జ్యోతి బసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
 
== రాజకీయ జీవితం ==
ఇంగ్లాండులో[[ఇంగ్లాండు]]లో ఉన్నప్పుడే జ్యోతిబసు రాజకీయాలవైపు ఆకర్షితుడైనాడు. 1938లో [[జవహర్‌లాల్ నెహ్రూ]] [[లండన్]] పర్యటన సమయంలో సదస్సు నిర్వహణ బాధ్యతను జ్యోతిబసు చేపట్టినాడు. [[సుభాష్ చంద్రబోస్]] పర్యటన సమయంలో కూడా జ్యోతిబసు ఏర్పాట్లు చేసాడు. స్వదేశానికి తిరిగివచ్చిన పిదప 1946లో తొలిసారిగా బెంగాల్ శాసనసభకు ఎన్నికయ్యాడు. [[బి.సి.రాయ్]] ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించాడు. 1967లో రాష్ట్రంలో [[కాంగ్రెస్ పార్టీ]] ఓడిపోవడంతో అజయ్ ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ప్రభుత్వంలో 1967 నుండి 1969 వరకు [[పశ్చిమబెంగాల్]] ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. 1972లో రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అదే సమయంలో జ్యోతిబసు కూడా తన శాసనసభ స్థానంలో కూడా ఓడిపోయాడు. 1977 జూన్ 21 నుండి 2000 నవంబరు 6 వరకు నిరాటంకంగా జ్యోతిబసు ముఖ్యమంత్రిగా కొనసాగినారు. దీనితో దేశంలో ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డును కూడా జ్యోతిబసు స్వంతంచేసుకున్నాడు.<ref>http://economictimes.indiatimes.com/news/politics/nation/Jyoti-Basu-Marxist-who-almost-became-Indias-PM/articleshow/5455143.cms</ref> సి.పి.ఐ (యం) [[పోలిట్ బ్యూరో]] నిర్ణయం వల్ల 1996లో దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని వదులుకున్నాడు. 2000లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి పదవిని నుండి వైగొలిగినాడు. 2010 జనవరి 17న కోల్‌కతలో మరణించాడు.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/జ్యోతి_బసు" నుండి వెలికితీశారు