బుద్ధఘోషుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{in use}}
ఆచార్య బుద్ధఘోషుడు క్రీ.శ. 5 వ శతాబ్దికి చెందిన సుప్రసిద్ధ భారతీయ థేరవాద [[బౌద్ధ మతము|బౌద్ధ]] పండితుడు. పాళీ భాషా విద్వాంసుడు. దేశ విదేశీ పండితులచే థేరవాద సంప్రదాయంలో గొప్ప వ్యాఖ్యాతగా గుర్తించబడ్డాడు. బౌద్ధ [[పాళీ భాష|పాళీ]] వాజ్మయంలో బహు గ్రంధ రచయితగా ప్రసిద్ధికెక్కాడు. జన్మతా భారతీయుడైన బుద్ధఘోషుడు సింహళ దేశానికి (శ్రీలంకకు) తరలిపోయి అక్కడి అనురాధాపురంలోని మహావిహారంలో బౌద్ధ ఆచార్యుడిగా స్థిరపడ్డాడు. అక్కడే ఉంటూ సింహళ భాషలో ఉన్న అట్టకథలను (Commentaries), జాతక కథలను పాళీ భాషలోనికి అనువదించాడు. ఇతని వ్యాఖ్యానాలలో సమంతపాసాదికా, సుమంగళ విలాసిని, జాతకట్టకథా ముఖ్యమైనవి. ఇతను రచించిన ‘విసుద్ధిమగ్గ‘ (Path of Purification) (సంస్కృతంలో ‘విశుద్ధిమార్గ’) అనే గ్రంథం త్రిపీటకాలను అవగతం చేసుకునేందుకు కీలకమైంది. బుద్ధుని విమోచన మార్గాన్ని సమగ్రంగా వివరించిన ఈ గ్రంధం థేరవాదంలో అత్యంత ప్రామాణిక బౌద్ధ గ్రంధంగా నిలిచింది. తన జీవిత చరమాంకంలో భారతదేశానికి తిరిగి పయనమై బౌద్ధగయ క్షేత్రంలో మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/బుద్ధఘోషుడు" నుండి వెలికితీశారు