భారతీయ స్టేట్ బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
'''భారతీయ స్టేట్ బ్యాంకు''' లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India - SBI) భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు. బ్రాంచీల సంఖ్య మరియు పనిచేయు సిబ్బంది ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. [[1806]]లో [[కోల్‌కత]]లో స్థాపించబడిన ఈ బ్యాంకు భారత ఉపఖండంలోనే అతి పురాతనమైన బ్యాంకులలో ఒకటి. ఈ బ్యాంకు దేశీయ, అంతర్జాతీయ మరియు ప్రవాస భారతీయ సేవలను కల్గజేస్తుంది. [[1955]]లో [[భారత ప్రభుత్వము]] ఈ బ్యాంకును జాతీయం చేసి తన అధీనం లోకి తీసుకుంది. ఇటీవల కాలంలో స్టేట్ బ్యాంకు రెండు ప్రధాన చర్యలను చేపట్టింది. మొదటిది పనిచేయు సిబ్బంది సంఖ్యను కుదించడం కాగా రెండవది కంప్యూటరీకరణ.
== ప్రారంభ బీజాలు ==
19 వ శతాబ్దంలోనే దీని స్థాపనకు బీజాలు ఏర్పడ్డాయి. తర్వాత [[బ్యాంక్ ఆఫ్ బెంగాల్]] గా పేరు మార్చుకున్న [[బ్యాంక్ ఆఫ్ కలకత్తా]] [[2 జూన్]], [[1806]] న స్థాపించబడింది. తరువాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్ మరియు రెండు ఇతర ప్రెసిడెన్సి బ్యాంకులు [బ్యాంక్ ఆఫ్ బాంబే (1840 లో స్థాపన) మరియు బ్యాంక్ ఆఫ్ మద్రాస్ (1921 లో స్థాపన) ] కలిపి ఇంపీరియల్ బ్యాంకుగా ప్రభుత్వం మార్చివేసింది. ప్రెసిడెన్సీ బ్యాంకుల మాదిరిగానే ఇంపీరియల్ బ్యాంకు కూడా జాయింట్ స్టాక్ కంపెనిగా కార్యకలాపాలు నిర్వహించింది. దేశంలో రిజర్వు బాంకు స్థాపించేవరకు ఈ బాంకు దేశ కేంద్ర బ్యాంకుగా నోట్ల ముద్రణ విధులను కూడా నిర్వహించింది.
 
భారతీయ స్టేట్ బ్యాంక్ చట్టం, 1955 ప్రకారం దేశంలో కేంద్ర బ్యాంకు అయిన [[రిజర్వ్ బ్యాంక్]] ఆదేశాల ప్రకారము [[30 ఏప్రిల్]], [[1955]] నాడు ఇంపీరియల్ బ్యాంకుకు ఉన్న అధీకృత మూలధనం మొత్తం నూతనంగా ఏర్పాటుచేయబడిన భారతీయ స్టేట్ బ్యాంకుకు మార్చబడింది.
 
== కాలగమనంలో స్టేట్ బాంకు ==
* [[21 జూన్]], [[1806]]: కలకత్తా బ్యాంకు స్థాపన.