నేదునూరి గంగాధరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
== జననం ==
వీరు [[జూలై 4]], [[1904]] [[సంవత్సరం]]<nowiki/>లో [[రాజమండ్రి]] మండలం [[కొంతమూరు]] లో
వీరు [[జూలై 4]], [[1904]] [[సంవత్సరం]]<nowiki/>లో [[రాజమండ్రి]]లో జన్మించారు. చదివిన కొద్దిపాటి చదువుతో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. చిన్ననాటి నుండి జానపద వాజ్మయ సేకరణ ఒక మహత్కార్యంగా భావించారు. దానిని ఎంతో ప్రయాసకోర్చి గ్రామగ్రామాలు తిరిగి [[జానపద గేయాలు]], కథా గేయాలు, వీరగాథలు, జమిలి పదాలు, నోముల కథలు, [[పండుగ]] పాటలు, ఆటపాటలు, ప్రార్థన గేయాలు, వినోద గేయాలు, ఎక్కిరింత పాటలు, జంటపదాలు, [[జాతీయాలు]], [[సామెత]]లు, కిటుకు మాటలు - లక్షల సంఖ్యలో సేకరించారు. వీనిలో కొన్ని 1953లో సంభవించిన గోదావరి వరదలలో కొట్టుకొనిపోయాయి. మిగిలినవాటినుండి మొదటగా సెలయేరు - జానపద గేయ సంకలనాన్ని 1955లొ దేశోద్ధారక గ్రంథమాల వారు ప్రచురించారు. తర్వాత [[వ్యవసాయం|వ్యవసాయ]] సామెతలను 1956లో ప్రచురించారు. సుమారు 5,000 తెలుగు [[సామెతలు]], జాతీయలు కలిగిన వీరి "పసిడి పలుకులు" గ్రంథం ఒక అపూర్వమైన సంకలనం. ఆ తర్వాత [[మేలుకొలుపు]] పాటలు, మంగళ హారతులు, మిన్నేరు, మున్నీరు, స్త్రీల వ్రత కథలు, జానపద గేయ వాజ్మయ వ్యాసావళి మొదలైన [[గ్రంథాలు]] ప్రచురించారు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/నేదునూరి_గంగాధరం" నుండి వెలికితీశారు