చిలగడదుంప: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
'''చిలగడదుంప''' (Sweet Potato) ఒక విధమైన [[దుంప]]. దీని శాస్త్రీయ నామము ఐపోమియా బటాటాస్ (Ipomea batatas). దీనినే కొన్ని ప్రదేశములలో గెనసుగడ్డలు, మొహర్రంగడ్డ, ఆయిగడ్డ, రత్నపురిగడ్డ, కంద గడ్డ అని కూడా అంటారు.
ఇవి రకరకాల రంగులలో లభిస్తున్నాయి
# లేత [[పసుపు]]
# [[నారింజ]]
# గులాబి రంగు
==ఉపయోగాలు==
చిలగడ దుంపలను చాలామంది పెద్దగా పట్టించుకోరు గానీ వీటిల్లో పోషకాలు దండిగా ఉంటాయి. ఉడికించుకునో, ఆవిరిపై ఉడికించో, కాల్చుకునో, కూరగా[[కూర]]<nowiki/>గా వండుకునో.. రకరకాలుగా వీటిని తినొచ్చు. సలాడ్లకూ ఇవి మరింత రుచిని తెచ్చిపెడతాయి. కాబట్టి వీటిని వారానికి కనీసం రెండు సార్లయినా తినటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ---
===[[పీచు]]===
బంగాళాదుంప, కందగడ్డల్లో కన్నా చిలగడదుంపల్లో [[పీచు]] మోతాదు చాలా ఎక్కువ. దీంతో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కేలరీలు విడులయ్యేలా చేస్తాయి.
===[[విటమిన్‌ బీ6]]===
చిలగడదుంపల్లో విటమిన్‌ బీ6 దండిగా ఉంటుంది. [[రక్తనాళాలు]] బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టీన్‌ను విటమిన్‌ బీ6 విడగొడుతుంది. అందువల్ల వీటితో గుండె, రక్తనాళాల సమస్యలు దూరంగా ఉంటాయి.
===[[పొటాషియం]]===
ఒంట్లో ఎక్కువగా ఉన్న ఉప్పును తొలగించి, నీటి మోతాదును నియంత్రిస్తూ అధిక రక్తపోటును[[రక్తపు పోటు|రక్తపోటు]]<nowiki/>ను తగ్గించటంలో [[పొటాషియం]] కీలకపాత్ర పోషిస్తుంది. చిలగడదుంపల్లో పొటాషియం మోతాదూ అధికంగానే ఉంటుంది.
===[[విటమిన్‌ ఏ]]===
చిలగడదుంపల్లో విటమిన్‌ ఏ లేదా బీటా కెరటిన్‌ ఎక్కువ. ఇది ఎండకు [[చర్మము|చర్మం]] దెబ్బతినకుండా కాపాడుతుంది. చూపు తగ్గిపోకుండా చూస్తుంది.
===[[మాంగనీసు]]===
పిండి పదార్థాల జీవక్రియల్లో చాలా కీలమైన [[మాంగనీసు]] కూడా వీటిల్లో అధికం. అందువల్ల ఇవి రక్తంలో [[గ్లూకోజు]] మోతాదులు సాధారణ స్థాయిలో ఉండేలా తోడ్పడతాయి.
===విటమిన్‌ సి, ఈ===
వీటిల్లోని విటమిన్‌ సి రోగనిరోధకశక్తిని పెంచితే.. విటమిన్‌ ఈ మన చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడేందుకు తోడ్పడుతుంది.
===సహజ చక్కెరలు===
లగడదుంపల్లో దండిగా ఉండే సహజ చక్కెరలు రక్తంలో నెమ్మదిగా కలుస్తాయి. అందువల్ల రక్తంలో ఒకేసారి చక్కెర మోతాదు పెరగకుండా చూస్తాయి. ఇలా [[బరువు]] పెరగకుండా, నిస్సత్తువ రాకుండా కాపాడతాయి.
నలుపు మరకలు లేని, గట్టి దుంపలు మంచి రుచిగా ఉంటాయి
{{nutritionalvalue | name=Raw Sweet Potato | kJ=360| protein=1.6 g | fat=0.1 g | carbs=20.1 g | fiber=3.0 g | | sugars=4.2 g | iron_mg=0.6 | calcium_mg=30.0 | magnesium_mg=25.0 | phosphorus_mg=47.0 | potassium_mg=337| zinc_mg=0.3 | vitA_ug = 709 | betacarotene_ug=8509 | vitC_mg=2.4 | pantothenic_mg=0.8 | vitB6_mg=0.2 | folate_ug=11| thiamin_mg=0.1 | riboflavin_mg=0.1 | niacin_mg=0.61 | right=1 | source_usda=1 }}
"https://te.wikipedia.org/wiki/చిలగడదుంప" నుండి వెలికితీశారు