కంచర్ల సుగుణమణి: కూర్పుల మధ్య తేడాలు

208 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(Created page with ''''కంచర్ల సుగుణమణి''' ప్రముఖ సంఘ సేవకురాలు. దుర్గాబాయి దేశ్‌మ...')
 
దిద్దుబాటు సారాంశం లేదు
ఈమె [[1919]], [[నవంబర్ 27]]వ తేదీన [[కాకినాడ]]లో గురుజు వెంకటస్వామి, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించింది. ఈమె ఐదుగురు చెల్లెళ్ళు, నలుగురు అన్నదమ్ముల మధ్య పెరిగింది. ఆ రోజులలోనే ఈమె మగపిల్లలతో సమానంగా మహారాజా కాలేజీలో డిగ్రీ చదివింది. చిన్నప్పటినుండి మంచి వాతావరణంలో పెరగడంవల్ల ఈమెకు సేవాభావం అలవడింది. ఈమె వివాహం గాంధేయవాది కంచర్ల భూషణంతో జరిగింది. ఆ రోజుల్లోనే కట్నకానుకలు వద్దని, చదువు, సంస్కారం వున్న అమ్మాయి కావాలని కంచర్ల భూషణం ఈమెను వివాహం చేసుకున్నాడు.
 
==సంఘసేవ==
 
ఆమె చదువుకునే రోజులలోనే భూకంపాలు, వరదలు, ఉప్పెనలు వచ్చినప్పుడు, ఇంటింటికీ వెళ్ళి విరాళాలు సేకరించి కాలేజీ యాజమాన్యానికి అప్పగించేవారట. తనలోని తపనను అక్షరాలతో పొదిగి గృహలక్ష్మి, భారతి వంటి పత్రికలకు వ్యాసాలు వ్రాసేవారుట.
సుగుణమణి వివాహం గాంధేయ వాది శ్రీ కంచర్ల భూషణం గారితో జరిగింది. భూషణం గారి ఉద్యోగరీత్యా దంపతులు ఢిల్లీ వెళ్ళారు. అప్పటికే ఆకాశవాణి ప్రారంభించారు. సుగుణమణి తొలి తెలుగు ప్రసంగం ఢిల్లీ నుండి ప్రసారమయింది. 1944 సం||లో భూషణం గారికి మద్రాసు బదిలీ అయింది.
మహాత్ముని ఆజ్ఞ ప్రకారం దుర్గాబాయమ్మ గారు సుగుణమణితో కలసి, రాష్ట్రమంతా పర్యటించి, ”కస్తూరిబా సేవా సంఘాలు” స్థాపించి అనుభవజ్ఞులైన సేవికలను ఏర్పాటుచేశారు. ఈనాటికీ అవి నిర్విరామంగా సేవలు చేస్తున్నాయంటే వాటి వెనుక సుగుణమణి గారి కృషిని మనం అభినందించాలి.
భూషణంగారి ఉద్యోగరీత్యా అరకు వెళ్ళినప్పుడు అక్కడి గిరిజనుల పూరిళ్ళు, ఆహారం, భాష, కట్టుబాట్లు విచిత్రంగా వుండటం ఆమె గమనించారుట. అక్కడి అనారోగ్యాలూ, విషజ్వరాలూ, కొండదేవతలకిచ్చే నరబలులు, జంతుబలులూ చూసి చలించిపోయి, మద్రాసులోని స్త్రీ శిశు సంక్షేమ అధికారి పారిజాతం నాయుడికి లేఖ వ్రాశారుట. ఆమె సహకారంతో ఒక సంక్షేమ కేంద్రాన్ని స్థాపించి, తమ కాలనీలోని స్త్రీల సహకారంతో పిల్లలకు చదువు, ఆటపాటలు, కుట్లు, పారిశుధ్యం నేర్పుతూ సుగుణమణి ఐదు సంవత్సరాలు వారికి సేవ చేశారుట. ఇప్పటికీ అక్కడ ఆ కేంద్రంలో స్త్రీలకు, పిల్లలకు చదువు, వృత్తివిద్యలు, ఆరోగ్యసూత్రాలు నేర్పుతున్నారుట.
===ఆంధ్రమహిళాసభ====
శ్రీమతి దుర్గాబాయమ్మ గారి కోరిక మేరకు 1957 సం|| అక్టోబర్‌లో హైదరాబాదు వచ్చి ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు.
”ఆంధ్రమహిళాసభ” హైదరాబాద్‌ శాఖను అప్పటి రాష్ట్రపతి శ్రీ బాబూ రాజేంద్రప్రసాద్‌ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అప్పుడు విద్యానగర్‌లో ప్రారంభించిన ”ఆంధ్రమహిళాసభ” మెటర్నిటీ హాస్పిటల్‌, హేండీక్రాఫ్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌, హైస్కూల్‌, హాస్టల్‌, అసెంబ్లీహాల్‌లతో నిండిపోతే, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా స్థలం తీసుకుని ఆర్ట్స్‌, సైన్స్‌, లా కాలేజీలు, కంప్యూటర్‌ కోర్స్‌, సంగీతం క్లాసులు, లిటరసీ భవన్‌, గాంధీభవన్‌, హాస్టల్‌, వికలాంగుల స్కూలు, ఫిజియోథెరపీ, నర్సింగు హాస్టల్‌ అలా ఎన్నో ఏర్పాటు చేశారు. 260 మంది పిల్లలు ఎన్నో వృత్తి విద్యలు నేర్చుకుంటున్నారు.
ఆంధ్రనారీలోకానికి సేవచేసే ఆదర్శము, అభిలాష, ప్రజ్ఞ గల సుగుణమణి వంటి సోదరీమణి యొక్క సేవ త్వరలోనే లభ్యం కాగలదని నేనూ, ఆంధ్రమహిళాసభా ఆశిస్తున్నాము అని వ్రాశారు.
”నాకు వచ్చిన అవార్డుల కంటే, దుర్గాబాయమ్మ గారు నామీద చూపించిన ఈ అభిమానం, ఆత్మీయత నాకు ఎంతో అపురూపమైన బహుమానం” అంటారు అది తలచుకొని సుగుణమణి.
 
===ఆంధ్ర బాలానందసంఘం====
అటు ‘ఆంధ్రమహిళాసభ’లో స్త్రీ సంక్షేమంతో పాటుగా, యిటు ‘బాలానంద సంఘం’లో శిశుబాలల సంక్షేమానికీ అంకితమయ్యారామె. ‘బాలానంద సంఘం’లో మొదటి నుంచే ఉపాధ్యక్షురాలిగా ఆమె ఎంతో సేవ చేశారు. రేడియో అన్నయ్య రాఘవరావుగారికి, అక్కయ్య కామేశ్వరి గారికి సుగుణమణి గారు ఎంతో ఆత్మీయురాలు.
అన్నయ్యగారు చనిపోయినప్పుడు, అక్కడి కార్యక్రమాలన్నీ అయిపోయాక, జనరల్‌ బాడీ మీటింగు పెట్టారుట. అన్నయ్యగారి మేనకోడలు కమల, అన్నయ్య గారు యిచ్చారంటూ ఒక కవరు తెచ్చి యిచ్చారుట. అందులో అన్నయ్యగారు తన తదనంతరం ‘బాలానంద సంఘాన్ని’ శ్రీమతి సుగుణమణి గారి అధ్యక్షతన నడపవలసినదిగా వ్రాశారుట. ఆనాటినుంచీ, ఈనాటివరకు ‘బాలానంద సంఘం’ సుగుణమణి గారి అధ్యక్షతన దినదిన ప్రవర్ధమాన మయింది.
1944 నుంచీ ఆలిండియా రేడియోలోనూ, టి.వి. వచ్చిన తరువాత అన్ని ఛానల్స్‌లోను ఎన్నో స్త్రీల సమస్యల గురించి తన నిశ్చితాభిప్రాయాలను వెలిబుచ్చుతూనే వున్నారు. శిశువుల నుంచీ వృద్ధుల దాకా స్త్రీలను ఆదుకోవాలనే దుర్గాబాయమ్మ గారి ఆశయాన్ని కూడా సుందర్‌నగర్‌లో వృద్ధాశ్రమం ఏర్పాటుచేసి పూర్తిచేశారు. ‘ఆంధ్రమహిళాసభ’కు అవసరమైన భవనాలను తను సేకరించిన విరాళాలతో నిర్మించారు. సమయపాలనకు ఆమె చాలా విలువ యిస్తారు. నిగర్వి, నిరాడంబరంగా వుంటారు. ఆమెను చూస్తే ఈమేనా యిన్ని పనులు చేసింది అని ఆశ్చర్యపోతాము. చాలా సాదాసీదాగా వుంటారు. గేట్‌కీపర్‌ దగ్గరనుంచీ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ దాకా అందరినీ ఎంతో ఆత్మీయంగా యోగక్షేమాలు నుక్కుంటారు. అందుకే దుర్గాబాయమ్మ గారి జీవితాశయాలకు సుగుణమణి గారు వారసులై నిలువగలిగారు. ఆమె అందరికీ ‘అమ్మే’.
ఈ వయసులో కూడా ‘సభ’కు వెళ్తూ అందరికీ ఉత్సాహాన్ని యిస్తున్న సుగుణమణి ఆయురాగ్యోగాలతో వుండాలని, ఎందరో ఆమె చల్లని నీడలో సేదదీరాలనీ కోరుకుందాం.
==పురస్కారాలు, సన్మానాలు==
సుగుణమణి గారిని ఎన్నో అవార్డులు, రివార్డులు వరించినాయి. 1991 సంవత్సరం ఛైల్డ్‌ వెల్ఫేర్‌కి గాను నేషనల్‌ అవార్డు అప్పటి ప్రెసిడెంట్‌ చేతులమీదుగా అందుకున్నారు. అదే సంవత్సరం శిరోమణి ఇన్‌స్టిట్యూట్‌, న్యూఢిల్లీ వారి వికాసశ్రీ అవార్డు, 1993లో భరతముని కళా అవార్డు, 1994లో రాజీవ్‌రత్న నేషనల్‌ అవార్డు, మిలీనియమ్‌ అవార్డు, 2000 సంవత్సరంలో లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ రామకృష్ణమఠ్‌ ద్వారా, ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డే సందర్భంగా 2001 మార్చి 8న హైదరాబాద్‌ పెరల్‌ సిటీ జూనియర్‌ ఛాంబర్‌ వారు హైదరాబాద్‌ పెరల్‌ అవార్డు, గాంధీగారి మనుమరాలు, తారాగాంధీ చటర్జీ ద్వారా ఫిబ్రవరి 6, 2002న సర్వోదయా సంస్థ అవార్డు అందుకున్నారు.
ఇన్ని అవార్డులు, రివార్డులూ వచ్చినా, ఆమె సాదాసీదాగా వుంటూ ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరిస్తుంటారు. కీర్తికాంక్ష లేకపోవటమే ఆమెకున్న విశిష్టగుణం. ఈ వయసులో కూడా తను పనిచేస్తూనే అందరిచేత పనిచేయించటం ఆమెలోని గొప్ప వ్యక్తిత్వం.
అందుకే సుగుణమణి గారిలో అందరికీ ఆత్మీయంగా చూసే ”అమ్మే” కనబడుతుంది.
==మరణం==
77,869

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2152557" నుండి వెలికితీశారు