పిచ్చి పుల్లయ్య (1953 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
== విడుదల, స్పందన ==
1953లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అయితే సినిమా సందేశాత్మకమైనది కావడంతో విమర్శకుల ప్రశంసలు లభించాయి.<ref name="60 ఏళ్ళ ఎన్.ఏ.టి." />
 
== చిత్ర ప్రత్యేకతలు ==
# ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్. డిగ్లామరైజ్ (పిచ్చివాడి) పాత్రలో నటించి, సహజసిద్ధమైన నటనతో, హాస్యంతో తన ప్రతిభను చాటుకున్నారు.
# ఎన్.టి.ఆర్. తన తమ్ముడైన నందమూరి త్రివిక్రమరావుకు ఈ చిత్ర నిర్మాణ బాధ్యతను, ఒకప్పటి తన రూమ్మేట్ అయిన తాతినేని ప్రకాశరావుకు దర్శకత్వ బాధ్యతను అప్పగించారు.
# తాతినేని ప్రకాశరావు ఈ చిత్రంలోని విలన్ పాత్రను తన స్నేహితుడైన [[ఎస్వీ రంగారావు]] దృష్టిలో ఉంచుకొని రాసుకున్నాడు. అయితే, తన మొదటి ప్రొడక్షన్ లో గుమ్మడికి అవకాశం ఇస్తానని మాట ఇచ్చిన ఎన్.టి.ఆర్., పట్టుబట్టి మరీ ఆ పాత్రను గుమ్మడిచే చేయించారు. అందుకే, ఈ చిత్రంలోని గుమ్మడి నటన ఎస్వీ రంగారావు నటనను పోలివుంటుంది.
# ఈ చిత్రంతో టి.వి.రాజు సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు.
# ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్. చెప్పిన ‘‘ఈ పట్నంలో అసలు పూలకంటే, కాగితం పూలే ఎక్కువల్లే ఉన్నాయే’’ అనే డైలాగ్ ప్రేక్షకులకు బాగా కనెక్టు అయింది.<ref name="Pitchi Pullaiah (1953)">{{cite news|last1=ది హిందూ|title=Pitchi Pullaiah (1953)|url=http://www.thehindu.com/features/cinema/cinema-columns/pitchi-pullaiah-1953/article5228790.ece|accessdate=14 July 2017}}</ref>
 
== మూలాలు ==