కాశీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
మద్యకాలంలో వారణాశి మతసంప్రదాయాలకు మరియు విద్యకు కేంద్రమై విలసిల్లింది. భక్తి ఉద్యమకాలంలో వారణాశిలో 1389లో రామభక్తుడైన [[కబీరుదాసు]] జన్మించాడు. కబీరరుదాసు రచించిన భక్తిరసపూరిత కీర్తనలు 15 వ శతాబ్దంలో [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో కీర్తించబడ్డాయి. అలాగే 15 వ శతాబ్దంలో సంఘసంస్కర్త, యోగి, కవి, యాత్రికుడు మరియు మతగురువు అయిన రవిదాసు వారణాశిలో జన్మించాడు. రవిదాసు జీవనోధి కొరకు తోళ్ళపరిశ్రమలో పనిచేసాడు. అలాగే భారతదేశం మరియు [[దక్షిణాసియా]] అంతటి నుండి అనేక ప్రఖ్యాత విద్యావేత్తలు, బోధకులు వారణాశిని సందర్శించారు. 1507లో గురునానక్ దేవ్ శివరాత్రి సందర్భంగా వారణాశిని సందర్శించాడు. ఈ సంఘటన సిక్కుమత స్థాపనలో అత్యంత ప్రాముఖ్యత వహించింది.
=== స్వాతంత్రానికి ముందు చరిత్ర ===
16వ శతాబ్దంలో మొగల్ చక్రవర్తి [[ఆక్బర్]] పాలనలో వారణాశిలో సరికొత్త సంస్కృతి మొదలైంది. ఆక్బర్ చక్రవర్తి ఆధ్వర్యంలో వారణాశిలో శివునికి మరియు [[విష్ణుమూర్తి]]కి రెండు పెద్ద ఆలయాలను నిర్మించబడ్డాయి. పూనా రాజు 200 మీటర్ల (660 అడుగులు) ఎత్తైన [[ అంపూర్ణాదేవి]] నమందిరం నిర్మించాడు. అలాగే పూనా రాజు పాలనలో శివా - విష్ణులకు అంకితమివ్వబడిన అక్బారి వంతెన కూడా నిర్మించబడింది. 16వ శతాబ్దం నుండి వారణాశికి యాత్రికుల రాక ప్రారంభమైంది. 1665లో ఫ్రెంచి యాత్రికుడైన " జీన్ బాప్టిస్ట్ ట్రావర్నియర్ " ఈ నగరాన్ని సందర్శించి వారణాశిలోని గంగాతీరంలో ఉన్న " బిందు మహాదేవాలయం " సౌందర్యాన్ని వర్ణించాడు. చక్రవర్తి షేర్ షాహ్ సూరి కాలంలో వారణాశి రహదారి పునరుద్దరినబడి [[కొలకత్తా]] నుండి పెషావర్ వరకు పొడిగించబడింది. తరువాత బ్రిటిష్ పాలనా కాలంలో ఈ రహదారి ప్రఖ్యాతమైన " గ్రాండ్ ట్రంక్ రోడ్డుగా " అవతరుంచింది. 1656లో ఔరంగజేబు పలు ఆలయాలు ధ్వంసం చేయబడి మసీదులు నిర్మించబడ్డాయి. నగరం తిరిగి సంస్కృతి పరంగా వెనుకబడింది. అయినప్పటికీ [[ఔరంగజేబు]] మరణానంతరం భారాదేశంలో తిరిగి హిందూ రాజ్యాలు తలెత్తి వర్ద్ధిల్ల సాగాయి. ప్రస్తుతం వారణాశిలో ఉన్న ఆలయాలు హిందూ రాజులైన రాజపుత్రులు మరియు మరాఠా రాజులచేత నిర్మించబడ్డాయి. ప్రస్తుతం వారణాసిలోని పలు నిర్మాణాలు 18వ శతాబ్ధానికి చెంది ఉన్నాయి. బెనారస్ రాజు లేక కాశీ నరేష్ తో సహా ఈ రాజులు బ్రిటిష్ పాలనా సమయంలో (క్రీ.శ 1775-1945) కూడా కొనసాగారు. 1737లో మొగల్ చక్రవర్తుల ఆధ్వర్యంలో " బెనారస్ రాజ్యం ( కింగ్డం అఫ్ బెనారస్) " పేరుతో సాధికారంగా ఏర్పాటు చేయబడి 1947 వరకు కొనసాగింది. 18వ శతాబ్దంలో మహమ్మద్ షాహ్ ఆధ్వర్యంలో గంగాతీరంలో ఉన్న మాన్ మందిరం ఘాట్ వద్ద ఒక " అబ్జర్వేటరీ " కేంద్రాన్ని నిర్మించబడింది. ఇది జ్యీతిషశాస్త్ర విషయాల పరిశీలనకు అనుకూలమైంది. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి బ్రిటిష్ గవర్నర్లైన వారెన్ హేస్టింగ్, వారణాశిలో సంస్కృత కళాశాలను స్థాపించిన జూనాథాన్ డంకన్ కాలంలో వారణాశి పర్యాటకం మరింత వర్ధిల్లింది. 1867లో వరణాశిలో పురపాలక సంఘస్థాపన జరిగిన తరువాత వారణాశి నగరంలో మరింత అభివృద్ధి కొనసాగింది.
 
=== ప్రత్యేక సంఘటనలు ===
"https://te.wikipedia.org/wiki/కాశీ" నుండి వెలికితీశారు