బేతవోలు రామబ్రహ్మం: కూర్పుల మధ్య తేడాలు

తల్లి నీరాజనం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
===ఉద్యోగం===
మొట్టమొదట ఇతడు [[గుంటూరు]]లోని కెవికె సంస్కృత కళాశాలలో ఉపన్యాసకులుగా చేరాడు. ఇతని బోధన విద్యార్థులకే కాక సహ అధ్యాపకులైన [[ఏలూరిపాటి అనంతరామయ్య]] , మల్లంపల్లి వీరేశ్వరశర్మ , కోగంటి సీతారామచార్యులు, [[జమ్మలమడక మాధవరామశర్మ]] వంటి పండితులను కూడా ఆకర్షించేది. తరువాత ఇతడు నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు. [[ఎన్‌.టి. రామారావు]] [[ముఖ్యమంత్రి]]గా ఒకరోజు నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో ఇతడి పద్యాలు విని అభినందిస్తూ… ‘మేం త్వరలో ఏర్పాటు చేయబోయే తెలుగువిశ్వవిద్యాలయానికి మీ వంటి వారు అవసరం. త్వరలో మనం తప్పకుండా కలుద్దాం’ అని అన్నాడు. దాంతో రామారావు ప్రత్యేకంగా కళలకు సంబంధించి తెలుగు విశ్వ విద్యాలయం స్థాపించడం, [[రాజమండ్రి]] వద్దనున్న [[బొమ్మూరు]] కేంద్రంగా సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేయడం, అక్కడికి ఇతడిని ఆచార్యులుగా తీసుకోవడం జరిగింది. అక్కడ తెలుగు సాహిత్య అధ్యయనం రూపకల్పనలోనూ, పరిశోధన విషయంలోనూ ఇతడు పెనుమూర్పులు తీసుకువచ్చి భావితరాలకు మార్గదర్శకత్వం వహించడంలో కీలకపాత్ర పోషించాడు. ‘భారతి’ లేని లోటును తీర్చిన ‘వాజ్ఞ్మయి’ త్రైమాసిక పత్రిక పేరు ఇతడు సూచించిందే. [[హైదరాబాద్‌]]లో ప్రారంభమై ఏడాది పాటు నడిచిన ఆ పత్రికను బొమ్మూరుకు తీసుకెళ్ళి పరిశోధనలో ప్రామాణికతను పాటిస్తూ తెలుగు సాహిత్యానికి విశిష్టమైన సంచికగా రూపొందించడంలో కీలకంగా నిలిచాడు. ఇతడి మార్గదర్శకత్వంలో పాతికమంది వరకు పీహెచ్‌డీలు చేసి డిగ్రీలు పొందారు.
 
2005లో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా చేరారు.
"https://te.wikipedia.org/wiki/బేతవోలు_రామబ్రహ్మం" నుండి వెలికితీశారు