అంగన్వాడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Anganwadi logo.jpg|thumb|165x165px|అంగన్వాడి చిహ్నం]]
[[భారత దేశం]]లోని బాల బాలికలకు, గర్బవతులకు (ముఖ్యంగా పేద వారి పిల్లలకు, పేద మహిళలకు) పుష్టికరమైన ఆహారము (సంపూర్ణ ఆహారము) అందటంలేదని, వారికి [[పౌష్టికాహారం]] అందించాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వము, '''ఆంగన్‌వాడీ''' (Anganwadi) కేంద్రాల వ్యవస్థను ప్రవేశ పెట్టింది. ఆంగన్‌వాడీ కేంద్రం సిబ్బందికి, కేంద్ర ప్రభుత్వం కొంత వాటా, రాష్ట్రప్రభుత్వం కొంత వాటా కలిపి, జీతంగా ఇస్తాయి. ప్రభుత్వం ఇచ్చే వేతనం ఈ కేంద్రాలలో సేవలు అందించే ఆంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది (కార్యకర్త) కి కేంద్ర ప్రభుత్వము, రూ. 1500, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రూ.700 మొత్తం రూ.2200 ఇస్తుంది. ఆంగన్‌వాడీ కేంద్రంలోని సహాయకులకు కేంద్ర ప్రభుత్వము రూ.750, రాష్ట్ర ప్రభుత్వము రూ.500 మొత్తం రూ. 1250 ఇస్తుంది. 28 ఫిబ్రవరి 2011 నాటి బడ్జెట్టులో వీరికి ఇచ్చే జీతం రెట్టింపు చేసారు. కార్యకర్తకు రూ.1500 నుంచి రూ.3000 పెంచారు (కేంద్ర ప్రభుత్వం రూ.3000 + ఆం.ప్ర. ప్రభుత్వం రూ.700 మొత్తం రూ.3700 ఒక కార్యకర్తకు అందుతుంది). సహాయకులకు రూ. 750 నుంచి రూ.1500 కేంద్ర ప్రభుత్వం పెంచింది (కేంద్ర ప్రభుత్వం రూ.1500 + ఆం.ప్ర. ప్రభుత్వం రూ.500 మొత్తం రూ.2000 ఒక సహాయకునికి అందుతుంది). దేశ వ్యావ్తంగా 22 లక్షలమంది ఆంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు ఉన్నారని అంచనా. పెంచిన జీతాలు 1 ఏప్రిల్ 2011 నుంచి అమలు లోకి వస్తాయి.
 
"https://te.wikipedia.org/wiki/అంగన్వాడి" నుండి వెలికితీశారు