కంచర్ల సుగుణమణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
===ఆంధ్ర బాలానందసంఘం===
అటు ‘ఆంధ్రమహిళాసభ’లో స్త్రీ సంక్షేమంతో పాటుగా, యిటు ‘బాలానంద సంఘం’లో శిశుబాలల సంక్షేమానికీ ఈమె అంకితమయ్యింది. ‘బాలానంద సంఘం’లో మొదటి నుంచే ఉపాధ్యక్షురాలిగా ఆమె ఎంతో సేవ చేసింది. రేడియో అన్నయ్య [[న్యాయపతి రాఘవరావు]], అక్కయ్య [[న్యాయపతి కామేశ్వరి]] దంపతులకు ఈమె ఎంతో ఆత్మీయురాలు.
న్యాయపతి రాఘవరావు చనిపోయి తరువాత 1984 నుండి ఈమె బాలానంద సంఘం అధ్యక్షురాలిగా పనిచేసింది. ఈమె ఆధ్వర్యంలో ”ఆంధ్ర బాలానంద సంఘం” 1990 సంవత్సరంలో స్వర్ణోత్సవాలను దిగ్విజయంగా జరుపుకున్నది.
అన్నయ్యగారు చనిపోయినప్పుడు, అక్కడి కార్యక్రమాలన్నీ అయిపోయాక, జనరల్‌ బాడీ మీటింగు పెట్టారుట. అన్నయ్యగారి మేనకోడలు కమల, అన్నయ్య గారు యిచ్చారంటూ ఒక కవరు తెచ్చి యిచ్చారుట. అందులో అన్నయ్యగారు తన తదనంతరం ‘బాలానంద సంఘాన్ని’ శ్రీమతి సుగుణమణి గారి అధ్యక్షతన నడపవలసినదిగా వ్రాశారుట. ఆనాటినుంచీ, ఈనాటివరకు ‘బాలానంద సంఘం’ సుగుణమణి గారి అధ్యక్షతన దినదిన ప్రవర్ధమాన మయింది.
అన్నయ్యగారు 1984 సంవత్సరంలో దివంగతులయ్యారు. అప్పటినుండీ పూర్తిగా ‘ఆంధ్ర బాలానందం’ బాధ్యత కూడా శ్రీమతి సుగుణమణి స్వీకరించారు. ”ఆంధ్ర బాలానంద సంఘం” 1990 సంవత్సరంలో స్వర్ణోత్సవాలను దిగ్విజయంగా జరుపుకున్నది.
అక్కడ ‘ఆంధ్రమహిళాసభ’లో కూడా దుర్గాబాయమ్మ గారు దివంగతులయ్యాక పూర్తి బాధ్యతలను చేపట్టారు. ట్రస్ట్‌ బోర్డ్‌కి యిప్పటికీ తన సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఈ మధ్యనే శ్రీమతి దుర్గాబాయమ్మ గారి సెంటినరీ సెలబ్రేషన్స్‌ చాలా ఘనంగా జరిపించారు.
”ఆంధ్రమహిళాసభ” పెట్టిన కొత్తలో శ్రీమతి దుర్గా బాయమ్మగారు, సుగుణమణి గారు ఇంటింటికీ తిరిగి బేడా, పావలా కూడా విరాళాలుగా సేకరించారు. అలా మొదలైన సేవ ఇప్పటికీ లక్షలలో విరాళాలు సేకరిస్తూ ”ఆంధ్రమహిళాసభ”ను శాఖోపశాఖలుగా విస్తరిస్తూ, కొన్ని శాఖలకు కార్యదర్శి గాను, సలహాదారుగాను సేవలు చేస్తూ, 6 ఏళ్ళు అధ్యక్షురాలిగా సమర్ధ వంతంగా ఆ పదవిని నిర్వహించారు. ఇప్పటికీ ఆమె లేకుండా ‘సభ’లో ఏ కార్యక్రమం జరగదు.
"https://te.wikipedia.org/wiki/కంచర్ల_సుగుణమణి" నుండి వెలికితీశారు