ఒంటిమిట్ట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
ఏకశిలానగరానికి పడమరవైపున, ఒక కి.మీ.దూరంలో ఉన్న ఈ ఆశ్రమం, పూర్వం మృకుందమహర్షి చే నిర్మితమైనదని పురాణాల ఉవాచ. ఆయన ఈ ఆశ్రమంలో కొలువైన ముక్కంటిని నిత్యం ఆరాధించేవారని పూర్వీకుల కథనం. అందువలన ఈ గ్రామానికి ఆ పేరు వచ్చినది. ఈ ఆలయానికి సమీపములోని ఉన్న ఒక '''వంక '' (వాగు), దక్షిణం నుండి ఉత్తరంవైపు ప్రవహించుచూ ఉండటంతో, ఇందులోని జలధారను భక్తులు పవిత్రమైనదిగా భావించుచున్నారు. చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో ఫలాలు, ఔషధ మొక్కలూ అధికంగా అందుబాటులో ఉండేవి. యఙయాగాదులు, తపస్సుల నిర్వహణకు అనుకూలంగా ఉండటంతో, మునులు, మహర్షులు ఈ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకునేవారు.
 
మృకుందాశ్రమానికీ, ఈ ముకుందాపురానికీ జైనమతంతో సంబంధం ఉన్నట్లు ఆనవాళ్ళు ఉన్నాయని చరిత్ర పరిశోధకులు శ్రీ [[కట్టా నరసింహులు]] తెలియజేసినారు. స్కంద పురాణంలో ఈ ఆశ్రమ ప్రస్తావన ఉన్నట్లు గూడా ఆయన వివరించినారు. ఇక్కడ పరమేశ్వరుని లింగం, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, భ్రమరాంబ, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, కాలభైరవుల విగ్రహాలు కొలువై ఉన్నవి. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. [2]
 
==మండలంలోని పంచాయితీలు==
"https://te.wikipedia.org/wiki/ఒంటిమిట్ట" నుండి వెలికితీశారు