రామ్ రహీం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
రామ్‌ - రహీమ్‌ ఒకే తరగతిలో చదువుకునే విద్యార్థులు. ఇద్దరూ ప్రాణమిత్రులు. రామ్‌ తండ్రి రాజయ్య జగన్మోహనరావు అనే శ్రీమంతుడి వద్ద లారీడ్రైవరుగా పని చేస్తుంటాడు. జగన్మోహనరావు పైకి పెద్దమనిషిగా చలామణి అవుతున్నా అతను చేసేది మాత్రం స్మగ్లింగ్ వ్యాపారం.
 
రాజయ్య జూదరి, త్రాగుబోతు. తను సంపాయించిన డబ్బంతా ఈ వ్యసనాలకే తగలేస్తుంటాడు. రాజయ్య భార్య లక్ష్మి చుట్టుపక్కల ఇళ్ళల్లో పనిమనిషిగా వుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వుంటుంది. రాజయ్య తల్లి తన కొడుకు ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తించినా ఎప్పుడూ అతడినే వెనకేసుకొస్తుంది. తండ్రి కారణంగా తల్లి, అక్క రాధ, తమ్ముడు అందరూ ఇంట్లో బాధలకు, అశాంతికి గురవుతూ వుండడం చూస్తూ రామ్‌ కుమిలిపోతూ వుంటాడు. రహీమ్‌ అతన్ని ఎప్పటికప్పుడు ఓదారుస్తూ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు.
 
రహీమ్‌ తండ్రి ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్. తన విధి నిర్వహణపట్ల, క్రమశిక్షణ పట్ల కఠినంగా వుండే వ్యక్తి. అతని భార్య 'బేగం' భర్తకు అనుకూలవతియైన ఇల్లాలు. రహీమ్‌ ఇంటికి తరచుగా వస్తూ వుండే రామ్‌ ఆదర్శవంతమైన ఆ కుటుంబాన్ని చూసి, తన కుటుంబాన్ని తలచుకుంటూ బాధ పడుతూ వుంటాడు.
 
వెంకట్రామయ్య అనే ఓ సంపన్నుడి కూతురు కమలకు రామ్‌ అక్కయ్య రాధకూ గల స్నేహం వల్ల అప్పుడప్పుడూ రాధను తమ ఇంటికి తీసుకు వెళ్తూ వుండేది కమల. ఆ విధంగా కమల సోదరుడు శ్యామ్‌కు రాధకు పరిచయమై ఆ పరిచయం క్రమక్రమంగ ప్రేమగా మారింది.
 
రామ్‌ ఒక రోజు స్కూలు ఫీజుకని డబ్బడిగితే చదువు మానెయ్యమని చెప్పాడు రాజయ్య. ఇంటి పరిస్థితులను చూస్తూ, ఇక గత్యంతరం లేక చదువు మానేసి రిక్షా తొక్కసాగాడు రామ్‌. రెండో కొడుకు జబ్బు పడితే, మందులు తేవడానికని రామ్‌ తెచ్చిన డబ్బును తీసుకెళ్ళి తాగుడుకూ, జూదానికీ ఖర్చు పెట్టాడు రాజయ్య.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/రామ్_రహీం" నుండి వెలికితీశారు