కోలాటం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో , శిధిలా → శిథిలా, జాన పద → జానపద using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:DSCN0111.JPG|thumb|300px|కోలాటం ఆడుతున్న పిల్లలు.]]
ఆంధ్ర ప్రజాజీవితంలో అన్ని జానపద కళా రూపాలతో పాటు ఈ '''కోలాట నృత్యం''' కూడా [[తెలుగు]] జానపదుల జీవితాలతొ పెన వేసుకుకు పోయింది. పెద్దల్నీ, పిల్లల్నీ అందర్నీ అలరించిన కళారూపం కోలాటం.కోలాట నృత్యాలు ప్రతి పల్లెలోనూ విరామ సమయాల్లో రాత్రి పూట పొద్దు పోయే వరకూ చేస్తూ వుంటారు. భక్తి భావంతో దేవుని స్తంభాన్ని పట్టుకుని ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి ముందూ కోలాటాన్ని ప్రదర్శిస్తారు. ఈ కోలాట నృత్యాలను పెద్ద పెద్ద తిరుణాళ్ళ సమయంలోనూ, దేవుళ్ళ ఉత్సవాలలోనూ బహిరంగంగా వీధుల్లోనూ ప్రదర్శిస్తారు.
==కోలాటం==
'''కోలాటం''' ఒక రకమైన సాంప్రదాయక సామూహిక [[ఆట]]. కోల మరియు ఆట అనే రెండు పదాల కలయిక వల్ల కోలాటం ఏర్పడింది. కోల అంటే కర్రపుల్ల అని అర్ధమనీ, ఆట అంటే క్రీడ, నాట్యం అనే అర్ధాలుండడంతో కోలాటం అంటే కర్రతో ఆడే ఆట అనే అర్ధంగా భావించవచ్చు. ఇందులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రెండు చేతులతోను కర్రముక్కలు పట్టుకొని పదం పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయానుగుణంగా అడుగులు వేస్తూ ఒకరి చేతికర్ర ముక్కలను వేరొకరి చేతికర్ర ముక్కలకు తగిలిస్తూ ఆడతారు. సాధారణంగా వీటిని తిరుణాళ్ళ సమయంలోనూ, ఉత్సవాలలోనూ పిల్లలు, పెద్దలు మరియు స్త్రీలు ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు.[[విజయనగర సామ్రాజ్యం]] కాలంలో ఈ ప్రదర్శనలు ప్రసిద్ధంగా జరిగినట్లు [[అబ్దుల్ రజాక్]] అనే చరిత్రకారుడు వర్ణించాడు. విజయనగర శిథిలాలపై కోలాటం ఆడుతున్న నర్తకీమణుల శిల్పాలను నేటికీ మనం చూడవచ్చు. గ్రామదేవతలైన [[ఊరడమ్మ]], [[గడి మైశమ్మ]], [[గంగాదేవి]], [[కట్టమైసమ్మ]], [[పోతలింగమ్మ]], [[పోలేరమ్మ]] [[దనుకొండ గంగమ్మ]], మొదలగు గ్రామ [[దేవతలు|దేవతల]] [[జాతర]] సందర్భంగా కోలాటం ఆడుతారు.
==కోలాట ప్రస్తావన:==
[[పాల్కురికి సోమనాథుడు]], [[పండితారాధ్య చరిత్ర]]లో అనేక జానపద కళా రూపాలను వర్ణిస్తూ కోలాటాన్ని కోలాట గొడియ అని వర్ణించాడు. ఇతర నృత్య విశేషాలను వర్ణించినంతగా కోలాట గొడియ గురించి అంతగా వివరించ నందు వల్ల సోమనాథుని కోలానికి కోలాటం అంతగా అభివృద్ధి పొందలేదని వూహించ వచ్చు.కాని విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ కోలాటాలు ప్రసిద్ధంగ ప్రదర్శించి నట్లు విదేశీ యాత్రికుడైన అబ్దుల్ రజాక్ వర్ణించిన విషయం తెలిసిందే. ఈ నాటికీ విజయనగర శిథిల శిల్పాల గోడల మీదా, శ్రీ శైలం దేవాలయ ప్రాకారపు గోడలపైనా కోలాటం వేసే నర్తకీ మణులు కోలాటపు [[శిల్పాలు]] చిత్రించ బడి ఉన్నాయి.
==కోలాట నిర్వచనం==
కోలాట అనే శబ్దం కోల+ ఆట అనే రెండు దేశ్యాలయిన విశేషాల శబ్దాల కలయిక వల్ల ఏర్పడిందని, కోల అంటే కర్ర పుల్ల అని అర్థమనీ, కట్టియ, పుడక, కట్టె అనేవి పర్యాప పదాలనీ, ఆట శబ్దానికి [[తాండవము|తాండవం]], నటనం, [[నాట్యము|నృత్యం]], [[నాట్యము|నాట్యం]], లాస్యం, నర్థనం, [[నాట్యము|నృత్యం]], క్రీడ విహారం అనేవి పర్యాప పదాలనీ. కోలాటం అంటే పుల్లలతో నటనం, లేక నర్థనం, లేక తాండవం అని చెప్ప వచ్చుననీ, అంటే రెండు చేతులతోనూ కర్ర ముక్కలు పట్టుకొని పదాలు పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయాను గుణంగా అడుగులు వేస్తూ ఒకరి చేతి కర్ర ముక్కను వేరొకరి చేతి కర్ర ముక్కలతో తాకించే ఒక ఆటనీ డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు వారి జానపద విజ్ఞాన గ్రంథం 76 వ పేజీలో వివరించారు. డా:వేంకటేశ్వర్లు గారు కోలాట ప్రక్రియను చక్కగా పరిశోధించిన వారు. వారి అభిప్రాయలనే ఇక్కడ పుదహరిస్తున్నాను. వారి కృషికి నా ధన్యవాదాలు.
==రూపాంతరాలూ - పర్యాయ పదాలూ:ఉద్ది==
ఉద్ది అంటే జత. సమానులుగా వుండే సముదాయం, జట్టు, సాంగత్యం, చెలిమి అనే అర్థాలు, జత, జంట అనేవి రూపాతరాలు............. ఎదిరి పోటీ వాటు, సమానము, సాటి.... అనే అర్థాలున్నాయి. అంటే ఇద్దరు ఆటగాళ్ళను కలిపి ఉద్ది అంటారు. కోలాటంలో ఇలాంటి కొన్ని వుద్దులుంటాయి. ఉద్దిలోని వారిని ఉద్దికాడు అని అంటారు. ఏకవచనంలో ఉద్దివాడు, ఉద్దికాడు అంటారు. అంటే జతకాడు; చెలికాడు, మిత్రుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఉద్ది కాళ్ళందరి పైన వుండే వాణ్ణి పెన్నుద్ది లేక జట్టు నాయకుడు అంటారు. కానీ కోలాటంలో జట్టు అంతకీ ఒక పెన్నుద్ది వుంటాడు. అందుకే అతనిని జట్టు నాయకుడూ అంటారు. జట్టు నాయకుని ఆజ్ఞమేరకు కోలాటంలో ఈ ఉద్దీలు ఏర్పడటం., విడిపోవటం జరుగుతుంది. ఉద్దీలుగా ఏర్పడిన తరువాతనే ఆటలో కర్రలు కలపటం మొదలు పెడతారు.
==కోపులు==
[[కోపు]] అంటే నాట్యం, నాటకం, [[తీర్పు]], నాట్యగతి విభేదం, ఆట, నాట్య గతి విశేషం అనే అర్థాలున్నాయి. కోలాటంలో అనేక మైన గతి భేదాలనే కోపులంటారు. ఈ కోపులకు పాటలోని మొదటి చరణాన్ని బట్టీ, గతికి తగ్గ భావంతోనూ, పురాణ పురుషులైన కృష్ణ, రామ మొదలైనవారి పేర్లతో పేర్లు పెడతారు. ప్రాంతాలను బట్టి కోపుల పేర్లూ మారుతూ వుంటాయి. పలనాటి సీమలో ప్రార్థ కోపు.... [[ఉద్ది తిరుగుడు కోపు]].... వరగత్తెర కోపు..... [[కృష్ణ కోపు]], చెలియ కోపు, [[కంస కోపు]], [[జడకోపు]], [[భారత కోపు]], భామ కోపు, లాలి కోపు, [[లంకె కోపు]], కలువరాయ కోపు మొదలైనవి ఉన్నాయి. కోలాటంలో పాటనూ, [[పాట]] తోపాటు ఆటను మొదలు పెట్టటం [[ఎత్తుగడ]] అంటారు. అందరూ వలయంగా ఏర్పడి దేవతలకూ, దేవుళ్ళకూ, రాజకీయ నాయకులకూ జై కొట్టి, వారి వారి కిష్టమైన ప్రార్థనలు చేసి...... ఇట తయ్యకు తాధిమిత, అనడంతో ఆట ప్రారంభమౌతుంది. ఎత్తుగడ నుంచి పాట ఆట వేగాన్ని పుంజు కుంటుంది.
 
==ఉసెత్తుకోవడం==
"https://te.wikipedia.org/wiki/కోలాటం" నుండి వెలికితీశారు