల్లుతారు. పూనకంలో వున్న వారు వాయిద్యానికి తగినట్లు అడుగులు వేస్తారు. అలా అడుగులు వేసి వేసి అలసి పోయిన వారి నోటిలో ఒక నిమ్మ పండు నోట్లో పెడతారు. కుంచెలు పట్టుకున్న వారి మీద బండారు కుంకాన్ని చల్లుతారు. గుడ్డలన్నీ రక్తసిక్తమై, వారంతా యుద్ధవీరుల్లాగా కనిపిస్తారు. ఈ భంగిమల్లో నొక్కి అద్భుతంగా రౌద్రంగా అనిపిస్తాయి. కంటి గృడ్లను పెద్దవి చేస్తూ, భ్రమ అభినయిస్తారు. ఉరుములోళ్ళు గాట్టిగా, ఏయ్, జోహో ఓహో అంటూ లయాత్మకంగా అరుస్తారు. అదొక వీర నృత్యమనీ ఆ నృత్యానికీ, పేరణికీ చాల పోలికలున్నాయనీ [[డా: చిగిచర్ల కృష్ణారెడ్డి]] గారు వారి [[జానపద నృత్యం|జానపద నృత్య]] కళలో ఉదహరించారు.
 
ఇలా వారు గంగ కథను ఎక్కువ చెపుతారు:
"https://te.wikipedia.org/wiki/ఉరుము_నృత్యము" నుండి వెలికితీశారు