"మీరా కుమార్" కూర్పుల మధ్య తేడాలు

చి
1985 లో క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించింది. [[ఉత్తరప్రదేశ్]] లోని [[m:en:Bijnor|బిజ్నోర్]] నియోజకవర్గం నుండి రాజకీయ దిగ్గజాలైన రాం విలాస్ పాశ్వాన్, [[మాయావతి]] లాంటి దళిత నేతలను ఓడించి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైంది. [[ఢిల్లీ]] లోని [[m:en:Karol Bagh (Lok Sabha constituency)|కరోల్ బాగ్]] నియోజకవర్గానికి [[m:en:8th Lok Sabha|8వ]] మరియు 12వ లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించింది . 1999లో [[భారతీయ జనతా పార్టీ]] ప్రభంజనంలో ఈవిడ ఓడిపోయింది. కానీ 2004 మరియు 2009 లలో తన తండ్రి గతంలో పోటీచేసిన [[బీహార్]] లోని [[m:en:Sasaram|ససారం]] నియోజకవర్గం నుండి రికార్డు స్థాయి విజయం సాధించింది.
 
2004 నుండి 2009 వరకు [[కాంగ్రెస్]] ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ మరియు సాధికార మంత్రిగా పనిచేసింది. 2009లో కేంద్ర జలవనరుల మంత్రిగానూ కొద్దికాలం బాధ్యతలు నిర్వర్తించింది. ఈ పదవిలో ఉండగానే [[లోక్‌సభ]] సభాపతిగా ఎన్నుకోబడటంతో మంత్రి పదవికి రాజీనామా చేసి, భారత [[లోక్‌సభ]]కు మొట్టమొదటి మహిళా సభాపతిగా బాచ్యతలు చేపట్టింది.
====2014 ఎన్నికలు====
[[2014 పార్లమెంటు ఎన్నికలు|2014 పార్లమెంటు ఎన్నికల]]లో మీరాకుమార్ బీహార్‌లోని ససారం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఇక్కడ [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి పాశ్వాన్ సుమారు 60వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.
 
==వ్యక్తిగత జీవితము==
ఈమె వివాహము [[సుప్రీం కోర్టు]] [[న్యాయవాది]] అయిన మంజుల్ కుమార్ తో జరిగింది. వీరికి ముగ్గురు సంతానము. కుమారుడు అన్షుల్ మరియు కుమార్తెలు స్వాతి మరియు దేవయాని. అన్షుల్ వివాహము మినితాతో జరిగింది. వీరికి ఒక [[కూతురు|కుమార్తె]] అనాహిత. కుమార్తె స్వాతి [[పెళ్ళి|వివాహము]] రంజీత్ తోనూ మరియు దేవయాని వివాహము అమిత్ తోనూ జరిగింది. స్వాతి మరియు రంజిత్ లకు ఒక కుమార్తె అమ్రిత మరియు కుమారుడు అన్హద్ సంతానము. అలాగే దేవయాని మరియు అమిత్ లకు ఒక [[కొడుకు|కుమారుడు]] ఫర్జాన్ సంతానము.
 
[[మీరా కుమార్]] కి క్రీడల పట్ల ఆసక్తి మెండు. ఈవిడ రైఫిల్ షూటింగ్ లో అనేక పతకాలను కూడా గెలుచుకుంది. అలాగే ఈవిడ రచనలు కూడా ప్రచురితమయ్యాయి.
1,87,002

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2152292" నుండి వెలికితీశారు