బుద్ధఘోషుడు: కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  5 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
==జీవిత విశేషాలు==
సింహళ దేశానికి చెందిన మహావంశం గ్రంధం ప్రకారం బుద్ధఘోషుడు ఉత్తర భారత దేశంలోని బోధిగయ క్షేత్రానికి సమీప గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యంలో ప్రతిభావంతుడిగా, మహా బుద్ధిశాలిగా పేరు తెచ్చుకొన్నాడు. యవ్వనంలో భారతదేశమంతటా కలియ తిరుగుతూ తన వాదనా పటిమను ప్రదర్శించేవాడు. ఒక సందర్భంలో దక్షిణ భారత దేశంలోని రేవతుడు అనే బొద్ద బిక్షువుతో వాదనకు దిగి అనంతరం అతనికి శిష్యుడైనాడు. రేవతుని వద్ద ప్రవ్రజ్య స్వీకరించి బుద్ధఘోషునిగా పిలువబడ్డాడు. రేవతుని శిక్షణలో బౌద్ధ త్రి పీటకాలు అధ్యయనం చేసాడు. తన గురువు వల్ల జ్ఞానోదయం అయినందుకు కృతజ్ఞతగా జ్ఞానోదయం అనే గ్రంధం రచించాడు. శ్రీలంకలో భద్రపరిచివున్న అట్టకథలను సింహళ భాష నుండి పాళీ భాషలోనికి అనువదించమని కోరిన గురువు రేవంతుని అభిమతానుసారం శ్రీలంకకు ప్రయాణమయ్యాడు. శ్రీలంకలో అనురాధాపురంలోని విఖ్యాతికేక్కిన మహావిహారంలో చేరుకొని అక్కడి పెద్ద బౌద్ధబిక్షువులకు తన వ్యాఖ్యాన పటిమకు తార్కాణంగా త్రిపీటకాలలోని సారమంతా రంగరించి విసుద్దిమార్గ అనే గ్రంధం రాసి చూపించి అక్కడి పెద్ద బౌద్ధ బిక్షువుల ప్రశంసలు పొందాడు. అనంతరం అనురాధాపురంలోని మహావిహారంలో బౌద్ధ ఆచార్యుడిగా స్థిరపడ్డాడు. అక్కడే నివసిస్తూ సింహళ భాషలో ఉన్న 13 అట్టకథలను (Commentaries), జాతక కథలను పాళీ భాషలోనికి అనువదించాడు. తన జీవిత చరమాంకంలోచివరిదశలో భారతదేశానికి తిరిగి పయనమై బౌద్ధగయ క్షేత్రం వద్ద మరణించాడు.
 
===బుద్ధఘోషుడు తెలుగువాడు===
7,951

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2144662" నుండి వెలికితీశారు