మరియం మిర్జాఖనీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
 
1999 లో ఆమె షరీఫ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి గణితంలో [[బీయస్సీ]] చేసింది. తరువాత [[గ్రాడ్యుయేషన్]] కోసం [[అమెరికా]] వెళ్ళి [[హార్వర్డ్]] విశ్వవిద్యాలయం నుంచి 2004 లో డాక్టరేటు సాధించింది. అక్కడ ఆమె ఫీల్డ్స్ పురస్కార గ్రహీత అయిన కర్టిస్ మెక్ ముల్లన్ పర్యవేక్షణలో పనిచేసింది. 2004 లోనే క్లే మ్యాథమాటిక్స్ ఇన్స్ స్టిట్యూట్ లో పరిశోధకురాలిగా, ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా ఉండింది.
 
== మరణం ==
2013 లో ఆమెకు [[రొమ్ము క్యాన్సర్]] సోకింది. అది నెమ్మదిగా ఆమె [[ఎముక మజ్జ]]<nowiki/>లోకి ప్రవేశించగా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి జులై 14, 2017 న మరణించింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మరియం_మిర్జాఖనీ" నుండి వెలికితీశారు