తరిమెల నాగిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

+విస్తరణ
పంక్తి 1:
'''తరిమెల నాగిరెడ్డి''' [[అనంతపురం]] జిల్లా [[తరిమెల]] గ్రామంలో [[ఫిబ్రవరి 11]], [[1917]]న రైతు కుటుంబములో జన్మించాడు. [[ఆంధ్ర ప్రదేశ్]] కు చెందిన ప్రముఖ [[కమ్యూనిజం|కమ్యూనిస్టు]] నాయకులలో నాగిరెడ్డి ఒకడు. అందరూ నాగిరెడ్డి గారిని టి.ఎన్ అని పిలిచేవారు.
 
పాఠశాల రోజుల నుండే సమాజములోని అసమానతలకు వ్యతిరేకంగా తిరుగుబాటు లక్షణాలు కనబరిచాడు. [[మద్రాసు]]లోని [[లయోలా కళాశాల]]లో ఇంటర్మీడియట్ (10+2) చదివేరోజుళ్ళో తన జాతీయతా భావాల కారణంగా కళాశాల యాజామాన్యానికి, ఆచార్యులతో నాగిరెడ్డికి పొసగలేదు. లయోలా కళాశాల యాజమాన్యము నాగిరెడ్డికి [[జవహర్ లాల్ నెహ్రూ]] బహిరంగ ఉపన్యాసాలకు హాజరైనందుకూ, రామస్వామి ముదలియార్ కు, సత్యమూర్తికి మధ్య జరిగిన ఎన్నికల ప్రచారములో పాల్గొన్నందుకు మరియు వ్యాసరచనా పోటీలలో మహమ్మద్ బిన్ తుఘ్లక్ ను ప్రశంసించినందుకు, అనేకసార్లు జరిమానా విధించింది.
నాగిరెడ్డి అప్పటి [[మద్రాసు]]లోని [[లయోలా కళాశాల]]లోనూ, ఆ తరువాత [[వారణాసి]], [[బనారస్ హిందూ విశ్వవిద్యాలయం]]లోనూ విద్యనభ్యసించాడు. విద్యార్థిగానే నాగిరెడ్డి [[మార్క్సిజం]] వైపు ఆకర్షితుడై 1940, 1941 మరియు 1946లలో [[జైలు]]కు వెళ్లాడు.
 
నాగిరెడ్డి లయోలా కళాశాల తరువాత [[వారణాసి]], [[బనారస్ హిందూ విశ్వవిద్యాలయం]]లో విద్యనభ్యసించాడు. వారణాసిలో ఉన్న నాలుగేళ్ళలో నాగిరెడ్డి కమలాదేవి ఛటోపాధ్యాయ, జయప్రకాశ్ నారాయణన్, అచ్యుత్ పట్వర్ధన్ వంటి వారిచే ప్రభావితుడయ్యాడు. కమ్యూనిజం మరియు మార్క్సిజంతో ఈయనకు వారణాసిలోనే పరిచయమయ్యింది. రష్యన్ విప్లవము మరియు స్టాలిన్ నాయకత్వము గురించి విస్తృతముగా చదివి, భారతదేశములో కూడా మార్క్సిజాన్ని అమలుచేయవచ్చని నమ్మటం ప్రారంభించాడు.
 
నాగిరెడ్డి తన ప్రభుత్వ వ్యతిరేక రాజకీయకలాపల వళ్ల అనేకమార్లు [[జైలు]]కు వెళ్లాడు. 1940లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ''యుద్ధం మరియు ఆర్ధిక వ్యవస్థపై దాని ప్రభావం'' అన్న పుస్తకం వ్రాసి ప్రభుత్వము యొక్క ఆగ్రహానికి గురై జైలుకు వెళ్ళాడు. తిరుచిరాపల్లి జైలునుండి విడుదల కాగానే మరలా 1941లో భారతీయ రక్షణ చట్టము కింద అరెస్టయ్యాడు. 1946లో ప్రకాశం ఆర్డినెన్సు కింద అరెస్టయ్యి 1947లో విడుదల చేయబడ్డాడు.
 
1951లో నాగిరెడ్డి మద్రాసు [[శాసనసభ]]కు [[సి.పి.ఐ]] అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. 1957లో అనంతపురం నియోజకవర్గం నుండి [[లోక్‌సభ]]కు ఎన్నికయ్యాడు. 1962లో [[పుత్తూరు]] నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సి.పి.ఐ అభ్యర్థిగా ఎన్నికైనాడు. తిరిగి 1967లో [[సి.పి.ఐ (ఎం)]] అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు.
Line 11 ⟶ 15:
==బయటి లింకులు==
*[http://naxalrevolution.blogspot.com/2006/09/legacy-and-history-of-indian-maoism.html భారతీయ మావోయిజం యొక్క చరిత్ర - తరిమెల నాగిరెడ్డి మరియు తెలంగాణా సాయుధ పోరాటానికి నివాళులు]
*[http://www.hindu.com/2004/10/18/stories/2004101802880500.htm హిందూపత్రికలో అనంతపురంలో నాగిరెడ్డి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా వచ్చిన వార్త]
 
[[వర్గం:1917 జననాలు]]
[[వర్గం:1976 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/తరిమెల_నాగిరెడ్డి" నుండి వెలికితీశారు