ఉమాసుందరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
 
== కథ ==
మహారాజు భూపి (నాగయ్య) సోదరి ఉమాసుందరి (జూనియర్ శ్రీరంజని). ఆమె వదినె నీలవేణి (కన్నాంబ). పిల్లలులేని ఆ దంపతులు ఉమాసుందరిని గారాబంగా పెంచి పెద్ద చేస్తారు. ఉమాసుందరిని తన తమ్ముడు అలంకార భూపతి (రేలంగి)కి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటుంది నీలవేణి. ఉమాసుందరి అందుకు అంగీకరించక పోవటంతో ఆమెపై క్రోధం, అసూయ పెంచుకుంటుంది. రాయదుర్గం చక్రవర్తి విజయరాయలు (ఎన్టీఆర్) శివాలయంలో చూసి ఇష్టపడిన ఉమాసుందరితో వివాహానికి ఆమె అన్నగారికి కబురు చేస్తాడు. ఉమాసుందరి అంగీకారంతో వారిరువురికీ వివాహం జరుగుతుంది. ఉమాసుందరికి తొలుత మగబిడ్డ జన్మిస్తాడు. తరువాత వారికి వరుసగా ఆరుగురు సంతానం, దాంతోపాటు వారి రాజ్యంలో ‘సప్తవర్ష క్షామం’ ఏర్పడి.. రాజ్యం, ప్రజలు కడగండ్ల పాలవుతారు. పుట్టింటి సాయం కోసం ఉమాసుందరి పంపిన వర్తమానాలు, నీలవేణి కారణంగా అందకపోవటం జరుగుతుంది. భర్త సలహాతో పిల్లలతో పుట్టిల్లు చేరిన ఉమాసుందరిని వదిన నీలవేణి నానా హింసలు పెట్టి తరిమేస్తుంది. భూపతికి నిజం తెలిసి నీలవేణిని నిలదీయగా, ఆమె తన క్రోధం తెలిపి ఆత్మహత్య చేసుకుంటుంది. అడవిలో భార్యా పిల్లల కోసం వెదకుతున్న రాయలకు శివుడు ([[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]]) జ్ఞానబోధ చేస్తాడు. పిల్లలను బావిలో తోసి తానూ మరణించాలనుకున్న ఉమాసుందరిని పార్వతీదేవి (రమాదేవి) అడ్డుపడి ఆపుతుంది. బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం, ఉల్లంఘన చేసి బొమ్మలను దాచుకుందని, దాని ఫలితంగానే ఈ కష్టాలని వివరిస్తుంది. ఇపుడు ఆమె పిల్లలను బావిలో వేయటంతో వ్రతం పూర్తైతే ఆమె కష్టాలు తొలిగాయని వివరిస్తుంది. భర్త రాయలు, అన్నగారు భూపతి రావటం, పిల్లలందరూ బ్రతికి రావటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ఉమాసుందరి" నుండి వెలికితీశారు