నాగార్జునుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
 
అటువంటి శూన్యవాదం గ్రంథమే ఈ విగ్రహ వ్యావర్తిని. దీనిలో 72 శ్లోకములు ఉన్నాయి. ఇందులో నాగార్జుని జీవిత చరిత్ర గురుంచి మొదటగా వ్రాయబడింది. అందు నాగార్జునుడు వేదలి గ్రామవాసులు అని వ్రాయబడింది.ఇందులో ప్రతీర్య సముత్పాదముగతి, కాలము, ఆత్మ, తధాగతుడు, స్వభావము, విపర్యాసము, దృష్టి, నిర్వాణము, మొదలైన ధర్మాలగురుంచి నాగార్జుని పరీక్ష, వివరణ కనబడుతుంది. ఆ పిమ్మట శున్యవాదాన్ని గురుంచి నైయాయిక, వైశేషిక, భాట్ట, అద్వైతీత్యవాదులు చెప్పిన విగ్రహ పరిశీలనం ( విగ్రహం అంటే దూషణం) జరుగుతుంది.జైనుల వలే ఇందులో నాగార్జునుడు నీతి మార్గాన్ని బౌద్ధ ధర్మంగా ప్రధానంగా వివరించారు.
 
== టిబెట్టు గ్రంధములలో నాగార్జుని చరిత్ర ==
టిబెట్టులో ఈతనని తత్త్వ వేత్తయేగాక, మంత్రవేత్త, తంత్ర వేత్త, రసాయిన వేత్తగా పరిగణిస్తారు.సువర్ణ విద్య నేర్చి, ఆర్తులైన మానవులకేగాక, మృగములకుకూడా సేవ చేయుటకు, బంగారము రెండు చేతులా దానము చేసిన దాత అని పేరు. ఆడిన మాట తప్పక తన శిరస్సునే ఇచ్చిన సత్యసంధుడు అని వీరి గ్రంధములు తెలుపుచున్నవి. వీరు కులాచార్య జ్ఞానశ్రీ అనే టిబెట్టు మఠాధిపతి <nowiki>'''</nowiki>భద్రకల్ప ద్రుమము<nowiki>'''</nowiki> అనే గ్రంధములో నాగార్జుని గురుంచి పలు విషయములు తెలియపరిచినారు. దీనిని సీనో ఇండియన్ జర్నల్ 1948 డిసెంబరులో వ్యాసం ప్రచురించబడినది. దీని ప్రకారము:
 
ఆచార్య నాగార్జునుడు దక్షిణాపధం లో ఉన్న విదర్భ దేశంలో ఒక బ్రాహ్మణవంశంలో పుట్టాడు. తండ్రి జ్ఞానదేవుడు లేక గోశాలి. 7 సం.లు రోజూ సామాన్యులకు, బ్రాహ్మణులకు, శ్రమణులకు, వందలమందికి ఆతిధ్య మిస్తుండేవాడు. ఈతని తల్లిదండ్రులు ఈతనికి శాక్యుడనే పేరు పెట్టారు. శాక్యునికి సప్తవర్షప్రాయం రాగానే, అతని అభిరుచులననుసరించి వదలి ఉండాలనే ఆలోచన భరించరానిదై ఉన్నా, విదేశములకు పంపే ప్రయత్నం చేశారు.
 
నలేంద్ర (నలంద) చేరి సారహ (పాదు)ని దర్సించినాడు.ఇతను శాక్యునికి దీర్ఘాయుర్దాయమును ప్రసాదించినాడు. పిల్లవానిని మంత్రపధంలో ప్రవేశపెట్టాడు. దీనివల్ల ఆయుర్దాయం పెరిగింది.అష్టవర్షానంతరం ఆచార్య రాహు భద్రుని ద్వారా సరస్వతీ పాదుల తరగతిలో ప్రవేశపెట్టబడ్డాడు.సారహ పాదుని వద్ద మహాయాన శాస్త్రమును చెప్పుకున్నాడు.పది సం. అనంతరం ప్రాచీ(పూర్వ దేశం) లో గొప్ప ఆచార్యుడనీ పేరు పొందిన కల్యాణ మిత్రుని వద్ద శిక్షణ పొందాడు. శ్రీమాన్ ప్రజ్ఞాసారమిత అనే బిరుదుని పొందాడు.
 
ఇతను తరువాత మహామంజురీ కురుకుల మొదలయిన తంత్రములను అభ్యసించాడు.ఈవిధముగా ప్రాపంచిక విజయమును ముఖ్యంగా రసాయినములలో పొందాడు. రసాయిన సిద్ధివలన వజ్రకాయ సిద్ధిని గడించాడు.
 
మొదట ఇతను రసాయినములలో భల్లవుని దగ్గర శిక్షణ పొందాడు.నిదానుని దగ్గర బంగారము చేయు ద్రావకములను గురించి కొన్ని వివరణములను సేకరించాడు.కాని ఈ విధానములవలన విజయం పొందలేదు.సారాబట్టీ పెట్టి విక్రయించు ఒక స్త్రీవద్ద ఈరహస్యమును తెలిసికొని స్వర్ణవిద్యలో పరిపూర్ణత్వం గడించాడు. ప్రపంచ క్షామంలో ఇతను నలేంద్రలోని మహాయాన సంఘంలో చేరి రోగులకు పరిచర్య చేసాడు. తర్వాత ఇతను చంటిక (చండిక) అను దేవతను ఉపాసిస్తూ 12ఏండ్లు గడిపాడు.
 
హయఘోషుని వద్ద తారక మంత్రమును నేర్చుకున్నాడు.కు(గు)హ్యశీలు డనబడు బ్రాహ్మణుని శిష్యుడయిన త్రిపిట్కాచార్య హయపాలుని శిష్యుని కుమారుడు ఈ హయఘోషుడు.ధాన్యకటకంలో ఉన్న గొప్పలంకలోని మఠంలో నాగార్జునుడు మహాకాళే మంత్రమును, కురుకుల తంత్రం మొదలయినవాటిని గ్రహించాడు.
 
తర్వాత ఇతను మధ్యదేశంలో నూరు విహారములను నిర్మాంచాడు.అక్కడ మహాయానమునకు ధర్మములను ఏర్పాటు చేశాడు.ఆధర్మసంస్థకు మహాకాళీ మూర్తిని చేయించినాడు. వజ్రశాన (బుద్ధగయ) లోని బోధిద్రుమంపై మాతంగులకున్న విరోధమును మానిపాడు.అక్కడ వృక్షం చుట్టూ బయట శరీర నిదానమును ఏర్పాటు చేసాడు.దాని చుట్టూ రాతి కిటికీలు గల చైతన్యములను 108 ని నిర్మాంచాడు. దక్షిణాపధంలో ధాన్యకటకంలో ఉన్న చైత్యం చుట్టూ ఇనుపరాతితో ప్రాకారం నిర్మించాడని వివరించబడినది.
 
తర్వాత ఇతను దక్షినాట్యంలో ఉన్న జటసంఘరులయొక్క 500 వేదాంతులని ఓడించాడు.ఈవిధంగా శాసనం (ధర్మం) కొరకు వివిధ కార్యక్రములను పూర్తిచేశాడు.
 
<nowiki>'''తర్వాత తారా (శక్తి) ప్రేరణవల్ల శ్రీగిరి (శ్రీ కూటం) లో నిలబడిపోయినాడు.చివరకు రాజభాగుని (భద్రుని) చిన్న కుమారుడు వసుశక్తి, నాగార్జుని విరోధుల ప్రేరణవలన నాగార్జుని శిరస్సుని భిక్షలో అడిగాడు.దానిమీదట నాగార్జునుడు తన శిరస్సును దానం ఇచ్చి సుఖవతిస్థితిని పొందాడు.'''</nowiki> ఈవిధంగా అర్ధప్రకాశలో చెప్పబడిఉన్నది. తర్వాత ఈశిరస్సు నాలుగు యోజనములు విసిరి వేయబడ్డది.ఆశిరస్సు మొండెంతో కలిసి, మానవధర్మమును నెరవేర్చునని చెప్పబడినది.
 
ఈవిధంగా ఇక్కడ 200 సం.లు, మధ్యప్రదేశంలో 12 సం.లు, ఉత్తరాపధం. కింపురుష 200 సం.లు, పూర్వదేశంలో 100 సం. శ్రీగిరిలో 129 లేక 71 సం.లు జీవించినాడు అని టిబెట్టు గ్రంధములు తెలుపు చున్నవి.
 
శ్రీ.ఎస్.సి దాస్ అనే శాస్త్రవేత్త టిబెట్టు నుండి పలు గ్రంధములను సేకరించి అచ్చు వేయించినాడు.అందులో <nowiki>'DpagBsam' అనే గ్రంధము ఒకటి కలదు. ఇందులో నాగార్జుని జన్మస్థలము గురించి కొన్ని విషయములున్నవి. నాగార్జునుడు దక్షిణాపధంలొ ఉన్న '''కహోర'''</nowiki> అనేచోట జన్మించాడు. ఇది కంచిదగ్గర ఉన్నది. ఇతని కుటుంబం ఇక్కడి నుండి వెళ్ళి విదర్భలో ఉంటూ ఉండవచ్చు.ఇతని ముఖ్య శిష్యులలో ఒకడు నాగహవుడు ఒకడు.ఇతనే తధాగతభద్రుడు. ఇతను తన గురువువలే నలేంద్రలో ఆచార్య పదవిలో ఉన్నాడు.నాగార్జునుడు ఆంధ్ర సింహళములోని ధాన్యకటక, శ్రీగిరిమఠములలో పెక్కు ఏండ్లుండి పని చేశాడు.
 
టిబెట్టు వారి భూగోళ శాస్త్రంలో ధాన్యకటకమనగా కృష్ణడెల్టా లో ఉన్నదని, దానిని ధనశ్రీలంక అని కూడా అంటారని ఉంది.
 
నాగ+అర్జునుడు అనగా నాగులకు అర్జునిని వంటి వాడని నాగులకు దీపకుడంటివాడు. ఈనాగులెవరు? తక్షుడు నాగరాజు కనుక తక్షశిల దేశం నాగదేశమం అని అందురు.కాని బౌద్ధకధలలో ఆంధ్రదేశము నాగదేశంగా చెప్పబడినది. [[అమరావతి (గ్రామం)|అమరావతి]] చైత్యపురాళ్ళలో నాగుల విగ్రహాలు అనేకం ఉన్నవి.మనలో నాగులపేర్లు కనుక నాగార్జుని నాటికి మన ఆంధ్రదేశంగానే భావించవచ్చును.
 
నాగార్జునుడు విద్యను నేర్చుకొనుటకు ఎంత శ్రమించాడో, ప్రచారం చెయుటకూ అంతే శ్రమించాడు. సువర్ణ విద్యను ఒక సారా అమ్మే మామూలు స్త్రీ వద్ద నేర్చుకొన్నాడు. తంత్ర విద్యలకు దక్షిణాపధం నుండి తక్షశిలవరకూ తిరిగాడు. ఇందులో ఇతనికి స్వార్ధం లేదు. నిస్సంగి, ఇన్ని విద్యలు తెలిసినవారు ఉండరేమో కదా!అనేక గ్రంధములకు వ్యాఖ్య రచించాడు. ఘూష అనగా సింహం గర్జించినట్లు చెప్పుట.మూడుసార్లు ధర్మఘోష చేశాడు.సింహం ఎట్లా నిస్సంకోచంగా గర్జిస్తుందో అట్లా ధర్మఘోష చేయమని బుద్ధ భగవానుడు చెప్పాడు.
 
== మాధ్యమిక వాదం ==
"https://te.wikipedia.org/wiki/నాగార్జునుడు" నుండి వెలికితీశారు