గొరవయ్యలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా , నేపద్య → నేపథ్య (2), సంభందిం → సంబంధిం (2), సంధ using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
;'''గొరవయ్యలు''' [[కర్నూలు]] జిల్లాలో "గొరవయ్యల నృత్యం" అనే శైవభక్తి ప్రధానమైన జానపద కళా విన్యాసాన్ని ప్రదర్శించే కళాకారులు.
 
; వీరి వేషధారణ : నల్లని [[కంబలి]]కంబళి ధరించి, నెత్తిన ఎలుగుబంటితో[[ఎలుగుబంటి]]<nowiki/>తో చర్మంతో చేసిన పెద్ద టోపీ లేదా ఎలుగుబంటి తలలాగా తయారుచేసిన టోపీ (ఈ రోజుల్లో క్రీడా 'మస్కట్' లాగా) ధరించి, చేతిలో [[డమరుకం]] లేదా [[పిల్లనగ్రోవి]] వాయించుకుంటూ (ప్రజలకు ఆకర్షించడానికి) వీధులగుండా పోయేవారు. <!-- నా చిన్నప్పుడు [[ఉరవకొండ]]లో --> వీధుల్లో నల్ల కంబలి ధరించి, నెత్తిన ఎలుగుబంటి చర్మంతో చేసిన పెద్ద టోపీతో డమరుకం, పిల్లనగ్రోవి వాయిస్తు నృత్యంచేసే వారిని చూసి పిల్లలు జడుసుకోవడం కూడా జరిగేది.<!-- రోజులు ఉన్నాయి. --> చిన్న పిల్లలంతా వారి వెంటపడి కేరింతలు కొట్టి వాళ్ళు భయపెడితే జడుసుకుని పరుగెత్తుకెళ్ళేవారు. అప్పట్లో ఇదో తమాషా ఆట. కానీ ఇదొక పరిశోధనాంశం అన్న విషయం చాలా మందికి తెలియదు.
నేడు అనేక దేశాలలో జంతురూపాలను అలంకరించుకుని ప్రజాకర్షణ చేయడం సర్వసాధారణం.
 
జానపద కళారూపాల్లో సామూహిక నృత్యాల్లో మతపరమైన, కులపరమైన కళారూపం గొరవయ్యల నృత్యం. [[రాయలసీమ]] ప్రాంతంలో [[కర్నూలు]] జిల్లాకే ప్రత్యేకమైనది ఈ కళారూపం. కర్నులూ[[కర్నూలు జిల్లాలోజిల్లా]]<nowiki/>లో [[శ్రీశైలం]] ప్రస్సిద్ది చెందిన శైవ క్షేత్రం. ఇక్కడ వెలసిన మల్లికార్జునుడు శైవులకు ఆరాధ్య దైవం. గొరవయ్యల నృత్యం శైవ మత నేపథ్యంలోనుంచి వెలుగు చూసిందే.
 
=="గొరవయ్య" పదం==
పంక్తి 15:
 
==గొరవయ్య దీక్ష==
కురుబ కులంలోని పెద్దకుమారుడో చిన్న కుమారుడో గొరవయ్య కావాలని ముందే అనుకున్నారు. గొరవయ్యను చేయడానికి గురువు లేదా గణాచారి అవసరం. ఈ గురువులు కర్నూలు జిల్లా ఆలూరు మండలం గట్టుమల్లయ్య కొండలో ఉన్నారు. గొరవయ్యగా మారాల్సిన పిల్లవాన్ని గట్టు మల్లయ్య కొండలోని మల్లేసుని గుడి దగ్గరకు తీసుకుని వెళతారు. కోనేటిలో స్నానం చేయించి కంబళి పరచి కూర్చో పెడతారు. పిల్లవాని మేనమాతో ప్రమాణం చేయిస్తారు. గురువు గవ్వలతో కట్టిన దండను ముద్రాదానం చేస్తాడు. ముద్రా దానాన్ని పిల్లవాని మెడలో కడ్తారు. శివుని[[శివుడు|శివు]]<nowiki/>ని మంత్రాలను దీక్ష తీసుకున్న వారి చెవిలో బండారుతో భుజాలమీద ముద్రలు వేయడాన్ని ముద్రా దానం అంటారు. తరువాత ఉన్ని దుస్తులు, [[డమరుకం]], [[బండారు]] సంచి, [[గంట]] ఇస్తారు. దీనిని గొరవ దీక్ష అంటారు. ప్రస్తుతం గొరవ దీక్ష ఇచ్చిన గణాచారికి 200 నుండి 300 రూపాయల దాకా రుసుం ఇస్తున్నారు. దీక్షను ఇచ్చే గురువును [[గణాచారి]] లేదా మద్దెల గొరవయ్య అని అంటారు. ఈ మద్దెల గొరవయ్య లేదా గణాచారి గొరవ మఠాధిపతి వద్ద శిక్షణ పొందుతాడు.
 
''మన కులవృత్తికి ద్రోహం చేయకూడదు. ఇతరులను మోసం చెయ్యొద్దు. అబద్ధం చెప్పొద్దు-'' అని పిల్ల వానితో ప్రమాణం చేయిస్తారు. ఈ దీక్షను పిల్లవానికి 16 సంవత్సరాలలోపు మాత్రమే ఇప్పిస్తారు. గొరవయ్యలను మైలర దేవుని అంశగా చూస్తారు. గొరవ దీక్షను తీసుకున్న వారు మాత్రమే బండారు ఇవ్వడానికి అర్హులు. బండారు అంటే పసుపురంగు పొడి.ఆడ వాళ్ళలో మొక్కుబడి ఉన్నావారు శివ దీక్షను[[దీక్ష]]<nowiki/>ను తీసుకుంటారు. వీరు మైలారదేవుని భార్య మాళవికి ప్రతిరూపాలు. వీరు కన్యలుగానే ఉండి శివ సేవకు అంకితమవుతారు. గొరవ దీక్షను తీసుకున్న వాడు కోటీశ్వరుడు అయినా [[సంక్రాంతి]] పండుగనాడు మాత్రం గొరవయ్యలాగా వేషం వేసుకుని ఐదు ఊర్లు అడుక్కోవడం వీరి ఆచారం.
 
==వేషధారణ==
ఇంతకు ముందే చెప్పినట్లు మైలారదేవుడు రాక్షసులను చంపడానికి వేసుకున్న వేషం గొరవల్లు వేసుకుంటారు. కంబళితో చేసిన పెద్ద అంగరఖా- ఇది మెడనుండి పాదాలదాకా ఉంటుంది. నడుముకు పట్టీ, ఎలుగుమంటి చర్మంతో చేసిన ఎత్తైన టోపీ, మెడలో కంటె, గవ్వల దండ, కుడి చేతిలో డమరుకం, ఎడంచేతిలో గంట ( ఆధునిక కాలంలో ఈ గంటకు బదులుగా పిల్లంగ్రోవి వాడుతున్నారు), నడుముకు [[జింక]] చర్మంతో చేసిన బండారు తిత్తి ( సంచి). ఈ వేషంతో వీరు వీధులలో తిరుగుతూ ఇల్లిల్లు తిరిగి అడుక్కుంటారు. ఈ సందర్భంలో పాడే పాటలు:
<poem>
శివా మల్లేశ్వరా బండారుదయ్యా
పంక్తి 29:
</poem>
==ఒగ్గు సేవ==
ఒగ్గు సేవ అంటే దొన్నెలలోని పాలను కుక్కలలాగా అరుచుకుంటు కొట్టుకుంటూ నాలుకలతో తాగడం. గొరవయ్య దీక్షను తీసుకున్న వారు శివరాత్రి రోజున లేదా మైలార, మాళవికల కళ్యాణం రోజున ఈ ఒగ్గు సేవ చేస్తారు. ఒగ్గుసేవకు ముందు [[సర్పిణి పందెం]] ఉంటుంది. అంటే గొలుసు తెంచడం, భక్తులు తెచ్చిన పాలు, పెరుగు, పండ్లు దొణెలలో పోసి ఈ గిన్నెలను ఒక వలయాకారంగా ఉంచుతారు. లేదా వరుసగా ఎడమెడమగా వరుసగా ఉంచుతారు. ఈ దోనెల చుట్టూ [[డమరుకం]] వాయిస్తూ తిరుగుతూ గంట కొడుతూ కుక్కలవలె వొంగి అరుస్తూ, మెడలపై కరచుకుంటారు. ఈ దృశ్యం పిల్లలకే కాదు పెద్దలకు కూడా భయం కలిగిస్తుంది. ఒగ్గు సేవ తరువాత దోనెలలో మిగిలిన పాలు, పెరుగు, పండ్లు శివ ప్రసాదంగా భావించి భక్తులు సేవిస్తారు. పురాణ కథలోని ఆరు కుక్కలకు ప్రతీకగా ఒకప్పుడు ఆరుమంది పాల్గోనేవారు. కానీ ఇప్పుడు ఒగ్గు సేవలో పల్గొనే గొరవయ్యలకు సంఖ్యానియమం లేదు. [[ఒగ్గు కథ|ఒగ్గు]] సేవ చేస్తున్నప్పుడు కుక్కలవలె అరవడంచేత వీరిని మైలారం కుక్కలు అని కూడా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు. కడప జిల్లాలోని గ్రామాల్లో ఇప్పటికీ వీరిని ఒగ్గులప్పలు, మైలారం కుక్కలు అనే పేర్లతోనే పిలుస్తున్నారు. దసరా పండుగ రోజు గట్టు మల్లయ్య కొండలో వివిధ పద్ధతులతో పాడుతూ నాట్యం చేస్తారు. వారి [[శరీరం]] నుండి రక్తాన్ని తీసి ధార పోసి దేవునికి [[నైవేద్యం]] చేస్తారు. వీరి నాట్య పద్ధతి కూడా విచిత్రంగా ఉంటుంది.
 
==నృత్య కళ==
గొరవయ్యలు నృత్యం చేస్తున్నప్పుడు పాటలు పాడరు. పాట పాడే సమయంలో డమరుకాన్ని ఒక పక్క మాత్రమే నాలుగు వేళ్ళతో వాయిస్తారు. డమరుకంతో పాటు [[పిల్లనగ్రోవి]]ని లయాత్మకంగా వాయిస్తారు. డమరుకం నుండి పుట్టే ధ్వనులు ''డడ ముడ్డ డడ్ యిరడ డడబుడ్డ బుడబుడ్డ బుడ్'' అని ఉంటాయి. వీరిని చూస్తే పిల్లలకు భయం. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పిల్లలను భయపెట్టడానికి గొరవయ్యలకు పట్టిస్తానని చెప్పడం జరుగుతుంది. నృత్యంలో సరిసంఖ్యలో పల్గొంటారు. ఇల్లిల్లూ తిరిగే సమయంలో మాత్రం ఒక్కరే నృత్యం చేస్తారు. డమరుకం, పిల్లన గ్రోవి వాయిస్తూ గుండ్రంగా తిరుగుతూ, ఒక్కొక్క కాలితో నేలపై కొట్టడం, తల తిప్పడం, పిల్లల్ని భయపెట్టడానికి ఉన్నట్టుండి డమరుక శబ్ధాన్ని ''బుడ బుడ్ బుడబుడ్ బుడడ్'' అని వినిపించడం నడుమును వయ్యారంగా ఆడించడం వీరి నృత్యంలోని ప్రత్యేకతలు.
 
సామూహికంగా నృత్యం చేస్తున్నప్పుడు సరిసంఖ్యలో వరుసలుగా నిలబడి ఒకసారి డమరుకాన్ని వాయించి గుండ్రంగా తిరుగుతూ తిరిగి వరుసలో నిలబడతారు. వరుసలోని ఎదురుబదురుగా పోటీగా అడుగులు వేస్తూ కూర్చొని లేవడం, కూర్చొని తిరగడం ఒక వరుసలోని వారు మరో వరుస లోనికి మారడం చేస్తారు. ఇదంతా [[డమరుకం]], [[పిల్లంగ్రోవి]] వాయిస్తూనే చెస్తుంటారు. తరువాత [[పాటలు]] పాడుతూ గజ్జెల్ని నేలపై తాడిస్తూ నాలుగు వేళ్ళ సహాయంతో [[డమరుకం]] వాయిస్తారు. ఒకరు పాడుతుంటే మిగిలిన వారు వంత పాడతారు.
 
==పాటలు- సాహిత్యం:==
"https://te.wikipedia.org/wiki/గొరవయ్యలు" నుండి వెలికితీశారు