సంస్కృతం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం, దేశమునకు → దేశానికి (4) using AWB
పంక్తి 75:
నైతికముగాను, ధార్మికముగాను సంస్కృతము మానవులకు గల్గింపగల యభ్యున్నతి నిరుపమానమైనది. ప్రపంచములో నెక్కడెక్కడ సంస్కృతము ప్రాకినదో, అక్కడక్కడ మానవహృదయమునకు మృదుత్వమేర్పడినదని రవీంద్రనాధటాగోరువంటి విశ్వమానవ సమదృష్టిగల విశ్వకవికూడ నుడివియుండుట గమనింపదగిన విషయము. భారతదేశములో ఫిన్లెండు రాజదూతగానుండిన హ్యూగోవల్వనే చెప్పిన యీ క్రిందిమాటలు సంస్కృతముయొక్క యీప్రభావమును ఘంటాపథముగ చాటుచున్నవి. “సంస్కృతభాషా నిబద్ధములైన భారతీయభావములు యూరపు హృదయమునకు మృదుత్వము నొసగినవి. అచట నాగరికతను నెలకొల్పినవి. ప్రత్యక్షముగా సంస్కృతభాషాద్వారముననే కాక భాషాంతరీకరణముల ద్వారమునకూడ నీపనిజరిగినది. తరువాత కొన్ని శతాబ్దములపాటు సంస్కృతము యూరపియనులకు అందలేదు.” (11-2-53 తేదీని [[కాశీ]]లో ప్రభుత్వ సంస్కృత కళాశాలా స్నాతక సభోపన్యాసము).
 
ఇటీవల యూరపియనులు వాణిజ్యాదులకొరకు భారతదేశమునకుభారతదేశానికి వచ్చుటయు, సంస్కృతమును నేర్చుకొనుటయు, సంస్కృతసాహిత్యగ్రంథములనేకాక శాస్త్రములనుకూడ తమతమ భాషలలోనికి పరివర్తింపచేసికొనుటయు సంభవించెను. 18 వ శతాబ్దిలో ప్రారంభమైన యీ సంస్కృత సంస్కృతి ప్రసారము పాశ్చాత్యభాషలపైననూ, విజ్ఞానముపైనను అపారప్రభావమును చూపెను. సంస్కృతభాషను నేర్వనివారిపైకూడ ఈ ప్రభావము పడెను. కాంట్, స్పైనోజా మున్నగు దేవాంతులపైనను, ఎమర్ సన్, ఎడ్విన్ ఆర్నాల్డ్, సోమర్ సటే మాగమ్ మొదలైన రచయితలపైనను ఈ ప్రభావము ప్రస్ఫుటముగా గోచరించును. ఐరోపాలో 15 వ శతాబ్దిలో జరిగిన రినైజాన్స్ అని చెప్పబడు విజ్ఞానపునర్విజృంభణమునకు తరువాత జరిగిన వైజ్ఞానిక సంచలనములన్నిటిలోను గొప్పది సంస్కృత సంపర్కమువలన జరిగిన వైజ్ఞానికసంచలనమే యని ఎ. ఎ. మాక్డోనెల్ తన Sanskrit Literature అను గ్రంథములో వ్రాసియున్నాడు. (1 వ పుట)
 
సంస్కృతభాషను నేర్చి, భారతీయుల జీవితపద్ధతులను చూచిన పాశ్చాత్యపండితు లెల్లరు సంస్కృత భాషానిబద్ధసంస్కృతికిని, భారతీయుల జీవితమునకును గల సన్నిహిత సంబంధమును, సమన్వయమును చూచి యాశ్చర్యపడిరి. భారతీయజీవితము నర్ధముచేసికొనుటకు సంస్కృతభాషా వాఙ్మయపరిచయము అవసరమని గుర్తించిరి. కావుననే బ్రిటిష్ ప్రభుత్వకాలములో ఈ దేశమునకుదేశానికి పరిపాలకులుగా రాదలచిన ఐ. సి. యస్. పరీక్షాభ్యర్ధులకు మాక్సుముల్లరు రచించిన India; What can it teach us? అను గ్రంథము పఠనీయముగానుండెను.
 
పైన పేర్కొనబడిన ఫిన్లెండ్ రాయబారి తన ప్రభుత్వము తన్ను భారతదేశమునకుభారతదేశానికి రాజదూతగా పంపిన కారణమును కాశీ విశ్వసంస్కృత పరిషదధివేశములో నిట్లు వివరించెను. 'మా దేశపు ప్రభుత్వము సంస్కృతభాషను నేర్చినవాని నెవనినయినను భారతదేశమునకుభారతదేశానికి దూతగా పంపిన బాగుండునని తలంచుచుండెను. నేను 35 సంవత్సరముల క్రిందట, మా దేశములో విశ్వవిద్యాలయములో సంస్కృతము నభ్యసించితిని. కావున ఈ ఉద్యోగమునకు నేను ఎంచుకొనబడుట సంభవించెను'. భారతదేశముతో సంబంధము పెట్టుకొనదలచిన పాశ్చాత్యులకే సంస్కృతభాషాజ్ఞానమంత ముఖ్యముగా భావింపబడుచుండగా, స్వయముగా భారతీయులకా భాష యెంతముఖ్యమో, అది యెంతగా ప్రాణసమానమైనదో వేరుగ చెప్పనక్కరలేదు.
 
ఆసేతు హిమాచలము గల ప్రజలు ఏకజాతిగ నిబద్ధమగుటలో విశేషముగ తోడ్పడినది సంస్కృతభాష. రాజకీయ శాస్త్రములో జాతీయతకు (Nationhood) కావలసినవిగ చెప్పబడిన యంశములలో భాషైక్యమొకటి. ప్రాచీనభరతఖండములో ప్రాంతీయభాషలుండినను వివిధప్రాంతముల నడుమ సామాన్యభాషగా నుండినది సంస్కృతమే. పండితులలో సంస్కృతము సామాన్య భాషగా వాడబడుట నేటికిని గలదు. స్వచ్ఛ సంస్కృతము రాని భిన్నప్రాంతముల వారు సమావేశమైనప్పుడుకూడ వారు పరస్పరము అవగాహనము చేసికొనవలయునన్నచో వారివారి భాషలలో సామాన్యముగనుండు సంస్కృత పదజాలమే సహాయము చేయును. ఒక యాంధ్రుడును [[బీహారు]] ప్రాంతవాసియు నొకచోట కలిసినప్పుడు [[ఆంధ్రుడు]] బీహారీని "మీ నివాస మెక్కడ?” అని తెలుగులో అడిగినను అతని కర్థమగును. నివాస శబ్దము రెండు భాషలలోను సమానమే. '[[భోజనము]]', 'శ్రమ', '[[దానము]]' మున్నగు సామాన్యముగా వాడబడు పదములు రెండు భాషలలోను ఉండును. కావున భాషా భేదమున్నను, భారతీయు లెల్లరు సంస్కృతపద సూత్రబద్ధులై భాషైక్యముగూడ పొందియున్నారు.
పంక్తి 143:
 
== చరిత్ర ==
సంస్కృతము ఆర్యుల అధికారిక భాష. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల్లో మెపోపటేమియా, పర్షియా దేశాలనుండి వచ్చిన ఆర్యులు ఉత్తర భారత దేశంలోభారతదేశంలో స్థిరపడిన తర్వాత చతుర్వేదాలు వ్రాసుకొన్నారని చరిత్రకారుల భావన.
 
== సాహిత్యం ==
"https://te.wikipedia.org/wiki/సంస్కృతం" నుండి వెలికితీశారు